ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రోమో: పుష్పరాజం ఉచ్చులో ప్రేమ- రామరాజు కుటుంబాన్ని మోసం చేసి-భర్తకు అబద్ధం- ఇడ్లీ బాబాయ్ సన్యాసం

Illu Illalu Pillalu Serial Latest Episode Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్డ్ ఎపిసోడ్ ప్రోమోలో ప్రేమకు పుష్పరాజం కాల్ చేసి డ్యాన్స్ అందరికి నచ్చిందని చెబుతాడు. దాంతో భర్త ధీరజ్‌కు అబద్ధం చెప్పి రామరాజు కుటుంబాన్ని మోసం చేసి మరి వెళ్తుంది ప్రేమ. ఇడ్లీ బాబాయ్ సన్యాసంలో చేరతనంటాడు.

Published on: Jun 28, 2026, 16:16:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Promo: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో శ్రీవల్లి దెబ్బకు నర్మద విలవిల్లాడుతుంది. ఫైనల్‌గా కోడలు నర్మదను అత్త వేదవతి దూరం పెట్టడమే కాకుండా చెంప చెల్లుమనిపించేలా చేస్తుంది శ్రీవల్లి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

నర్మదపై వేదవతి ఆగ్రహం

శ్రీవల్లి కడుపు నొస్తున్నట్లుగా నాటకం ఆడటంతో అందరూ వస్తారు. అసలు నీకు కడుపుందా అని నర్మద నోరు జారడంతో అంతా షాక్ అయితే వేదవతి మాత్రం ఆగ్రహిస్తుంది. నర్మదపై విరుచుకుపడుతుంది. కోపంతో నర్మద చెంప చెల్లుమనిపిస్తుంది.

వల్లి ఇదివరకు తప్పులు చేసి ఉండొచ్చు కానీ, తల్లి అవుతున్నాన్న విషయంలో ఏ ఆడది అబద్ధాలు ఆడదని, తనకు నీ వల్ల కడుపు పోయిందన్న బాధ ఏమాత్రం లేకుండా కడుపు ఉందా అని అంటావా అని నర్మదను తిడుతుంది వేదవతి. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుందని, తనకు కడుపు పోగొట్టిన ఉసురు ఊరికే పోదని వేదవతి తిట్టేసి వెళ్లిపోతుంది.

అంతా వెళ్లిపోవడంతో శ్రీవల్లి, సుకన్య ఇద్దరు తెగ సంబంరపడతారు. డ్యాన్స్ చేస్తారు. ఇక ఆటో గురించి, మన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎలా రివర్స్ షాక్ ఇచ్చానో చూశావా అని సుక్కుతో అంటుంది శ్రీవల్లి. మరోవైపు తల్లికూతుళ్లు ఇచ్చే ట్విస్టులకు బెంబేలెత్తిపోతున్నట్లు కంగారుపడిపోతాడు ఇడ్లీ బాబాయ్.

సన్యాసంలో ఇడ్లీ బాబాయ్

బీపీ పెరిగి చనిపోయేలా ఉన్నానని ఆనంద రావు అంటే.. రెండు లక్షలు కట్టకుంటా ఎక్కడికిపోతావని భాగ్యం అంటుంది. 2 లక్షలు కట్టాలంటే నా రెండు కిడ్నీలు అమ్ముకోవాల్సిందే అని బాబాయ్ అంటే.. ఆ ముసలి కిడ్నీలు ఎవరు తీసుకుంటారు. 2 లక్షలు కట్టేందుకు నా దగ్గర మంచి ఐడియా ఉందని, రామరాజు రైస్ మిల్లులో 2 లక్షలు దొంగతనం చేయమని భాగ్యం అంటుంది.

అది విన్న ఇడ్లీ బాబాయ్ మరింత భయపడిపోతాడు. నాకు ఈ కాపురం వద్దు, గొడవలు వద్దు, సన్యాసంలో కలిసిపోతానంటూ బయటకు వెళ్లిపోతాడు ఇడ్లీ బాబాయ్. మరోవైపు డ్యాన్స్ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసే పుష్పరాజం ప్రేమకు కాల్ చేస్తాడు. మా ఆర్గనైజేషన్ వాళ్లు నీ డ్యాన్స్ వీడియోలు అన్నీ చూశారు. మీ డ్యాన్స్ వారికి బాగా నచ్చిందని, ఓసారి ఇక్కడికి రావా అని ప్రేమకు చెబుతాడు పుష్పరాజం.

దాంతో ప్రేమ ఆలోచనలో పడిపోతుంది. ఏమైంది సైలెంట్ అయ్యారని అడుగుతాడు పుష్పరాజం. మా ఆయన డ్యాన్స్ చేసేందుకు ఒప్పుకోవడం లేదని ధీరజ్ గురించిచెబుతుండి ప్రేమ. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని, వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలని, ఈ డ్యాన్స్‌తో మీరు స్టార్ అవుతారని చెబుతాడు పుష్పరాజం. దాంతో మా ఆయన్ను కన్విన్స్ చేస్తాను, రాడానికి ట్రై చేస్తాను అని పుష్పరాజంతో ప్రేమ చెబుతుంది.

డ్యాన్స్ కాంపిటీషన్‌కు వెళ్లేందుకు

కట్ చేస్తే నిజం చెబితే ధీరజ్ పంపించడని, తన ఫ్రెండ్‌తో హాస్పిటల్ నాటకం ఆడి డ్యాన్స్ కాంపిటీషన్‌కు వెళ్లేందుకు ప్రేమ ప్లాన్ చేస్తుంది. అంటే, ధీరజ్‌కు అబద్ధం చెప్పి వెళ్లాలనుకుంటుంది. తర్వాత ప్రేమ ఫ్రెండ్ వచ్చి తన తల్లిని హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి తోడుగా ఎవరు లేరని, ప్రేమని తోడుగా పంపించవా ప్లీజ్ అని ధీరజ్‌ను అడుగుతుంది.

దాంతో ధీరజ్ సరే అని ప్రేమను పంపించేందుకు ఒప్పుకుంటాడు. థ్యాంక్స్ రా అని ధీరజ్‌ను హగ్ చేసుకుంటుంది ప్రేమ. లగేజ్ సర్దుకుని ప్రేమ వెళ్తుంది. ఇంతలో వచ్చిన నర్మద లగేజ్ తీసుకుని వెళ్తున్నావ్ ఎక్కడికి అని అడుగుతుంది. డ్యాన్స్‌కి అని ప్రేమ నోరు జారుతుంది. అంతా షాక్ అవుతారు. తర్వాత హాస్పిటల్‌కు అని ప్రేమ చెబుతుంది.

మా ఫ్రెండ్ వాళ్ల అమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చిందని ప్రేమ చెబుతుంది. అప్పుడే వచ్చిన రామరాజు కుటుంబం విని బాధపడతారు. హాస్పిటల్‌లో ఖర్చులకు ఉంటాయని ప్రేమకు డబ్బులు ఇస్తాడు రామరాజు. ధీరజ్ కూడా తీసుకోమని సైగ చేస్తాడు. ప్రేమ ఆ డబ్బు తీసుకుంటుంది. అంత ప్రేమ చూపిస్తున్న మామ రామరాజు కుటుంబాన్ని మోసం చేస్తున్నందుకు ప్రేమ ఫీల్ అవుతుంది.

పుష్పరాజం ఉచ్చులో ప్రేమ

మరోవైపు పుష్పరాజం ప్రేమను చూస్తూ మురిసిపోతాడు. పక్కన అసిస్టెంట్ మందు పోస్తుంటాడు. ప్రేమ కారులో వస్తుంటుంది. అలా పుష్పరాజం ఉచ్చులో ప్రేమ చిక్కుకుంటుంది. అక్కడితో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More