ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 30 ఎపిసోడ్: శ్రీవల్లికి నర్మద రిటర్న్ గిఫ్ట్- ప్రేమ నాటకంపై నర్మద డౌట్- ఇల్లు దాటిన కోడలు

Illu Illalu Pillalu Serial June 30th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 30వ ఎపిసోడ్‌లో తనవల్లే వేదవతికి వచ్చిన కోపాన్ని తనే పోయేలా చేస్తానని నర్మదతో అంటుంది శ్రీవల్లి. డ్యాన్స్ కాంపిటీషన్‌కు వస్తున్నావా, పది లక్షలు ప్రైజ్ మనీ, నీకే వస్తుందని ప్రేమకు కాల్ చేసి ఆశపెడతాడు రాజపుష్పం.

Published on: Jun 30, 2026, 08:19:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వల్లికి అలా జరగడంతో ఆ బాధను నీ మీద చూపిస్తుందని నర్మదను అని రామరాజు వెళ్లిపోతాడు. శ్రీవల్లి వచ్చి వేదవతి మరింత కోప్పడేలా శ్రీవల్లి డ్రామా చేస్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 30వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 30వ ఎపిసోడ్

వల్లికి నర్మద రిటర్న్ గిఫ్ట్

నీవల్ల నా కడుపు పోయింది. నేనెంత బాధపడాలి అంటూ కడుపు నొచ్చినట్లుగా మాట్లాడుతుంది శ్రీవల్లి. కడుపు పోయిన నేనే చెల్లాయిని క్షమించాను. నువ్వు కూడా క్షమించు అని వల్లి అంటే వేదవతి కోపంగా వెళ్లిపోతుంది. నా వల్ల నీ మీద అత్తయ్య కోపం పెంచుకుంది కాబట్టి నేనే ఆ కోపాన్ని దూరం చేస్తానని శ్రీవల్లి అంటుంది.

నీకు పుల్లలు పెట్టడం, కాపురాలు కూల్చడం, మంటలు పెట్డమే తెలుసునుకున్నా. కానీ, మంచినీళ్ల కుండలా చల్లటి మనసు ఉందని ఇవాళే తెలిసింది. నిన్ను నీ మంచితనాన్ని గుర్తుపెట్టుకుంటాను అక్కాయి.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి నీ రుణం తీర్చుకుంటాలే అని నర్మద అని వెళ్లిపోతుంది. దాంతో మన డ్రామా నిజమని నమ్ముతుంది తింగరిది అని శ్రీవల్లి నవ్వుతుంది.

మరోవైపు డ్యాన్స్ కాంపిటీషన్‌కు వెళ్లేందుకు ధీరజ్ ఒప్పుకోవట్లేదని, నర్మద అక్కకు చెబితే ఐడియా ఇస్తుందని ప్రేమ వెళ్తుంది. వేదవతి అన్న మాటలు చిర్రుబుర్రులాడుతుంది నర్మద. ప్రేమ అడిగితే.. ఉందిగా ఆ శివంగి, గయ్యాలి గంగమ్మా అని నర్మద అంటుంది. ఆ బల్లి బండారం బయటపెట్టి అప్పుడు చెబుతా మీ అత్త సంగతి ఆ బల్లి సంగతి అని నర్మద అంటుంది.

ప్రేమ మాటలకు ఒప్పుకోని నర్మద

అది పక్కన పెట్టి నా సంగతి విను. డ్యాన్స్ కాంపిటీషన్‌కు వెళ్లేందుకు ధీరజ్‌ను ఒప్పించమని అడుగుతుంది ప్రేమ. నీకు అసలు బుద్ధుందా నువ్వు అలా వెళ్తే ఇంట్లో గొడవలు జరగుతాయని నర్మద అంటే.. ఆ కాంపిటీషన్‌లో గెలిచిన డబ్బుతో ధీరజ్‌కు కారు కొనొచ్చని ప్రేమ అంటుంది. దానికంటే ముందు మీ పుట్టింటోల్లు విమానం వేసుకుని వస్తారు. డ్యాన్స్ లేదు ఏది లేదు సైలెంట్‌గా ఉండమని నర్మద అంటుంది.

తర్వాత ప్రేమకు రాజపుష్పం కాల్ చేసి బస్టాండ్‌లో కారు, ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నామని చెబుతాడు. మా ఇంట్లో పర్మిషన్ ఇవ్వట్లేదని ప్రేమ చెబుతుంది. మొదటి ప్రైజ్ రూ. 10 లక్షలు. నీకే వస్తుంది. అదృష్టం వచ్చినప్పుడు కారు ఎక్కేసేయాలి. రా నీ పర్ఫామెన్సుతో మైమరిచిపోయేలా చేయి, 10 లక్షలు పట్టుకెళ్లిపో అని రాజపుష్పం అంటాడు.

మరోవైపు భాగ్యం తేనే కళ్లు బాగుంటాయని, వాటిలో చాలా పవర్ ఉందని రొమాంటిక్‌గా మాట్లాడుతాడు ఇడ్లీ బాబాయ్. భాగ్యం సిగ్గుపడుతుంది. ఇంతలో శ్రీవల్లి కాల్ చేసి నర్మద పరిస్థితి పేడకొట్టినట్లుగా ఉందని, వేదవతి కోపంగా ఉన్నది చెప్పి సంతోషిస్తుంది. ఈ ఇంట్లో నర్మద పరిస్థితి దెబ్బకు మటాష్ అయినట్లే అని వల్లి అంటే.. నర్మద ఇప్పుడు దెబ్బతిన్న పులి. డాక్టర్ అని చెప్పి నాటకం ఆడాం. అది లీక్ అయితే మన పని అయినట్లే అని భాగ్యం అంటుంది.

లాయర్‌లా ప్రశ్నలు

ఆపమ్మా. నా శత్రువుని దెబ్బకొట్టానని సంతోషిస్తుంటే భయపెడతావని కాల్ కట్ చేస్తుంది. ఇంతలో ప్రేమ ఫ్రెండ్ మధు ఇంటికి ఏడుస్తూ వస్తుంది. తన తల్లికి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెబుతుంది. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్లాలి కానీ ప్రేమ దగ్గరికి రావడం ఏంటని ధీరజ్ అడుగుతాడు. దానికి సమాధానం చెప్పకుండా ప్రేమను పట్టుకుని ఏడుస్తుంది మధు.

అర్జంట్‌గా మా అమ్మను సిటీకి తీసుకెళ్లాలే. నువ్వు కూడా నాకు తోడుగా రావే అని మధు అడిగితే.. పర్మిషన్ తీసుకోవాలంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ సరేనంటాడు. ప్రేమ హగ్ చేసుకుని థ్యాంక్స్ చెబుతుంది. లగెజ్ పట్టుకుని ప్రేమ వెళ్తుంటే.. హాస్పిటల్‌కు వెళ్తుంటే పెళ్లికి వెళ్లినట్లు ఇంత పెద్ద బ్యాగ్ ఏంటీ, ఇటువ్వు చూస్తాను అని నర్మద అడుగుతుంది.

త్వరగా వెళ్లాలని ప్రేమ అంటుంది. ఇంతలో రామరాజు, వేదవతి వస్తే విషయం చెబుతారు. ఏ హాస్పిటల్ అని నర్మద అడిగితే.. సుహాని హాస్పిటల్ అని మధు అంటుంది. అది పిల్లల హాస్పిటల్ కదా అని నర్మద అంటుంది. దాంతో వేదవతి తిట్టి లాయర్‌లా గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తుంటే ముద్దాయిలా ఉండాలా అని అంటుంది.

మోసం చేసిన ప్రేమ

అవసరానికి డబ్బు ఉంచుకోండని రామరాజు అంటాడు. ప్రేమ ఇబ్బంది పడుతుంది. ధీరజ్ వైపు ప్రేమ చూస్తే తీసుకోమ్మని సైగ చేస్తుంది. ప్రేమ రామరాజు ఇచ్చిన డబ్బు తీసుకుంటుంది. బాగానే గ్రిప్పులో పెట్టుకున్నావురా. పాపం నడిపోడే నోట్లో నాలుక లేనోడు అని వేదవతి అంటుంది. ఊరంతా అదే అనుకుంటున్నారని నర్మద అత్తకు కౌంటర్ ఇస్తుంది.

ప్రేమ వెళ్లిపోతుంది. ప్రేమను చూస్తుంటే డౌట్‌గా ఉంది. తను చెప్పింది నిజమేనా అని అనుమానిస్తుంది నర్మద. రాజపుష్పం ఏర్పాటు చేసిన కారు దగ్గరికి ప్రేమ వెళ్తుంది. నా భర్తను లైఫ్‌లో గెలిపించడానికి వెళ్తున్నా. కానీ, అందరికి అబద్ధం చెప్పి వెళ్తున్నాని గిల్టీగా ఉందని, నా భర్త కోసం గెలిచి తీరాలని ప్రేమ అంటుంది.

లగేజ్‌తోపాటు ప్రేమ కారు ఎక్కుతుంది. ప్రేమ వచ్చినట్లు రాజపుష్పానికి డ్రైవర్ చెబుతాడు. దాంతో అతను సంబరపడిపోతాడు. కారులో ప్రేమ వెళ్తుంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More