Illu Illalu Pillalu July 14 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు..ప్రేమ కల కోసం రామరాజు-మారిపోయిన విశ్వ-బుద్ధి తెచ్చుకోని వల్లి
Illu Illalu Pillalu July 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 14 ఎపిసోడ్ లో షాకింగ్ ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయి. ప్రేమను ఎస్ఐ కోచింగ్ పంపించేందుకు రామరాజు ఒప్పుకొంటాడు. విశ్వ మంచోడిలా మారిపోతాడు. ప్రేమ కాపురాన్ని కూల్చాలని వల్లి ప్లాన్ వేస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ పై ఓ లుక్కేయండి.
Illu Illalu Pillalu July 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 14 ఎపిసోడ్ లో ప్రేమ ఎస్ఐ కోచింగ్ కు వెళ్లడానికి రామరాజు ఒప్పుకొంటాడు. సంతోషంతో ప్రేమ, నర్మద, వేదవతి, ధీరజ్ గంతులేస్తారు. ప్రేమ కాపురాన్ని కూల్చేందుకు వల్లి కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

ధీరజ్ డ్రామా
ప్రేమను ఎస్ఐ కోచింగ్ కు ఒప్పించడం కోసం తల్లితో కలిసి ధీరజ్ డ్రామా ఆడతాడు. సాగర్ ను అడ్డుపెట్టుకుని ప్రేమను రెచ్చగొడతాడు. దగ్గరుండి ప్రేమను పోలీస్ ఆఫీసర్ ను చేస్తానిన శపథం చేస్తాడు. ఈ క్షణమే ప్రేమను పోలీస్ కోచింగ్ అకాడమీలో జాయిన్ చేస్తానని ధీరజ్ చెప్తాడు. జోక్ లు వేస్తే నవ్వరా అని సాగర్ నవ్వుతాడు.
కోచింగ్ పంపిస్తానని
ప్రేమ జస్ట్ ట్యూషన్ క్లాస్ చెప్తేనే మీ ఆయన ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చాడు. అలాంటి మనిషి కోడలిని పోలీస్ కోచింగ్ కు పంపిస్తాడా? అని తల్లితో సాగర్ అంటాడు. నడిపోడు అలా మాట్లాడుతుంటే, మీరు మౌనంగా ఉంటారేంటీ? నడిపోడి నోరు మూయించడం కోసం ప్రేమను కోచింగ్ కు పంపిస్తానని చెప్పండని భర్త రామరాజుతో వేదవతి అంటుంది.
రామరాజు సీరియస్
ఆపండి, మీ డ్రామాలు. వాడి పేరు అడ్డు పెట్టుకుని ప్రేమను పోలీస్ కోచింగ్ కు పంపించేందుకు మీరు వేస్తున్న ప్లాన్ తెలుసుకోలేరని అనుకుంటున్నారా? వాడు రెచ్చగొట్టేలా మాట్లాడితే, నేను రెచ్చిపోతానా? అది జరగని పని రామరాజు సీరియస్ అవుతాడు. పోలీస్ ఆఫీసర్ కావాలన్నది ప్రేమ డ్రీమ్. ప్లీజ్ ఒప్పుకోండి మామయ్య అని నర్మద రిక్వెస్ట్ చేస్తుంది. తనను పంపిస్తే ఎదురింటి వాళ్లు గొడవకు వస్తారని చాలా సార్లు చెప్పా. అది జరగని పని రామరాజు గట్టిగా చెప్తాడు.
వేదవతి కౌంటర్
మా వాళ్లు గొడవకు వస్తే మనకేం ప్రాబ్లమ్ అని వేదవతి కూడా ఉంటుంది. చందు మధ్యలో జోక్యం చేసుకుని నర్మద జాబ్ చేస్తుంది, ప్రేమను పంపించకపోతే కోడళ్లపై పక్షపాతం చూపిస్తున్నారని అనుకుంటారు. దాని వల్ల మీకు మాట వస్తుందని చందు అంటాడు. మన ఇంట్లో పోలీస్ అంటే మనకే మంచిదని శ్రీవల్లి కూడా చెప్తుంది. అవును, ఇంటి దొంగలను ఈజీగా పట్టుకోవచ్చని వేదవతి కౌంటర్ ఇస్తుంది.
ఓకే చెప్పిన రామరాజు
అందరూ కలిసి రామరాజును రిక్వెస్ట్ చేస్తారు. మీకు ఇష్టం లేకపోతే నా డ్రీమ్ ను వదిలేసుకుంటా. కానీ మిమ్మల్ని బాధపెట్టలేనని ప్రేమ అంటుంది. నీ కలను నేను ఎందుకు చంపుకోమంటానని రామరాజు అంటాడు. మీ మామయ్య ఒప్పేసుకున్నాడని వేదవతి సంబరపడుతుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ధీరజ్ బయటకు వెళ్లి నడిపోడా అంటూ సాగర్ ను ఎత్తుకుని తిప్పుతాడు.
మంచోడినేనన్న సాగర్
నడిపోడా నీ ఓవరాక్షన్ కూడా మంచి పని చేసింది. ప్రేమను పోలీస్ ఆఫీసర్ చేసేందుకు నాన్న ఒప్పుకున్నాడ్రా అని ధీరజ్ సంతోషంగా చెప్తాడు. అయితే భూమి ఆగిపోతుందని సాగర్ తన తండ్రిపై కౌంటర్ వేస్తాడు. మీ నాన్న చాలా మంచోడ్రా అని వేదవతి అంటుంది. నేను మంచోడినే, మీ వల్లే ఇలా మారానని సాగర్ వెళ్లిపోతాడు.
ఇక ప్రేమ, నర్మద, ధీరజ్, వేదవతి కలిసి హ్యాపీగా స్టెప్పులేస్తారు. అది చూసి వల్లి తెగ కుళ్లుకుంటుంది. ఈ సంతోషం ఎంత కాలం ఉంటుందో నేనూ చూస్తానని వల్లి అనుకుంటుంది.
మారిపోయిన విశ్వ
మరోవైపు కాలేజీలో అమూల్యను కొంతమంది పోకిరీ స్టూడెంట్లు ఏడిపిస్తారు. ఒకడు అమూల్య చేయి పట్టుకుంటాడు. అప్పుడే విశ్వ వచ్చి వాళ్లను కొడతాడు. మామ దాని కోసం మమ్మల్ని కొడతావేంట్రా అని విశ్వను వాళ్లు అడుగుతారు. దాన్ని అంటావేంట్రా అని విశ్వ వాళ్లను గట్టిగా కొడతాడు. నా దగ్గర సింపతీ కొట్టేయడం కోసం కొత్త డ్రామా స్టార్ట్ చేశావా? అని అమూల్య అడుగుతుంది.
వాళ్లకు, నాకు సంబంధం లేదు. ఇందులో ఎలాంటి డ్రామా లేదు. నన్ను నమ్ము అని విశ్వ అంటాడు. చచ్చినా నమ్మనని అమూల్య వెళ్లిపోతుంది. తన విలువ తెలుసుకున్నారా, తను నా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నా అని ఫ్రెండ్స్ తో విశ్వ అంటాడు. దీంతో విశ్వ నిజంగానే మారిపోయాడేమో అనిపిస్తుంది.
వల్లి కుట్ర
ఇటు పుట్టింట్లో వల్లి ఒక్కరే పులి మేక ఆటాడుకుంటుంది. ఈ వల్లి పంజాకు ప్రేమ దొరికింది. ప్రేమను కొట్టబోయే దెబ్బ మామూలుగా ఉండదు. మేకను పులి కొట్టినట్లు, ప్రేమ కాపురం విలవిలలాడిపోవాలని వల్లి పగతో రగిలిపోతుంటుంది. అప్పుడే గులాబీ పట్టుకుని తిరుపతి వస్తాడు. మనం పెట్టే మందు పాతరకు ఆ కుటుంబం విడిపోవాలని వల్లి చెప్తుంటుంది.
వల్లి ఉంది, రావడం కుదరదని తిరుపతికి సుక్కు సైగలు చేస్తుంది. పువ్వును విసరమంటుంది. ఆ పువ్వు నేరుగా వల్లి తలలో పడుతుంది. తిరుపతి పారిపోతాడు. ఇక ప్రేమ పెళ్లి గురించి అసలు విషయాన్ని భాగ్యం, సుక్కుకు వల్లి చెప్తుంది. సీక్రెట్ కనిపెట్టేందుకు ప్లాన్ వేస్తుంది. ప్రేమ కాపురం బూడిద అవుతుందని వల్లి సైకోలా చెప్తుంది. దీంతో ఎంత పెద్ద గొడవ జరిగినా వల్లి బుద్ధి మాత్రం మారలేదని అర్థమవుతోంది.
ప్రేమను ఎస్ఐ కోచింగ్ క్లాస్ కు తీసుకెళ్తాడు ధీరజ్. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


