ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 13 ఎపిసోడ్: నర్మద, ప్రేమకు శ్రీవల్లి కడుపు బాధ్యతలు- ఒంటికాలిపై నిలబెట్టి- సాగర్‌కు ఫుడ్ షాక్

Illu Illalu Pillalu Serial June 13th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 13వ ఎపిసోడ్‌లో చందు మాటలకు శ్రీవల్లి కంగారుపడటం చూసి నర్మద, ప్రేమ డౌట్ పడతారు. అత్తతో చెప్పి ఆర్డర్ వేయించి వల్లి కడుపు బాధ్యతలు తీసుకుంటారు. వల్లిని ఒంటికాలిపై నిలబెడతారు. ఫుడ్ తీసుకొచ్చిన సాగర్‌కు షాక్ తగులుతుంది.

Published on: Jun 13, 2026, 08:39:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో బిడ్డ హార్ట్‌బీట్ వినపడుతుందిగా. వినొచ్చుగా అని చందు అంటాడు. శ్రీవల్లి కంగారుపడుతుంది. శ్రీవల్లి కంగారుపడటం నర్మద, ప్రేమ చూస్తారు. సుకన్యతో వల్లి సైగలు చేస్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 13వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 13వ ఎపిసోడ్

గుండె జారి కడుపులోకి వచ్చింది

కడుపులో బిడ్డ హార్ట్ బీట్ వినపడట్లేదని చందు అంటాడు. కాస్తా పైకి తల పెట్టమని వల్లి అంటుంది. హార్ట్ బీట్ వినొస్తుందని చందు చాలా సంతోషంగా చెబుతాడు. ఇది అమాయకత్వానికి పరాకాష్ట అని సుకన్య అనుకుంటుంది. పైకి లేచి శ్రీవల్లిని హగ్ చేసుకుంటాడు చందు. మా నాన్న రైస్ మిల్లు విషయం అని వల్లి చెబితే రెడీగా ఉండమని చందు చెప్పి వెళ్లిపోతాడు.

లేని బిడ్డ గుండె చప్పుడు వినపడటం ఏంటని సుక్కు అడిగితే.. నా గుండె జారి కడపులోకి వచ్చింది. ఆ సౌండ్ అనుకుంటా అని వల్లి అంటుంది. వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడట్లేదని, కానీ ఏదో సీక్రెట్ మెయింటేన్ చేస్తున్నారని నర్మదతో ప్రేమ అంటుంది. మరోవైపు రైస్ మిల్లు ఆక్రమించేందుకు ఇది బంపర్ అవకాశం అని, సరిగ్గా ఉపయోగించుకోవాలని ఇడ్లీ బాబాయ్‌కి వార్నింగ్ ఇస్తుంది భాగ్యం.

భాగ్యంకు కాల్ చేసిన శ్రీవల్లి నాన్నను రైస్ మిల్లుకు తీసుకెళ్లేందుకు బావ వస్తున్నాడని చెబుతుంది. అంతలోనే చందు వస్తాడు. అదే విషయం వల్లికి చెప్పి చందు దగ్గరికి వెళ్తారు భాగ్యం, ఇడ్లీ బాబాయ్. మంచి టిప్ టాప్‌గా ఇడ్లీ బాబాయ్ రెడీ అవడం చూసి ఏంటీ పెళ్లి చూపులా అని చందు అడుగుతాడు. మీ అత్త సంపేత్తదని ఇడ్లీ బాబాయ్ అంటాడు.

వర్కౌట్ అయిన భాగ్యం ప్లాన్

చందు బైక్ ఎక్కి అల్లుడుని గట్టిగా హగ్ చేసుకుని కూర్చుంటాడు ఇడ్లీ బాబాయ్. భాగ్యంకు గాల్లో ముద్దులు పెడతాడు ఇడ్లీ బాబాయ్. హమ్మయ్యా. నా ప్లాన్ వర్కౌట్ అయినట్లే అని భాగ్యం అనుకుంటుంది. మరోవైపు నాన్న రైస్ మిల్లుకు వెళ్తున్నాడని శ్రీవల్లి, సుకన్య డ్యాన్స్ చేస్తారు. అదంతా చూసిన నర్మద, ప్రేమ బయటకు వచ్చి మాట్లాడుకుంటారు.

కడుపు అడ్డం పెట్టుకుని ఏదో నాటకం ఆడుతుందని ప్రేమ అంటే.. అది బయటపెట్టాలని నర్మద అంటుంది. ఇద్దరు వేదవతి దగ్గరికి వెళ్తారు. నర్మదను హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది వేదవతి. దాంతో ప్రేమ అలుగుతుంది. ప్రేమను కూడా హగ్ చేసుకుని ముద్దు పెడుతుంది వేదవతి.

కడుపుతో ఉన్న శ్రీవల్లి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవాలిగా. తింగరిది అయిన సుకన్య సరిగా చూసుకోదు. మేము చూసుకుంటామని నర్మద, ప్రేమ అంటారు. చూసుకోండని వేదవతి అంటుంది. మేము బాధ్యతలు తీసుకున్నామని చెబితే మావయ్యకు కంప్లైంట్ ఇస్తుంది. కాబట్టి వల్లిని మేము చూసుకునేలా ఈ ఇంటి అత్తగా.. ఎవరినైనా శాసించే శివగామిగా మీరు ఆర్డర్ వేయండి. అప్పుడు వల్లి సైలెంట్‌గా ఉంటుందని నర్మద అంటుంది.

శివగామిలా వేదవతి

పదండి శాసిద్దామని చెప్పి శ్రీవల్లిని పిలుస్తుంది వేదవతి. అత్తతో ప్రేమ, నర్మదను చూసి షాక్ అవుతుంది వల్లి. వాళ్లు కోరలు పీకేసిన పాములు, ఏనుగులాంటి నిన్ను ఏం చేయలేరని సుకన్య అంటుంది. ఇకనుంచి నిన్ను నీ కడుపుని నీ చెల్లెల్లు ఇద్దరు జాగ్రత్తగా చూసుకుంటారని వేదవతి ఆర్డర్ వేస్తుంది. నేను ఉన్నాగా అని సుకన్య అంటుంది.

ఒక తింగరిదాన్ని చూసుకునేందుకు ఇంకో మెట్ట తింగరిదాన్ని పంపించారు. ప్రేమ, నర్మద చదువుకున్నవాళ్లు కాబట్టి బాగా చూసుకుంటారు. ఈ ఇంటికి నేనే శివగామిని, నేను శాసించిందే శాసనం. నేను చెప్పినట్లు చేయి. అంతేకానీ మావయ్య గారు అంటూ చాడీలు చెబితే వంట గదిలో డబ్బాలు పగిలిపోతాయని వార్నింగ్ ఇచ్చి ఆర్డర్ వేస్తుంది వేదవతి.

శ్రీవల్లిని యోగా చేయమని, సూర్య నమస్కారాలతో ప్రారంభించమని నర్మద, ప్రేమ అంటారు. చేసేది లేక ఒంటికాలు మీద నిలబడుతుంది వల్లి. కడుపుతో ఉంటే ఎక్కువ సేపు నిలబడలేదుగా అని ప్రేమ అంటుంది. నిలబడలేక కింద కూర్చుంటుంది శ్రీవల్లి. ఇప్పుడు చిన్న బ్రేక్, తదుపరి ఆసనాలు మళ్లీ వచ్చి చేయిస్తామని వెళ్లిపోతారు నర్మద, ప్రేమ.

సాగర్ ఫుడ్, ధీరజ్ సెటైర్లు

మరోవైపు సాగర్ వచ్చి నర్మదను అందరి ముందు పిలుస్తాడు. హోటల్ నుంచి ఫుడ్ తీసుకొచ్చానని, అది అందరూ చూడాలని, ఇద్దరం గవర్నమెంట్ జాబర్స్ అని, మూడు పూటలు బయటి నుంచి తెచ్చుకుని తినగలమని సాగర్ అంటాడు. అలా అయితే మీ జీవితం హోటల్ వాళ్లకు అంకితం అవుతుందని ధీరజ్ సెటైర్లు వేస్తాడు.

తినడానికి తెచ్చుకున్నావుగా కడపు నిండా తిను. ఈ మాటలు ఎందుకు అని వేదవతి అంటుంది. సాగర్ ఫ్రెష్ అయి వస్తానని లోపలికి వెళ్తాడు. సాగర్ తెచ్చిన పిజ్జా, బర్గర్స్‌ని నర్మదతోపాటు ధీరజ్, ప్రేమ కూడా తింటారు. టేస్ట్ చాలా బాగుందని మాట్లాడుకుంటారు. తిరుపతి మొహమాట పడుతుంటే ధీరజ్ ఒకటి ఇస్తాడు. వేదవతికి కూడా తినమని నర్మద ఇస్తుంది.

సాగర్ తెచ్చిన ఫుడ్ అందరూ తింటారు. ఇంతలో సాగర్ వచ్చి తీసుకురా తిందాం అని అంటాడు. వాళ్లంతా తినడం చూసి అవాక్కవుతాడు సాగర్. అంటే సాగర్‌కు ఫుడ్ షాక్ తగులుతుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More