Sign in

ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 27 ఎపిసోడ్: సాగర్‌కు లంచం అలవాటు చేసిన మామ- నర్మదను కొట్టిన వేదవతి- భాగ్యం 2 లక్షల చోరీ ఐడియా

Illu Illalu Pillalu Serial June 27th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 27వ ఎపిసోడ్‌లో సాగర్‌తో లేనిపోని మాటలు చెప్పి లంచం అలవాటు చేస్తాడు మామ ప్రసాద్ రావు. సంతకం పెట్టించుకుని 10 వేలు లంచం ఇప్పిస్తాడు. శ్రీవల్లి మంచితనంపై ధీరజ్‌కు డౌట్ వస్తుంది. ఆ మాటలు సుకన్య వింటుంది.

Published on: Jun 27, 2026, 09:06:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో సక్సెస్‌ను ఎంజాయ్ చేయాలని డాక్టర్ మెరుపుతీగగా చేసిన క్లీనర్ అంటుంది. దాంతో డాక్టర్, శ్రీవల్లి డ్యాన్స్ చేస్తారు. భాగ్యం ఫ్యామిలీ మొత్తం డ్యాన్స్ చేస్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 27వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 27వ ఎపిసోడ్

డబ్బు ఉంటేనే గౌరవం

మరోవైపు సాగర్‌ను పార్టీ అడిగితే.. వడ్డీలకు దానికి అయిపోతుంది. కానీ, ఏదో ఒకరోజు మాత్రం నీకు గ్రాండ్ పార్టీ ఇస్తాను అని సాగర్ అంటాడు. అలా ఇవ్వాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలిగా అల్లుడు అని మామ ప్రసాద్ రావు అంటాడు. తర్వాత పక్కకు తీసుకెళ్లి సాగర్‌తో డబ్బు, ఆస్తులు ఉంటేనే అందరూ గౌరవిస్తారని, అప్పుడే తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ విలువ ఇస్తారని ఎక్కిస్తాడు ప్రసాద్ రావు.

ఈ ఫైల్ మీద నీ సంతకం కోసం వచ్చాను. సంతకం చేయి అని ప్రసాద్ రావు అంటాడు. దాంతో అది ఏం చదవకుండానే ఫైల్ మీద సంతకం చేస్తాడు సాగర్. పక్కనున్న అతనికి ఫైల్ ఇచ్చి క్యాష్ తీసుకుని సాగర్‌కు ఇస్తాడు ప్రసాద్ రావు. డబ్బును డబ్బుతోనే కొనే రోజులు ఇవి. ఇప్పుడు నీ జేబులోని పెన్నుతో రెండు ఇంక్ చుక్కలతో సంతకం పెట్టగానే నీ జేబులో రూ. 10 వేలు ఉన్నాయి. జీతం నమ్ముకుంటే ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వలేవు అని ప్రసాద్ రావు అంటాడు.

అలా సాగర్ లంచం తీసుకుని సంతకం పెట్టేలా, సాగర్‌కు లంచం అలవాటు అయ్యేలా చేస్తాడు మామ ప్రసాద్ రావు. తర్వాత ఆఫీస్‌లోకి వెళ్లి ఫ్రెండ్స్‌కు పార్టీ ఇస్తానంటాడు సాగర్. మరోవైపు శ్రీవల్లి అబార్షన్, తన వైపు వల్లి మాట్లాడం గురించి ప్రేమ, నర్మద, ధీరజ్ మాట్లాడుకుంటారు. ఆ మాటలు సుకన్య వింటుంది. వల్లి అలా శాంతమూర్తిలా మాట్లాడిందంటే దాని వెనుక ఏదో ప్లాన్ ఉందనిపిస్తుందని ప్రేమ అంటుంది.

వల్లి మంచితనంపై డౌట్

వాళ్లకు తింగరితనం తప్పా ప్లాన్ చేసే బుర్ర లేదని నర్మద అంటుంది. ఏం ప్లాన్ లేనిది వల్లి వదిన నిన్ను ఎందుకు సేవ్ చేస్తుందని ధీరజ్ అంటాడు. వల్లిని సడెన్‌గా తీసుకెళ్లా. ప్లాన్ చేసే అవకాశం కూడా లేదు. ఆ డాక్టర్ కూడా జెన్యూనే. అబార్షన్ అని అబద్ధం ఎందుకు చెబుతుంది. నిజంగా వల్లికి కడుపు ఉంటే అది పోయేందుకు నేనే కారణం. ఆ గిల్టీ నన్ను వెంటాడుతూనే ఉంటుందని తనపై తానే నిందలు వేసుకుంటుంది నర్మద.

వల్లి వదినలో మార్పు రావడంలో మాయ మతలబు ఉందని ధీరజ్ అంటాడు. అంతకుమించి మీరు నన్ను కనిపెట్టగలరా ఏంటీ అని సుకన్య అంటుంది. యాక్సిడెంట్ ఎలా జరిగిందని ధీరజ్ అడిగితే.. ఆ అమ్మాయి కర్చీఫ్ కట్టుకుని వచ్చిందని నర్మద చెబుతుంది. నాకు తెలిసి ఈ ఏరియాలో లేడి డ్రైవర్లు ఎవరు లేరు. పైగా కర్చీఫ్ కట్టుకుందంటే తనను గుర్తు పట్టకూడదనే చేసిందని ధీరజ్ అంటాడు.

ఆ ఖిలాడీ డ్రైవర్‌ను పట్టుకుంటే వల్లి వదినలో వచ్చిన మార్పు ఏంటో తెలుస్తుందని ధీరజ్ అంటాడు. దాంతో సుకన్య తెగ షాక్ అయిపోతుంది. కత్తి అటు ఇటు తిరిగి నావైపుకు వచ్చిందిరో అని ఇంట్లోకి పరిగెత్తుతుంది సుకన్య. వల్లి డ్యాన్స్ చేస్తుంటే భయంగా వెళ్లిన సుకన్య ధీరజ్ వాళ్లకు డౌట్ వచ్చిన విషయం చెబుతుంది. అసలు వాళ్లు ఆటో డ్రైవర్ గురించి ఆలోచించకుండా నేను చేస్తానుగా అని వల్లి అంటుంది.

నర్మదను కొట్టిన వేదవతి

సడెన్‌గా కడుపు నొప్పి వచ్చినట్లుగా ఏడుస్తుంది. వేదవతి, అమూల్య వస్తారు. కడుపు పోయిందన్న బాధ కలచివేస్తుంటే ఏం తినను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ డ్రామా చేస్తుంది వల్లి. చందు వస్తే మన బిడ్డ దూరమైందంటే తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది. నీ నటనా బీభత్సం మాములుగా లేదు అని సుకన్య అంటుంది.

నర్మదను గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తుంది వల్లి. అది ఆపిన ప్రేమ హాస్పిటల్‌లో, ఇంటికొచ్చాకా బాగానే ఉన్నావ్. ఇందాకా ఏదో తింటూ కనబడ్డావ్. సడెన్‌గా ఏడుపు మొదలుపెట్టావని అడుగుతుంది. వేదవతి వారిస్తుంది. నన్ను ఇరికించే నువ్వు హాస్పిటల్‌లో నాకోసం అలా మాట్లాడటం చూసి చాలా ఆశ్చర్యమేసిందని నర్మద అంటుంది.

నా విషయంలో శాంతమూర్తిలా ఉన్నావంటే నిజంగా నీకు కడుపు ఉందా అని నర్మద అడుగుతుంది. దాంతో వేదవతి వచ్చి నర్మద చెంపచెల్లుమనిపిస్తుంది. అంతా షాక్ అవుతారు. సుకన్య, వల్లి నవ్వుతారు. తల్లికి బిడ్డ పోతే ఎలా ఉంటుందో తెలుసా. ఏంటీ నీ ఉద్దేశం. నీ వల్ల తన కడుపు పోయిందన్న బాధ, జాలి నీలో అస్సలు లేదు. అసలు నువ్వు మనిషివేనా అని నర్మదపై విరుచుకుపడుతుంది.

ఉసురు తగులుతుందన్న వేదవతి

తల్లి కాబోయే విషయంలో ఏ ఆడది అబద్ధం చెప్పదు. నీతో మాట్లాడాలన్న, మొహం చూడాలంటే కంపరంగా ఉంది. బంగారంలాంటి కోడలు అని నెత్తిన పెట్టుకుని తప్పు చేశాను. తనకు తన బిడ్డను దూరం చేశావు. ఆ ఉసురు నీకు ఊరికే పోదు అని వెళ్లిపోతుంది వేదవతి. అత్తయ్య ఏదో బాధలో మాట్లాడింది. పట్టించుకోకని వల్లి అంటుంది.

అంతా వెళ్లిపోతారు. మన మీద డౌట్ రాకుండా, ఆలోచించకుండా ఎట్టా రివర్స్ షాక్ ఇచ్చానో చూశావా అని సుక్కుతో అంటుంది వల్లి. మరోవైపు ఇడ్లీ బాబాయ్ బీపీ చెక్ చేసుకుని 180 వచ్చిందని కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. భాగ్యం వచ్చి అడిగితే చాలా టెన్షన్‌గా ఉందని బీపీ వచ్చి పోయేలా ఉన్నానని అంటాడు.

భాగ్యం 2 లక్షల చోరీ ఐడియా

అలా ఎలా పోతావ్. డాక్టర్‌కు 2 లక్షలు కట్టేసి పోవాలిగా అని భాగ్యం అంటుంది. రైస్ మిల్లులో 2 లక్షలు కొట్టేయి అని భాగ్యం చెబుతుంది. ఇది చాలా రిస్క్ అని భయపడిపోతాడు ఇడ్లీ బాబాయ్. ఎలా చేయాలో ఐడియా చెబుతానని భాగ్యం అంటుంది. సన్యాసంలో కలుస్తానని అరుస్తూ వెళ్లిపోతాడు ఇడ్లీ బాబాయ్. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More