Sign in

ఇల్లు ఇల్లాలు పిల్లలు జూలై 1 ఎపిసోడ్: వల్లి గుట్టు రట్టు.. స్కానింగ్ రిపోర్ట్ తో హాస్పిటల్ కు నర్మద.. కామంతో రాజపుష్పం

Illu Illalu Pillalu July 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 1 ఎపిసోడ్ లో వల్లి కడుపు డ్రామాను బట్టబయలు చేసేందుకు నర్మద ప్రయత్నిస్తుంది. స్కానింగ్ రిపోర్ట్ పట్టుకుని హాస్పిటల్ కు వెళ్తుంది. మరోవైపు రాజ పుష్పం దగ్గరకు ప్రేమ చేరుకుంటుంది. పూర్తి ఎపిసోడ్ వివరాల కోసం ఇక్కడ లుక్కేయండి.

Published on: Jul 1, 2026, 08:03:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 1 ఎపిసోడ్ లో తనపై పడ్డ నిందను తప్పని నిరూపించాలని నర్మద అనుకుంటుంది. వల్లి స్కానింగ్ రిపోర్ట్ ను తీసుకొని హాస్పిటల్ కు వెళ్తుంది. మరి అసలేం జరిగిందో ఈ రోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ లో చూసేయండి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

నింద తొలగించుకోవాలని

తనపై పడ్డ నింద అబద్ధం అని నిరూపించాలని నర్మద అనుకుంటుంది. అందుకు శ్రీవల్లి కడుపు అబద్ధమని నిరూపించాలి. స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. కానీ వల్లి రూమ్ లో నుంచి ఆ స్కానింగ్ రిపోర్ట్ ఎలా తీసుకోవాలని నర్మద ఆలోచిస్తుంది. అప్పుడు నర్మదను చూసి వల్లి తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

దొంగ, పోలీస్ ఆట

నర్మదను ఇంకా ఏడిపిద్దామని ఆమె దగ్గరకు వల్లి వెళ్తుంది. నా కారణంగా అత్తయ్య నిన్ను తిట్టడం, కొట్టడం తట్టుకోలేకపోతున్నా చెల్లాయ్. నీ బాధ పోగొట్టేందుకు ఓ ఆట ఆడుకుందాం. దొంగ, పోలీస్ ఆడదామని వల్లి చెప్తుంది. వల్లి రూమ్ లో ఉన్న స్కానింగ్ రిపోర్ట్ తీసుకునేందుకు ఈ ఆట పనికి వస్తుందని నర్మద అనుకుంటుంది. అక్కాయ్ నీ క్యారెక్టర్ ఏంటీ? అని నర్మద అడిగితే, దొంగ అని వల్లి అంటుంది. నీకు తగ్గ క్యారెక్టర్ అని నర్మద కౌంటర్ వేస్తుంది.

తిరుపతి రొమాన్స్

దాక్కుంటామని వల్లి, సుక్కు లోపలికి వెళ్తారు. పట్టుకునేందుకు నర్మద వెళ్తుంది. సుక్కు దాక్కున్న దగ్గరే తిరుపతి ఉంటాడు. నేను కూడా నీతో ఆడుకుందామని సుక్కుతో రొమాంటిక్ గా అంటాడు తిరుపతి. ఇదే ఛాన్స్ అని వల్లి రూమ్ లోకి నర్మద వెళ్లి స్కానింగ్ రిపోర్ట్ కోసం వెతుకుతుంది. మరోవైపు సుక్కుతో క్లోజ్ గా మూవ్ అవుతాడు తిరుపతి.

దొరికిన స్కానింగ్ రిపోర్ట్

వల్లి బెడ్ కింద స్కానింగ్ రిపోర్ట్ దొరుకుతుంది. వల్లి రావడం చూసి నర్మద ఆ రిపోర్ట్ ను దాచేస్తుంది. ఆట అయిపోయిందని ఆ రిపోర్ట్ తీసుకుని నర్మద బయటకు వెళ్తుంది. తిరుపతి బ్యాక్ సైడ్ మేకు దిగేలా తోసేసి సుక్కు నవ్వుతుంది. బాధ బయటకు చెప్పలేక తిరుపతి తెగ బాధ పడతాడు. సుక్కు ఏమో పాటలు పాడుకుంటూ బయటకు వెళ్లిపోతుంది.

రాజ పుష్పం దగ్గరకు ప్రేమ

మరోవైపు డ్యాన్స్ కాంపిటీషన్ దగ్గర ప్రేమ కోసం రాజ పుష్పం వెయిట్ చేస్తుంటాడు. విరహంతో వెయిట్ చేస్తున్నానని అసిస్టెంట్ ను హగ్ చేసుకుంటాడు. అప్పుడే కార్లో ప్రేమ వస్తుంది. ఆమెను కామంతో చూస్తాడు రాజ పుష్పం. సాక్షాత్తూ ఆ దేవ కన్య వచ్చినట్లు ఉంది. అందుకే భూలోకానికి స్వాగతం. నా పేరు రాజ పుష్పం. ఈ డ్యాన్స్ ఈవెంట్ ను కండక్ట్ చేస్తుంది నేనేనని ప్రేమకు పరిచయం చేసుకుంటాడు.

డబుల్ మీనింగ్

ప్రేమను రూమ్ లోకి తీసుకెళ్తాడు రాజ పుష్పం. ఇదే మన రూమ్. మీ కోసం అరెంజ్ చేసిన రూమ్. రెడీ అయితే షో స్టార్ట్ చేద్దామని డబుల్ మీనింగ్ తో మాట్లాడుతాడు రాజ పుష్పం. రెడీ అవుతానని ప్రేమ లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటుంది. అప్పుడే ధీరజ్ నుంచి కాల్ వస్తుంది. ప్రేమ హాస్పిటల్ కు వెళ్లావా? మధు వాళ్ల అమ్మకు ఎలా ఉందని అడుగుతాడు. ట్రీట్మెంట్ జరుగుతుందని ప్రేమ అబద్ధం చెప్తుంది. కానీ ఫీల్ అవుతూ సారీ అని చెప్తుంది.

నర్మద డ్రామా

స్కానింగ్ రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరకు నర్మద వెళ్తుంది. నేను ప్రెగ్నెంట్ డాక్టర్. రెగ్యులర్ చెకప్ కోసం వచ్చానని నర్మద డ్రామా స్టార్ట్ చేస్తుంది. ప్రెగ్నెంట్ అని ఎలా కన్ఫామ్ చేసుకున్నావని డాక్టర్ అడుగుతుంది. సడెన్ గా కళ్లు తిరిగి పడిపోతే ఓ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సీనియర్ డాక్టర్ కన్ఫామ్ చేశారు. స్కానింగ్ రిపోర్ట్ లు కూడా ఇచ్చారని ఆ రిపోర్ట్ లు చూపిస్తుంది నర్మద. అది చూసి డాక్టర్ షాక్ అవుతుంది.

డాక్టర్ షాక్

మీకు ఈ రిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్ ఎవరు? దీనిపై పేషెంట్స్ డీటైల్స్ లేవు. ఈ రిపోర్ట్స్ మీవేనని ఎలా నమ్మమంటారని డాక్టర్ ప్రశ్నిస్తుంది. ఆ డాక్టర్ ఎవరో మిమ్మల్ని చీట్ చేశారని డాక్టర్ అంటుంది. ఆ డాక్టర్ మీరే. కళ్లు తిరిగి పడిపోయింది నేను కాదు వల్లి. వల్లిని చెకప్ చేసి ప్రెగ్నెంట్ అవడం వల్ల కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పారు. వల్లిని తీసుకొని నేను, ప్రేమ మీ దగ్గరకు వచ్చామని నర్మద చెప్పేసరికి డాక్టర్ మైండ్ బ్లాక్ అవుతుంది.

ప్రెగ్నెంట్ కాని వల్లిని ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పారని డాక్టర్ ను నర్మద అడుగుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More