ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 15 ఎపిసోడ్: కడుపు నాటకమాడుతున్న వల్లికి షాక్.. రామరాజుకు నర్మద సారీ.. సుక్కు చేతిలో తన్నులు
Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 15 ఎపిసోడ్ లో సాగర్ కు షాక్ తగులుతుంది. అతను చేసిన పనికి రామరాజు సీరియస్ కావడంతో నర్మద సారీ చెప్తుంది. మరోవైపు సుక్కు చేతిలో తిరుపతి దెబ్బలు తింటాడు. వల్లికి నర్మద, ప్రేమ కలిసి స్పెషల్ ఫుడ్ రెడీ చేస్తారు.
Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులు, నాటకాలతో సాగింది. ఒకవైపు బొద్దింకతో భయపెట్టి దగ్గరవుదామనుకున్న తిరుపతికి సుకన్య దేహశుద్ధి చేయగా.. మరోవైపు కడుపుతో ఉన్నానని నాటకమాడుతున్న శ్రీవల్లికి నర్మద, ప్రేమలు ఊహించని షాకిచ్చారు. ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 15 ఎపిసోడ్‌లో జరిగిన ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

బర్గర్లు లాగించేస్తూ
సాగర్ తెచ్చిన బర్గర్లను అందరూ కలిసి లాగించేస్తారు. అప్పుడే నర్మద తీసుకురా తిందాం అంటూ వచ్చిన సాగర్.. వాటిని తింటున్న అందరిని చూసి షాక్ అవుతాడు. కలిసి తిందాం అన్నావ్ కదా సాగర్, అందుకే కలిసి తింటున్నామని నర్మద ట్విస్ట్ ఇస్తుంది.
నర్మద సారీ
కలిసి తిందాం అన్న నీ మాటలతో టచ్ చేశావ్ అని ధీరజ్ అంటాడు. కానీ సాగర్ ఏమో భార్యపై కోప్పడతాడు. మనం ఇద్దరం తిందామని చెప్పా. కానీ ముక్కు మొహం తెలియని వాళ్లతో కాదని సాగర్ అంటాడు. నువ్వు కూడా తిను అని ధీరజ్ ఇస్తుంటే సాగర్ విసిరికొడతాడు. అది వెళ్లి రామరాజుకు తగులుతుంది. వెంటనే నర్మద సారీ మామయ్య అని చెప్తుంది.
వీడి వల్ల నా పరువు, మర్యాదల మీద మరకలు పడ్డాయి. ఈ షర్ట్ మీద మరకలు పడితే ఏముంది? ఉన్నప్పుడు ఎగిరెగిరి పడితే, లేనప్పుడు అడుక్కోవాల్సి వస్తుందని రామరాజు అంటాడు.
ప్రేమ పాఠాలు
పొద్దున కారు డోర్ తీసిన ధీరజ్.. తిరుపతిని చూసి షాక్ అవుతాడు. నీకో విషయం చెప్పాలని రాత్రంతా కార్లో పడుకున్నానని తిరుపతి చెప్తాడు. అమ్మాయిని ప్రేమలో పడేసే సజెషన్స్ చెప్పమని అల్లుడిని అడుగుతాడు. ఒకసారి స్వప్న సుందరి అని బొక్కబోర్లా పడ్డావ్ అని ధీరజ్ అంటాడు. ఇప్పుడు చూసి లవ్ చేస్తున్నానని తిరుపతి చెప్తాడు.
బొద్దింక పేరు వినగానే
ఆడ లేడీస్ కు అతిలోక సుందరి లాంటి అందంతో పాటు అతి భయంకరమైన వాయిస్ ఇచ్చారు. పంచ భూతాలను సైతం భయపెట్టగలరు. కానీ బొద్దింకను చూస్తే మాత్రం భయపడతారని ధీరజ్ చెప్తుండగా ప్రేమ వస్తుంది. బొద్దింక ఎక్కడా అని ఎగిరి ధీరజ్ పైకి ఎక్కుతుంది. అది చూసి తిరుపతి ఫీల్ అయిపోతాడు.
భర్తకు ముద్దు
ఆడవాళ్లకు బొద్దింక అంటే భయం కాబట్టి అని ధీరజ్ చెప్తుండగా తిరుపతి పూర్తిగా విననే వినడు. పిచ్చెక్కిస్తా అని లోపలికి వెళ్తాడు. మరోవైపు బయటకు వెళ్లేటప్పుడు భార్యను ఎదురు రామ్మనడం తెలియదు కానీ లవ్ గురూలా సలహాలు ఇస్తున్నావా? అని ధీరజ్ ను ప్రేమ అడుగుతుంది. గంగ చంద్రముఖిలా మారినట్లు, నువ్వు ఇలా మారిపోయావేంటీ? అని ధీరజ్ అంటాడు. భర్తకు ముద్దు పెట్టి ప్రేమ పంపిస్తుంది.
చితకబాదిన సుక్కు
మరోవైపు ఎక్కడున్నావమ్మా బొద్దింక అంటూ పాడుతూ బొద్దింకను పట్టుకుంటాడు తిరుపతి. కన్య అనుకుంటూ సుకన్య దగ్గరకు వెళ్తాడు. బొద్దింక అనగానే తిరుపతి చంక ఎక్కుతుందని ఊహించుకుంటాడు. బొద్దింక అని తిరుపతి అనగానే సుక్కు దాన్ని పైకి కొడుతుంది. బొద్దింక డైరెక్ట్ గా వెళ్లి తిరుపతి షర్ట్ లోపల పడుతుంది. తనకు బొద్దింక అంటే బీపీ అని కర్రతో తిరుపతిని చితకబాదుతుంది సుక్కు.
వల్లి షాక్
రాత్రి కాగానే సుక్కు అని అరుస్తుంది శ్రీవల్లి. ఆకలేస్తుందని కేకలు వేస్తుంది. నేను కడుపుతో ఉన్నానే. కడుపులో బిడ్డ ఆకలి అంటోందని వల్లి చెప్తుంది. కడుపుతో ఉన్నావని నా దగ్గర కూడా నటించేస్తున్నావ్. మరీ ఓవరాక్షన్ చేయకు. ఇద్దరు శత్రువులు కాచుకుని కూర్చుకున్నారని సుక్కు చెప్తుంది. అప్పుడు కరివేపాకులతో నిండిన ఉప్మాను చూసి వల్లి షాక్ అవుతుంది.
స్పెషల్ ఫుడ్
నీ వంటలతో మా అక్కను చంపేస్తావా? అని నర్మద వస్తుంది. నీ కోసం స్పెషల్ ఫుడ్ రెడీ చేశానని నర్మద చెప్తుంది. సుక్కు కూడా పెడదామంటుంది. వల్లి మహారాణి గారికి స్పెషల్ అల్పహారం తీసుకురండని నర్మద చప్పట్లు కొడుతుంది. అప్పుడే ప్లేటుతో ప్రేమ ఎంట్రీ ఇస్తుంది. పెద్ద మంచం చూసి వల్లి ఏమో తెగ ఆరాటపడుతుంది. అందాల మా ఊరి అక్కాచెల్లెల్లే అంటూ ప్రేమ, నర్మదను పట్టుకుని వల్లి పాడేస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 15 ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


