ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 10 ఎపిసోడ్: ధీరజ్ జైలుకు వెళ్లే టైమ్‌లో ఊహించని ట్విస్ట్.. రౌడీ, ఆధారాలు దొరికినా ఎస్సై కుట్ర

Illu Illalu Pillalu June 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 10 ఎపిసోడ్ లో డ్రగ్స్ పెట్టిన రౌడీని పట్టుకునేందుకు ప్రేమ, నర్మద ప్రయత్నిస్తారు. వీళ్లను అడ్డుకునేందుకు భాగ్యం, ఇడ్లీ బాబాయ్ వస్తారు. ధీరజ్ ను కోర్టుకు తీసుకెళ్లే లాస్ట్ మినిట్ లో ప్రేమ, నర్మద ఆ రౌడీని పోలీసులకు అప్పగిస్తారు. 

Published on: Jun 10, 2026, 07:51:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu June 10 Episode: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ధీరజ్ నిర్దోషి అని నిరూపించడానికి ప్రేమ, నర్మద ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు. మరోవైపు భాగ్యం, ఇడ్లీ బాబాయ్ పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 10 నాటి పూర్తి ఎపిసోడ్‌లో ఎలాంటి హై డ్రామా నడిచిందో ఇప్పుడు చూద్దాం.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

కుమిలి కుమిలి ఏడ్చిన వేదవతి

ఎపిసోడ్ ప్రారంభంలో ధీరజ్‌ను తలుచుకుంటూ ఇంట్లో వేదవతి కుమిలి కుమిలి ఏడుస్తుంది. బెయిల్ రావడానికి ఇది చిన్నా చితకా కేసు కాదని చందుతో రామరాజు అంటాడు. ఏడుస్తున్న వేదవతిని చూసి, కోర్టుకు వెళ్దామని రామరాజు చెప్తాడు.

కానీ, "కోర్టు దగ్గర నా కొడుక్కి శిక్ష పడితే తట్టుకునే శక్తి నా గుండెకు లేదు. నా ముద్దుల కొడుక్కి ఏమైనా అయితే ఈ అమ్మ ప్రాణం ఆగిపోతుంది. ఏవండీ, ఏదో ఒకటి చేసి నా కొడుకును బయటకు తీసుకు రండి" అని భర్తను పట్టుకుని వేదవతి తల్లడిల్లిపోతుంది. చిన్నోడు ఏ తప్పు చేయలేదు, వాడు నిర్దోషిగా బయటకు వస్తాడని తండ్రికి ధైర్యం చెప్పి చందు అక్కడి నుంచి తీసుకెళ్తాడు.

ఎస్సై పొగరుబోతు మాటలు

మరోవైపు పోలీస్ స్టేషన్ సెల్‌లో ధీరజ్ దీనంగా కూర్చుని ఉంటాడు. "ప్రేమ, నర్మద వదిన నా కోసం చాలా కష్టపడుతున్నారు. ఇంకా రాలేదంటే ఎవిడెన్స్ దొరకలేదేమో" అని కంగారుపడుతుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్సై పొగరుగా మాట్లాడతాడు. "బెయిల్ వస్తుందేమోనన్న నమ్మకంతో మురిసిపోతున్నావేమో.. నువ్వు అత్తారింటికి దారేది అనుకుంటూ జైలుకు వెళ్లాల్సిందే" అని ధీరజ్‌ను అవహేళన చేస్తాడు.

భాగ్యం, ఇడ్లీ బాబాయ్ సంబరం

అదే సమయంలో ట్రాఫిక్ ఎస్సై నర్మదకు కాల్ చేసి, కారులో డ్రగ్స్ పెట్టిన రౌడీ అడ్రస్ చెప్తాడు. దాంతో ప్రేమ, నర్మద స్పీడ్‌గా అక్కడికి బయలుదేరుతారు. మరోవైపు "ఎన్నాళ్లో వేచిన ఉదయం" అంటూ భాగ్యం, ఇడ్లీ బాబాయ్ పాటలు పాడుకుంటూ స్టెప్పులేస్తారు. కాసేపట్లో ధీరజ్‌కు జైలు శిక్ష పడబోతుందని సంబరపడతారు.

ప్రేమ కన్నీళ్లు

అయితే, భాగ్యానికి సుక్కు కాల్ చేసి.. ఎవిడెన్స్ కోసం ప్రేమ, నర్మద రౌడీని పట్టుకోవడానికి వెళ్తున్నారనే నిజం చెప్తుంది. ఆ రౌడీ వాళ్లకు దొరకకుండా చేయమని సుక్కు ప్లాన్ ఇస్తుంది. దాంతో భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కూడా అక్కడికి చేరుకుంటారు. ప్రేమ, నర్మద ఆ రౌడీని పట్టుకునే టైమ్‌లో భాగ్యం గట్టిగా అరవడంతో వాడు పారిపోతాడు. చివరి నిమిషంలో ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో.. "ధీరజ్ జైలుకు వెళ్తాడేమోనని భయంగా ఉంది అక్కా" అని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

చివరి నిమిషంలో అదిరిపోయే ట్విస్ట్!

పోలీసులు ధీరజ్‌ను కోర్టుకు తీసుకెళ్లడానికి జీపు ఎక్కిస్తుంటారు. అక్కడికి వచ్చిన రామరాజును చూసి.. "నా కారణంగా మీ కళ్లలో నీరు రాకూడదు నాన్న" అని ధీరజ్ అంటాడు. "ఇంత గొప్ప కొడుకును కన్నందుకు నాకు గర్వంగా ఉందిరా, నీకు బెయిల్ వస్తుంది ధైర్యంగా ఉండు" అని తండ్రి చెప్తాడు.

సరిగ్గా ధీరజ్‌ను కార్లో ఎక్కిస్తుండగా.. ప్రేమ, నర్మద ఆ రౌడీని ఈడ్చుకుంటూ వచ్చి పోలీసుల కాళ్ల మీద పడేస్తారు. అది చూసి ఎస్సై కంగారుపడతాడు. "ఆ రోజు మా కారు ఎక్కింది, మామిడి కాయల బుట్టలో మాదక ద్రవ్యాలు పెట్టింది వీడే. వీడిని అరెస్ట్ చేసి మా ఆయన్ని విడిపించండి" అని ప్రేమ అడుగుతుంది.

ఆధారాలు చూపిస్తే ఎస్సై రియాక్షన్ ఏంటి?

"ఎవరో ఒకరిని తీసుకొచ్చి అరెస్ట్ చేయమంటే నేను పిచ్చోడిలా కనిపిస్తున్నానా?" అని ఎస్సై మళ్లీ పొగరుగా మాట్లాడతాడు. అప్పుడు ప్రేమ ఏమాత్రం తగ్గకుండా.. ఆ రౌడీ డ్రగ్స్ పెడుతున్న వీడియో, ఆడియోతో కూడిన సీసీటీవీ ఫుటేజీని చూపిస్తుంది. అది చూసి ఎస్సైకి చెమటలు పడతాయి.

అయినా సరే ఎస్సై కవర్ చేస్తూ.. "వీడియో చూస్తే నమ్మేయాలా? వాడు, వీడు బిజినెస్ పార్ట్‌నర్లేమో.. ఇద్దరు కలిసి మాదక ద్రవ్యాలు అమ్ముకుంటున్నారేమో" అంటూ తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

ధీరజ్ నిర్దోషి అని కోర్టు నమ్ముతుందా? ఎస్సై ఆ వీడియోను తారుమారు చేస్తాడా? ప్రేమ తన భర్తను ఎలా కాపాడుకుంటుంది? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే!

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More