ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 9 ఎపిసోడ్: తాళి తీసేయమన్న భద్రావతి-అత్తకు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రేమ-దొరికిన సీక్రెట్ వీడియో
Illu Illalu Pillalu June 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 9 ఎపిసోడ్ లో భద్రావతి, సేనాపతికి ప్రేమ మాములు షాక్ ఇవ్వదు. ధీరజ్ మీద ఉన్న ప్రేమ గురించి గొప్పగా చెప్తుంది. ధీరజ్ ను కేసులో నుంచి బయటకు తీసుకొస్తానంటుంది. నర్మద, ప్రేమ కలిసి ఆపరేషన్ ధీరజ్ రిలీజ్ ను స్టార్ట్ చేస్తారు.
Illu Illalu Pillalu June 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 9 ఎపిసోడ్ లో.. భద్రావతికి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది ప్రేమ. ధీరజ్ ను నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఛాలెంజ్ చేస్తుంది. నర్మద, ప్రేమ కలిసి అదే పని మీద ఉంటారు. ఇంకా ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో చూసేయండి.

భద్రావతి మురిపెం
ప్రేమ తన పుట్టింటికి వెళ్లిపోతుంది. నేను మళ్లీ ఇంటికి వచ్చేస్తే ధీరజ్ ను కేసు నుంచి విడిపిస్తానని చెప్పావ్ కదా. ధీరజ్ ను విడిపించమని భద్రావతిని అడుగుతుంది ప్రేమ. సేనా, విశ్వ మన ప్రేమ శాశ్వతంగా మన ఇంటికి వచ్చేసిందని భద్రావతి తెగ సంతోషపడిపోతుంది.
భర్తను వదిలేస్తావా?
ప్రేమ ఏంటే పిచ్చి పని, తాళి కట్టిన భర్తను వదిలేసి వస్తావా? మూడు ముళ్ల బంధాన్ని తెంచేసుకుంటావా? అని శారదాంబ, రేవతి కలిసి బుద్ధి చెప్పాలని చూస్తారు. కానీ వాళ్లను భద్రావతి తిడుతుంది. కూతురిని చూసుకుని సేనాపతి మురిసిపోతాడు. ఇదంతా చూస్తున్న నర్మద ఫీల్ అవుతుంది. శ్రీవల్లి, సుక్కు ఎమో చంకలు గుద్దుకుంటారు.
దిమ్మతిరిగే షాక్
నీ మెడలో వాడు కట్టిన తాళి ఎందుకు? తీసి పారేయ్ అని ప్రేమ తాళిని భద్రావతి పట్టుకుంటుంది. కానీ అత్త చేతిని పట్టుకుని ప్రేమ నవ్వుతుంది. నా గుండెలో ప్రాణం ఉన్నంతవరకూ ధీరజ్ కట్టిన తాళిని, ధీరజ్ ప్రేమను వేరు చేయడం నీ వల్ల కాదని భద్రావతికి దిమ్మతిరిగే షాకిస్తుంది ప్రేమ. శాశ్వతంగా బంధాన్ని తెంచేసుకున్నానంటే నమ్మేశావా? మా మధ్య ఉన్న ప్రేమ ఒకరికోసం ఒకరు బతకడం. చావైనా, బతుకైనా వాడితోనే. మధ్యలోనే చేయి విడిచిపెట్టి వస్తానని ఎలా అనుకున్నారని ప్రేమ చెప్తుంది.
సత్యభామలా పోరాడతా
వాడు జీవితాంతం జైల్లోని మగ్గిపోతాడని సేనాపతి అంటాడు. మీకు కుట్రలు చేసి నా భర్తను ఇరికించడం తెలిస్తే, నాకు యుద్ధం చేసి నా భర్తను విడిపించడం తెలుసు. సత్యభామలా పోరాడతా. భర్తను నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ప్రేమ చెప్పడంతో అక్కడే ఉన్న నర్మద విజిల్ వేసి, క్లాప్స్ కొడుతుంది. తిరిగి తిరిగి నా కాళ్ల దగ్గరకే వస్తావని భద్రావతి అంటుంది. నా భర్త రిలీజై రావడాన్ని మీరు కళ్లారా చూస్తారు, రెడీగా ఉండండని చెప్పి ప్రేమ వెళ్లిపోతుంది.
ధీరజ్ కోసం
బయటకు వెళ్లిన తర్వాత ప్రేమను నర్మద హగ్ చేసుకుంటుంది. నువ్వు నిజంగానే పుట్టింటికి వెళ్తావేమోనని భయపడ్డానని నర్మద అంటుంది. ధీరజ్ లా ప్రేమించే భర్త నాకు దొరకడని ప్రేమ చెప్తుంది. రామరాజు కోడళ్ల పవర్ చూపిద్దాం. ధీరజ్ ను బయటకు తీసుకొద్దామని నర్మద అంటుంది. అప్పుడే లాయర్ కు ఫోన్ చేసి ధీరజ్ కు బెయిల్ వస్తుంది కదా అని అడుగుతుంది. కానీ అది డ్రగ్స్ కేసు కాబట్టి ఆశలు పెట్టుకోవద్దని లాయర్ చెప్తాడు.
ధీరజ్ ను కోర్టుకు తీసుకెళ్లకుండానే నిర్దోషిగా బయటకు తీసుకు రావాలక్కా అని నర్మదతో ప్రేమ అంటుంది. ఆ మాదక ద్రవ్యాలకు, ధీరజ్ కు సంబంధం లేదని నిరూపిస్తే బయటకు తీసుకురావచ్చని నర్మద చెప్తుంది. అయితే ఎంక్వైరీ మొదలు పెడదామని ప్రేమ, నర్మద వెళ్తారు. ఇదంతా చూసి శ్రీవల్లి, సుక్కు నవ్వుకుంటారు. నేను వాళ్లను ఫాలో చేస్తానని సుక్కు వెళ్తుంది.
సీసీ టీవీ ఫుటేజీ
రోడ్డు మీదకు వెళ్లి అందరిని ప్రేమ అడుగుతుంది. దానికి పక్కా ఎవిడెన్స్ కావాలి. ఆ సాక్ష్యాలతో పాటు వాడిని మనం పోలీసులకు పట్టించాలి. సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డు అవుతాయని నర్మద చెప్తుంది. సీసీ టీవీ ఫుటేజీ కోసం పక్కనే ఉన్న ఓ షాప్ లోకి వెళ్తారు. ఆ షాప్ లో పెద్ద మనిషికి ఉన్న చాదస్తంతో ఫుటేజీ ఇవ్వనంటాడు. నర్మదకు చిర్రెత్తుకొచ్చి తల పగలకొడతానని అంటుంది.
ఫోన్ లో వీడియో
ఆ వ్యక్తి మామిడి పళ్ల బాక్స్ లతో రావడం, కారు ఎక్కడం అంతా సీసీటీవీలో రికార్డయింది. ఆ ఫుటేజీని నర్మద వీడియో తీసుకుంటుంది. ఓ ట్రాఫిక్ ఎస్సైకి కాల్ చేసి బండి నంబర్ ఆధారంగా పేరు, అడ్రస్ ఇవ్వమని నర్మద అడుగుతుంది. ఇదంతా చూసిన సుక్కు ఈ విషయాన్ని అత్తకు చెప్పాలని వెళ్లిపోతుంది.
మరోవైపు వేదవతి ఏడుస్తూ ఉంటుంది. చిన్నోడికి బెయిల్ వస్తుందని లాయర్ చెప్పాడు. ఏం టెన్షన్ పడకండని తండ్రి రామరాజుతో చందు చెప్తాడు. కానీ ఇది చిన్నా చితకా కేసు కాదు అని రామరాజు అనడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


