Illu Illalu Pillalu July 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- వేదవతి విశ్వరూపం- కోడలిని గెంటేసిన అత్త- బావిలో దూకిన వల్లి
Illu Illalu Pillalu July 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూలై 7 ఎపిసోడ్ లో వేదవతి విశ్వరూపం చూపిస్తుంది. శ్రీవల్లిని పుట్టింటికి లాక్కొచ్చి పడేస్తుంది వేదవతి. రామరాజుకు ఫోన్ చేసి నిజాలు చెప్తానంటుంది. చేసేదేం లేక వల్లి బావిలోకి దూకేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? పూర్తి ఎపిసోడ్ మీకోసం.
Illu Illalu Pillalu July 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 7 ఎపిసోడ్ లో వల్లిని పుట్టింటికి లాక్కెళ్తుంది వేదవతి. కాపురం కూలిపోవడంతో ప్రాణాలు తీసుకోవడానికి వల్లి బావిలోకి దూకేస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

వేదవతి ఫైర్
శ్రీవల్లి కడుపు డ్రామా అని తెలిసి వేదవతి ఫుల్ ఎమోషనల్ అవుతుంది. పెద్ద కోడలిపై ఫుల్ ఫైర్ అవుతుంది. మీరు మోసం చేశారని తెలిస్తే ఆయన తట్టుకోగలరా? ఆయన చూసిన సంబంధం అని పెద్ద కోడలు గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ నిజం తెలిస్తే ఏమైపోతారో అని వల్లితో వేదవతి అంటుంది.
ఎందుకు మోసం చేశావ్?
నన్ను ఈ ఇంటికి పంపేందుకు మా అమ్మ అలా చేసిందని శ్రీవల్లి ఏడుస్తూ చెప్తుంది. నోర్మూయ్ అని వేదవతి గట్టిగా అరుస్తుంది. మేం ఏం పాపం చేశామని ఇంత దారుణంగా మోసం చేశావ్. నీ కడుపులో బిడ్డ ఉందని మేం ప్రేమలు పెంచుకుంటుంటే, అయ్యో పాపం అని ఒక్కసారైనా అనిపించలేదా? అని వేదవతి అడుగుతుంది.
గెంటేసిన అత్తయ్య
ఇది (నర్మద) నిజంగా నీ కడుపు పోగొట్టింది అని కొట్టాను. అప్పుడైనా నీకు నిజం చెప్పాలనిపించలేదా? నా కొడుకు కోపంతో ఉన్నా కూడా నిన్ను ఇంటికి తీసుకొచ్చా. అందుకు నాకు బాగా బుద్ధి చెప్పావ్ అని తన చెంపలపై కొట్టుకుంటుంది వేదవతి. నువ్వు బంగారం లాంటి నా ఇంటిని ఏం చేస్తావేమోనని భయమేస్తుంది. నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదని వల్లిని చేతులు పట్టి గెంటేస్తుంది వేదవతి.
విశ్వక్ కు శిక్ష
మరోవైపు లాయర్ దగ్గరకు వెళ్తాడు రామరాజు. నా కూతురికి మాయ మాటలు చెప్పి ట్రాప్ చేశాడు ఆ విశ్వక్. తెల్లవారితే పెళ్లి అనగా కూతురిని తీసుకెళ్లి రూమ్ లో బంధించాడు. ఆ బాధతో నేను దాదాపు చావును చూసి వచ్చా. ఆ విశ్వక్ కు శిక్ష పడాలని రామరాజు అంటాడు. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. ఆ విశ్వక్ కు శిక్ష పడుతుందని లాయర్ చెప్తాడు.
భాగ్యం, ఇడ్లీ బాబాయ్ షాక్
ఇక వేదవతిని తన పుట్టినిల్లుకు లాక్కొస్తుంది వేదవతి. అది చూసి భాగ్యం, ఇడ్లీ బాబాయ్ షాక్ అవుతారు. వేదవతి ఫ్యామిలీ కోపం చూసి భాగ్యం, ఇడ్లీ బాబాయ్ జడుసుకుంటారు. ఏమైందని భాగ్యం అడుగుతుంది. నీ కూతురు కడుపుతో ఉంది కదా, పురుడుకు పుట్టింటికి తీసుకొచ్చానని వేదవతి కోపంగా చెప్తుంది. నీ కూతురు నెల తప్పిందని చెప్తే నా కూతురే తల్లి కాబోతుందని సంతోషపడ్డానని వేదవతి అంటుంది.
అసలు నువ్వు అమ్మవేనా?
మమ్మల్ని పిచ్చోళ్లను చేస్తావా అని వేదవతి ఫైర్ అవుతుంది. నా కూతురు కాపురం నిలబెట్టడం కోసం ఇలా చేశానని భాగ్యం ఏడ్చేస్తుంది. నిజం తెలిసిన రోజు నీ కూతురు కాపురం ఏమవుతుందోననే భయం ఉందా? నీ అబద్ధం నిజం చేయడానికి మొగుడితో కాపురం చేయమని చెప్పి పంపించావ్. లోకంలో ఏ తల్లయినా ఇలా చేస్తుందా? అసలు నువ్వు అమ్మవేనా అని వేదవతి నిప్పులు చెరుగుతుంది.
వల్లి భయం
మీరు, మీ కూతురు కలిసి నా కొడుకును వెర్రిబాగులవాణ్ని చేశారు. కట్టుకున్న మొగుడిని చూసి దీనికైనా బాధ ఉండాలి కదా అని వేదవతి అంటుంది. చాలా సార్లు చెప్పాలనుకున్నా, కానీ భయంతో ఆగిపోయానని వల్లి చెప్తుంది. ఈ ఒక్కసారికి క్షమించమని భాగ్యం రిక్వెస్ట్ చేస్తుంది. ఈ మాట అనడానికి సిగ్గు అనిపించడం లేదా? ఇంకోసారి తప్పు చేస్తే మీ కూతురిని గుమ్మం తొక్కనివ్వను అని ఎప్పుడో చెప్పా. మీ కూతురు మా గుమ్మం తొక్కితే బాగోదని వేదవతి అంటుంది.
కోర్టులో తేల్చుకుంటామన్న భాగ్యం
అత్తయ్య అని ఏడుస్తూ వేదవతి కాళ్లపై వల్లి పడుతుంది. కానీ భాగ్యం మాత్రం పొగరు తగ్గించుకోదు. వాళ్ల కాళ్ల మీద పడాల్సిన అవసరం ఏముంది? వాళ్లను కోర్టు మెట్లు ఎక్కిిద్దామని భాగ్యం అనగానే అందరూ షాక్ అవుతారు. ఏంటి కోర్టు మెట్లు ఎక్కిస్తారా? ఏం చేస్తారని ధీరజ్, ప్రేమ అడుగుతారు. మీ అందరి మీద గృహ హింస కేసు పెట్టించి, మీ సంగతి కోర్టులోనే తేల్చుకుంటానని భాగ్యం చెప్తుంది.
రామరాజుకు ఫోన్
ఇంత జరిగినా మీకు బుద్ధి రావడం లేదని నర్మద అంటుంది. కోర్టు కాకపోతే ఎక్కడికి వెళ్తావో వెళ్లు, అందరూ మీ ముఖం మీదే ఉమ్మేస్తారని నర్మద అంటుంది. వెంటనే రామరాజుకు ఫోన్ చేసి వల్లి గురించి కొన్ని విషయాలు దాచామని, వెంటనే భాగ్యం వదిన ఇంటికి రమ్మని వేదవతి చెప్తుంది.
బాయిలో దూకేసిన వల్లి
అది చూసి వల్లి అక్కడే ఉన్న బావిలోకి దూకేస్తుంది. వెంటనే ధీరజ్ బావిలోకి దూకి వల్లిని బయటకు తీసుకొస్తాడు. వల్లి కళ్లు తెరవాలని అందరూ ఏడుస్తారు. వల్లి కళ్లు తెరుస్తుంది. నన్ను ఎందుకు కాపాడారు? నన్ను చావనివ్వండని వల్లి అంటుంది. వల్లిని వేదవతి గట్టిగా కొడుతుంది.
చందు కోపం
ఎందుకు బతకాలో తెలియనప్పుడు చచ్చిపోకుండా ఇంకా ఏం చేయాలి? నాకు బా కావాలి అని వల్లి ఏడుస్తుంది. నీకు నిజంగానే మొగుడు కావాలనే బుద్ధి ఉంటే, నువ్వు ఇన్ని మోసాలు చేయవ్. నన్ను పిచ్చోడిని చేసి ఆడించావ్. చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు చావడానికి వెళ్తావా? ఇంకా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అని చందు కోప్పడతాడు.
ప్రాణాలు తీసుకుంటానని
నిన్ను మోసం చేయొచ్చు కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం అబద్ధం కాదు. నా కాపురం నిలబడుతుందని అమ్మవాళ్లు చెప్తే అలా చేశా. చావైనా, బతుకైనా నీతోనే బా. నేను ఏం చెప్పినా మీరు నమ్మరు. అందుకే నా చావుతో నమ్మిస్తానని వల్లి అంటుంది. వద్దు అమ్మా అని నెత్తి నోరు మొత్తుకుని చెప్పా. నా కాపురం కూలిపోతుంటే చూస్తున్నావే తప్పా ఏం చేశావ్? నువ్వే నా కాపురాన్ని కూల్చేశావని భాగ్యంపై ఫైర్ అవుతుంది వల్లి.
మీరు అందరూ వెళ్లిపోయిన తర్వాత కచ్చితంగా ప్రాణాలు తీసుకుంటా. అప్పుడైనా మా అమ్మ చెప్తేనే చేశా తప్పా, నేను కావాలని మోసం చేయలేదని నమ్మండని వల్లి ఏడుస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


