ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రోమో: శ్రీవల్లికి కడుపు లేదని సుకన్యతోనే చెప్పించిన ప్రేమ, నర్మద- కర్ర దెబ్బ ఆటతో బయటపడిన నిజం!
Illu Illalu Pillalu Serial Latest Episode Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్డ్ ఎపిసోడ్ ప్రోమోలో ప్రేమ, నర్మదలు శ్రీవల్లిని కచేరి పోగ్రామ్ అని పిలుస్తారు. కళ్లకు గంతలు కట్టుకుని కర్ర దెబ్బ ఆట ఆడుతారు. ఈ ఆటలో సుకన్యతోనే శ్రీవల్లికి కడుపు లేదనే నిజం బయటపెట్టిస్తారు నర్మద, ప్రేమ.
Illu Illalu Pillalu Serial Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో కోపంతో రగిలిపోయిన విశ్వక్.. అమూల్యను యాక్సిడెంట్ చేయాలనుకుంటాడు. కానీ, అక్కడికి ధీరజ్ రావడంతో ఉలిక్కిపడి ఒక్కసారిగా కారు ఆపుతాడు విశ్వక్.

ధీరజ్ ట్విస్ట్
అమూల్యను డ్రాప్ చేసిన ధీరజ్ తిరిగి మళ్లీ విశ్వక్ దగ్గరికి వచ్చి పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావురా, నా చెల్లి వెళ్లే రోడ్డులో నీకెంటీ పని, అసలు నా చెల్లి ఈ రోడ్డులో వస్తుందని నీకెలా తెలుస్తుందని అని చాలా ప్రశ్నలు వేస్తాడు ధీరజ్. దేనికి విశ్వక్ సరిగా సమాధానం చెప్పడు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్తిస్తాడు.
పోలీసులకు చెబితే వాళ్లు వచ్చి నిజం కనుక్కుంటారని, మా చెల్లిన వేధిస్తున్నావని మరో కేసు పెడతానని ధీరజ్ అంటాడు. దాంతో భయపడి సారీ చెబుతాడు విశ్వక్. అమూల్య వెళ్లే రోడ్డులోనే కాదు చుట్టు పక్కల కూడా కనిపించకూడదని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు ధీరజ్.
మరోవైపు కూల్ డ్రింక్, చిప్స్ పట్టుకుని శ్రీవల్లి సంతోషంగా వస్తుంది. అది చూసిన సుకన్య ఏంటిది, ఇదంతా దేనికి అని అడుగుతుంది. కచేరి కోసం అని శ్రీవల్లి అంటుంది. కచేరి ఏంటీ, ఇప్పుడేంటీ కచేరి అని సుకన్య అడుగుతుంది. పదా చూపిస్తాను అని నర్మద, ప్రేమల దగ్గరికి తీసుకెళ్తుంది శ్రీవల్లి.
కర్ర దెబ్బ ఆట
అక్కడ చెరోవైపు ఎదురెదురుగా కుర్చీలో కూర్చుంటారు నర్మద, ప్రేమ. బల్లక్కాయ్.. రా.. బల్లక్కాయ్.. రా అంటూ వెల్‌కమ్ పలుకుతారు నర్మద, ప్రేమ. వాళ్ల దగ్గరికి వెళ్లిన శ్రీవల్లి మీతో ఇలా సరదాగా కచేరికి రావడం చాలా ఆనందంగా ఉందని, ఎంతో సంతోషంగా ఉందని పులకరించిపోతుంది శ్రీవల్లి. పాటలు కూడా పాడుతుంది.
కచేరి కాదు మనం నలుగురం కలిసి ఒక ఆట ఆడుకుందామని చెబుతారు నర్మద, ప్రేమ. ఆట.. భలే భలే అని చప్పట్లు కొడుతూ సంతోషిస్తుంది శ్రీవల్లి. ఇంతకీ ఈ పోగ్రామ్‌కి ఏం నామకరణం చేశారని శ్రీవల్లి అడిగితే.. కర్ర.. దెబ్బ.. అని నర్మద చెబుతుంది. వావ్.. ఇందరదన మందవదన కుందరదన అనే టైటిల్‌లా ఉంది అని శ్రీవల్లి సంతోషంగా చెబుతుంది.
ఆట ఇంకా బాగుంటుందని నర్మద అంటుంది. ఆటలో ఒకరికి కళ్లకు గంతలు కడతారు. శ్రీవల్లి తనతోపాటు అందరిని చూపిస్తూ కొట్టాలా అని అడుగుతుంది. కళ్లకు గంతలు కట్టుకున్నవాళ్లు ఎప్పుడు కొట్టమంటే ఇంకొకరు వారిని కొడతారు. అయితే, ఈ ఆటలో నర్మద, ప్రేమ ఇద్దరు ఎవరికి తెలియకుండా చీటింగ్ చేస్తారు.
నొప్పి భరించలేకపోయిన సుకన్య
నర్మద కళ్లకు గంతలు కట్టుకున్నప్పుడు శ్రీవల్లి కొట్టాలా అని అడిగినప్పుడు తామిద్దరిని కాకుండా శ్రీవల్లి, సుకన్యవైపు చూపించినట్లు కొట్టాలి అన్నట్లుగా కాళు తొక్కి హింట్ ఇచ్చుకుంటారు. అయితే, ఇది ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అయిన ఆట. చాలా మంది ఇన్‌స్టా యూజర్స్ ఈ ఆటను ఆడుతూ వీడియోలు చేశారు.
ఇప్పుడు ఈ ఆటను ఈ సీరియల్‌లో ఇలా వాడుకున్నారు. అలా శ్రీవల్లి, సుకన్యలను కొట్టేలా ఇన్‌స్టాగ్రామ్ ఆటతో ప్లాన్ చేస్తారు నర్మద, ప్రేమ. ఈ ఆటలో శ్రీవల్లిని కంటే సుకన్యకు ఎక్కువగా దెబ్బలు తగులుతాయి. ప్రేమ కళ్లకు గంతలు ఉన్నప్పుడు సుకున్యను తెగ కొడుతుంది నర్మద. ఆ నొప్పి భరించలేక ఆపమంటుంది సుకన్య.
నిజం చెప్పిన సుకన్య
ఆటలో అసలైన ప్లేయర్ వల్లి కదా. తనను వదిలేసి నన్నే అందరు కొడతారేంటీ అని సుకన్య నొప్పితో అంటుంది. పాపం వల్లి అక్క కడుపుతో ఉంది కదా అని ప్రేమ అంటుంది. దాంతో ఎవరు చెప్పారు కడుపుతో ఉందని నిజం బయటపెడుతుంది సుకన్య. దాంతో ప్రేమ, నర్మద షాక్ అయి లేస్తారు. వల్లి కూడా లేస్తుంది. అలా వల్లికి కడుపు లేదని సుకన్యతోనే చెప్పిస్తారు తోడికోడల్లు ప్రేమ, నర్మద. అక్కడితో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


