ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 17 ఎపిసోడ్: ధీరజ్ కారును లాక్కెళ్లిన ఫైనాన్సియర్.. భద్రావతికి మాస్ వార్నింగ్.. నర్మద ట్విస్ట్

Illu Illalu Pillalu June 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 17 ఎపిసోడ్ లో భద్రావతి చెప్పడంతో ధీరజ్ కారును ఫైనాన్సియర్ లాక్కెళ్తాడు. అయినా పొగరుతో భద్రావతి, సేనాపతిపై ధీరజ్ కౌంటర్లు వేస్తాడు. మరోవైపు ప్రేమ ఫీల్ అయ్యేలా చేసిన వల్లికి కచేరీ ప్లాన్ చేస్తారు. నర్మద ట్విస్ట్ ఇస్తుంది.

Published on: Jun 17, 2026, 07:49:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 17 ఎపిసోడ్ లో.. ధీరజ్ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న భద్రావతి, సేనాపతి అతన్ని దెబ్బకొట్టాలని చూస్తారు. ధీరజ్ కారును ఫైనాన్సియర్ లాక్కెళ్తాడు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

తిరుపతి పాటలు

చెలియ లేదు, చెలిమి లేదంటూ విరహ వేదనతో పాట పాడుకుంటాడు తిరుపతి. రామరాజు వచ్చి కౌంటర్ వేస్తాడు. నా ఏజ్ లో వాళ్లు గర్ల్ ఫ్రెండ్ ను బైక్ పై ఎక్కించుకుని తిరుగుతారు కదా. మరి నేనేమో నిన్ను ఎక్కించుకుని తిరుగుతున్నానని తిరుపతి ఫీల్ అవుతాడు. నీ ముఖానికి గర్ల్ ఫ్రెండ్ ను ఎక్కించుకునే వయసా నీది అని రామరాజు అంటాడు.

కారును ఆపి

తండ్రిని కార్లో డ్రాప్ చేస్తానంటాడు ధీరజ్. వాళ్ల కారు ఇల్లు దాటుతుండగా ఫైనాన్సియర్ కారు అడ్డం పెడతాడు. అగ్రిమెంట్ రూల్ ప్రకారం పోలీస్ కేసు అయింది కాబట్టి కారు తీసుకెళ్తానంటాడు. కానీ అది తప్పుడు కేసు అని ధీరజ్, రామరాజు చెప్తారు. కుట్ర చేసి ఇరికించారంటారు.

కానీ ఆ ఫైనాన్సియర్ మాత్రం వినడు. పోలీసులు అంత ఈజీగా వదిలిపెట్టరు. మళ్లీ స్టేషన్ కు పిలుస్తారు. ఏమైనా అయితే కారును సీజ్ చేస్తారు. అప్పుడు నష్టపోయేది నేనేనని అంటాడు. అంతగా కారు కావాలని అనుకుంటే మొత్తం డబ్బులు కట్టి తీసుకో అని చెప్తాడు.

కారు తీసుకెళ్లిన ఫైనాన్సియర్

అప్పుడే భద్రావతి, సేనాపతి బయటకు వస్తారు. సొంత కారు అయినట్లు దర్జాగా కూర్చునావ్ ఏంట్రా రామరాజు అని భద్రావతి నోరు జారుతుంది. వీడికి డౌన్ పేమెంట్ కట్టే దిక్కే లేదు. వాళ్ల కాళ్లు, వీళ్ల కాళ్లు పట్టుకుంటున్నాడని ధీరజ్ ను అంటుంది. రూపాయి గతి లేని వాడు మొత్తం కట్టి కారు తీసుకుంటాడా? అని సేనాపతి అంటాడు. మీరు కారు తీసుకెళ్లండని భద్రావతి అనగానే ఫైనాన్సియర్ కారు తీసుకెళ్తాడు.

పొగరు తగ్గదని

అది చూసి భద్రావతి, సేనాపతి నవ్వుతారు. పొగరు దిగిందా? కుందేలు ఎప్పుడూ పులికి అడ్డు రాకూడదని భద్రావతి గొప్పగా అంటుంది. వీళ్లు రాక్షసానందం పొందుతున్నారని ప్రేమ ఫైర్ అవుతుంది. జంతువులను కొట్టకూడదు. నువ్వే కదా భద్రం పులి అనుకున్నావ్ అని ధీరజ్ కౌంటర్లు వేస్తాడు. మా నాన్న పంచిన రక్తంలోని నిజాయతీ పొగరు, అది తగ్గదని ధీరజ్ అంటాడు.

బైక్ వేసుకొని బయటకు వస్తాడు ధీరజ్. పోయింది కారే, కాన్ఫిడెన్స్ కాదు. మీరు కారు తీసుకెళ్లేలా చేయగలరు. కానీ మా నాన్న ఇచ్చిన ధైర్యాన్ని లాక్కోలేరు. మీరు నన్ను ఎంత వెనక్కి లాగాలని చూస్తే, నేను అంత ముందుకు వెళ్తానని హీరో లెవల్ లో చెప్పి బైక్ పై ధీరజ్ వెళ్లిపోతాడు. మీరు బాగు పడరని వేదవతి ఫీల్ అవుతుంది.

బాధపెట్టేలా వల్లి

ప్రేమ డల్ గా కూర్చోవడం చూసి శ్రీవల్లి, సుక్కు నవ్వేసుకుంటారు. బాధ పడుతున్న వాళ్లను మరింత బాధ పెట్టాలి. ఈ పొట్టి మిరపకాయతో కన్నీళ్లు పెట్టిస్తానని చిన్న కారు బొమ్మను శ్రీవల్లి పట్టుకుని వస్తుంది. కారు బొమ్మను కింద పెట్టి దాని చుట్టూ తిరుగుతూ వల్లి, సుక్కు పాటలు పాడుతూ ప్రేమను ఇంకా బాధపెడతారు.

కంటి చూపుతో చంపేస్తానని ఎదురింటికి వెళ్లడం ఎందుకో? కారు పోగొట్టుకుని ఫుడ్ డెలివరీ కోసం వెళ్లడం ఎందుకో? అని వల్లి అనగానే ప్రేమకు మండిపోతుంది. ఏ వల్లి అని ప్రేమ చేయి ఎత్తుతుంది. వెంటనే నవ్వుతూ సాయంత్రం వల్లికి కచేరి ఉందంటా డాం డాం అని ప్రేమ ఎగురుతూ కౌంటర్లు వేస్తుంది.

నర్మద ట్విస్ట్

మరోవైపు తిరుపతి, రామరాజు వెళ్తున్న బైక్ సడెన్ గా ఆగిపోతుంది. అప్పుడే నర్మద స్కూటీపై వస్తుంది. 2 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లాల్సిందేనని రామరాజుతో తిరుపతి అంటాడు. అప్పుడే మామయ్యను తన స్కూటీ ఎక్కమంటుంది నర్మద. కానీ రామరాజు ఒప్పుకోడు. నువ్వు సాగర్ భార్యవి. నడిపోడు వేరు పడ్డాడు. మా బావను శత్రువుగా చూస్తున్నాడు. మరి మా బావ నీ బండి ఎలా ఎక్కుతున్నాడని తిరుపతి అంటాడు.

నేను సాగర్ భార్యని, రామరాజు కోడలిని కాదని అనుకోండి. నన్ను కోడలు లాంటిదాన్ని అనుకోండి. మా మామయ్య లాంటి వారు అనుకోండి. లిఫ్ట్ ఇస్తున్నానని అనుకోండి బండి ఎక్కండని నర్మద అడుగుతుంది. చివరకు రామరాజు ఒప్పుకోవడంతో నర్మద ముఖం వెలిగిపోతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More