ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 22 ఎపిసోడ్: వల్లికి కడుపు లేదన్న సుక్కు.. ప్రేమ, నర్మద షాక్.. డ్యాన్స్ కాంపిటీషన్ కు ధీరజ్ నో

Illu Illalu Pillalu June 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 22 ఎపిసోడ్ లో ప్రేమ, నర్మద కలిసి శ్రీవల్లి, సుక్కును కొడతారు. శ్రీవల్లికి కడుపు లేదని సుక్కు అనడంతో షాక్ అవుతారు. మరోవైపు డ్యాన్స్ కాంపిటీషన్ కోసం ధీరజ్ ను ఒప్పించేందుకు ప్రేమ ట్రై చేస్తుంంది. మరి ధీరజ్ ఏం చేశాడో చూసేయండి.

Published on: Jun 22, 2026, 08:02:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 22 ఎపిసోడ్ లో కచేరి పేరుతో శ్రీవల్లి, సుక్కును ప్రేమ, నర్మద కలిసి వాయించేస్తారు. వల్లికి కడుపు లేదని సుక్కు నోరు జారుతుంది. ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

కచేరీకి ప్రిపేర్

కచేరీకి శ్రీవల్లి ఫుల్ గా ప్రిపేర్ అయి వస్తుంది. కడుపుతో ఉన్నా కదా ఊరమాస్ కచేరీలు కాకుండా, క్లాసికల్ ఆట ఆడుకుందామని శ్రీవల్లి అడుగుతుంది. అలాగే బల్లక్కాయ్ అని ప్రేమ, నర్మద అంటారు. ఈ ప్రోగ్రామ్ కు కర్రదెబ్బ అని పేరు పెట్టామని నర్మద చెప్తుంది.

బాదేసిన నర్మద, ప్రేమ

కళ్లకు గంతలు కడతారు. కొట్టాలా, కొట్టాలా అని చేయి చూపిప్తారు. కొట్టాలి అంటే కొట్టాలి, వద్దు అంటే ఆపాలి అని గేమ్ ను నర్మద వివరిస్తుంది. ఓహో నన్ను కొట్టాలని డిసైడ్ అయ్యారని వల్లి అనుకుంటుంది. నర్మద కళ్లకు గంతలు కడతారు. ప్రేమ కాలితో నర్మద కాలిపై టచ్ చేస్తుంటుంది. దీంతో ప్లాన్ ప్రకారం వల్లి, సుక్కును ప్రేమ బాదేస్తుంది. ప్రేమ గంతలు కట్టుకుంటే, నర్మద ఏమో బాదేస్తుంది.

కడుపుతో లేదు

ఆటలో మెయిన్ విలన్ వల్లి కదా, మరి నన్నెందుకు కొడుతున్నారని సుక్కు అడుగుతుంది. పాపం, వల్లక్కాయ్ కడుపుతో ఉంది కదా అని ప్రేమ అంటుంది. ఎవరు చెప్పారు కడుపుతో ఉందని సుక్కు అనగానే ప్రేమ, నర్మద షాక్ అవుతారు. ఏంటి వల్లక్కాయ్ కడుపుతో లేదా అని సుక్కును అడుగుతారు. ఆటలో దిగినప్పుడు అందరూ ఒకటేనని సుక్కు కవర్ చేస్తుంది. అక్కడి నుంచి సుక్కు, శ్రీవల్లి జంప్ అవుతారు. రేపటిలోపు వల్లి కడుపు సంగతి తేలుద్దామని ప్రేమ, నర్మద అనుకుంటారు.

పాపం తిరుపతి

నొప్పితో సుక్కు మూలుగుతూ ఉంటుంది. సుక్కు బాధ చూసిన తిరుపతి ఎవరు కొట్టారని అడుగుతాడు. దోమలు కుట్టాయని సుక్కు కవర్ చేస్తుంది. ఆ దోమనైనా కాకపోతినే అని తిరుపతి ఫీల్ అవుతాడు. వెంటనే వేపాకుల ధూపం వేస్తాడు. దాన్ని సుక్కు కింద పాడేస్తుంది. ఆ నిప్పులపై తిరుపతి అడుగులేస్తాడు. పతి, తిరుపతి నీకొకటి ఇస్తానంటూ మంట పుట్టేలా అతణ్ని తిరిగేలా చేస్తుంది సుక్కు.

రాజపుష్పం కాల్

మార్నింగ్ ప్రేమకు రాజపుష్పం కాల్ చేసి డ్యాన్స్ కాంపిటీషన్ కు సెలెక్ట్ అయ్యావని చెప్తాడు. మీ లాంటి నాట్య మయూరిని సెలెక్ట్ చేసినందుకు గర్వపడుతున్నానని కామంతో నిండిన గొంతుతో మాట్లాడతాడు. మీ ఒంపులు సొంపులు మతి పోగొడుతున్నాయి, ఐ మీన్ మీ డ్యాన్స్ మూవ్స్ చాలా బాగున్నాయి. వీ వాంట్ యూ. మీ లాంటి వండర్ ఫుల్ డ్యాన్సర్ మాకు కావాలి. మీరు ఎలాగైనా రావాలి. కాంపిటీషన్ లో గెలిస్తే రూ.10 లక్షలు వస్తాయని రాజపుష్పం అంటాడు.

హండ్రెడ్ పర్సెంట్ మీరే గెలుస్తారు. ఇలాంటి ఛాన్స్ మళ్లీ మళ్లీ రాదు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుందాం. నీ కోసం ఎదురు చూస్తుంటానని చెప్పి రాజపుష్పం కాల్ కట్ చేస్తాడు.

ప్రేమ డ్యాన్స్

ఈ విషయాన్ని ధీరజ్ కు ఎలా చెప్పాలని ప్రేమ ఆలోచిస్తుంది. టవల్ తో డ్యాన్స్ చేస్తూ, ధీరజ్ తలను తుడుస్తుంది. ధీరజ్ ను లాక్కొని డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ చేస్తూనే ధీరజ్ కు డ్రెస్ వేస్తుంది ప్రేమ. ప్రేమగా టిఫిన్ కూడడా తినిపిస్తుంది. ప్రేమ డ్యాన్స్ చూసి ధీరజ్ చప్పట్లు కొడతాడు.

అప్పుడే డ్యాన్స్ కంపీటిషన్ గురించి ప్రేమ చెప్తుంది. పర్మిషన్ ఇస్తే వెళ్తానంటుంది. పర్మిషన్ కాదు లాగిపెట్టి ఒక్కటి ఇస్తా. దిక్కుమాలిన తెలివితేటలు తగ్గించుకో అని ధీరజ్ అంటాడు. రూ.10 లక్షల ప్రైజ్ మనీ గెలిస్తే, ఆ డబ్బుతో కారు కొనుక్కోవచ్చని ప్రేమ చెప్తుంది. దేవుడు మంచి అవకాశం ఇస్తే ఎందుకు వద్దంటున్నావని అడుగుతుంది.

నో చెప్పిన ధీరజ్

ఒక రోజు నువ్వు జస్ట్ డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్తేనే మీ నాన్న గొడవ చేశాడు. ఇప్పుడు నువ్వు కాంపిటీషన్ కు వెళ్తే మీ భద్రం అత్త కత్తుల రత్తమ్మలా మన ఇంటి మీదకు యుద్ధానికి వస్తుంది. నేను కారు కొనుక్కుని, సొంతంగా ట్రావెల్స్ పెట్టుకోకపోయినా పర్వాలేదు. కానీ నా కారణంగా మా నాన్న రోడ్డు మీద నిలబడకూడదు. మీ వాళ్లతో అవమానాలు పడకూడదు. దయచేసి అర్థం చేసుకో అని ధీరజ్ వెళ్లిపోతాడు.

వల్లి తెలివి

మరోవైపు నర్మదకు కొరియర్ వస్తుంది. దాన్ని శ్రీవల్లి తీసుకుంటానంటుంది. కోడ్ చెప్తేనే ఇస్తానని డెలివరీ బాయ్ అంటాడు. నల్ల కోడి, తెల్ల కోడి అని వల్లి చెప్తుంది. కోడ్ అంటే కోడి కాదు మేడం అని డెలివరీ బాయ్ షాక్ అవుతాడు. ఆకాశం ఎర్రగా ఉంది అని వల్లి అంటుంది. అప్పుడే నర్మద వచ్చి ఓటీపీ చెప్పి డెలివరీ తీసుకుంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More