Illu Illalu Pillalu July 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు..ప్రేమ పెళ్లి సీక్రెట్ తెలుసుకున్న వల్లి-తల్లితో ధీరజ్ డ్రామా

Illu Illalu Pillalu July 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 13 ఎపిసోడ్ లో ప్రేమ, ధీరజ్ పెళ్లి రహస్యాన్ని తెలుసుకున్న వల్లి మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటుంది. మరోవైపు ప్రేమ ఫీల్ అవుతుంది. వేదవతితో కలిసి ధీరజ్ డ్రామా వేస్తాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం.

Published on: Jul 13, 2026, 07:43:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu July 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 13 ఎపిసోడ్ లో ప్రేమ, ధీరజ్ పెళ్లి రహస్యం తెలుసుకున్న వల్లి పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. మరోవైపు తిరుపతితో లవ్ డ్రామా ఆడుతుంది సుక్కు. పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

చందును ఆపిన వల్లి

అత్త వేదవతి మళ్లీ కొట్టడంతో శ్రీవల్లి ఫీల్ అవుతుంది. చాప, దిండు తీసుకొని బయటకు వెళ్తున్న మొగుణ్ని ఆపుతుంది. మంచంపైనే పడుకోమని చెప్తుంది శ్రీవల్లి. ఏంటీ నోరు లేస్తుంది? మనం నలుగురిలోనే భార్యాభర్తలం. నాలుగు గోడల మధ్య కాదు. నీతో మాట్లాడాలంటేనే కంపరంగా ఉందని చందు అంటాడు. రోజూ బయట ఎందుకు పడుకుంటాన్నావని మీ నాన్న అడిగితే ఏం చెప్తావని? వల్లి అడగుతుంది.

పగతో రగిలిపోతూ

నేను కూడా దిగజారి కాపురం చేయలేను. నేను చేసినవన్ని నీకోసమే అని తెలుసుకునేంత వరకూ దూరంగానే ఉంటా. నువ్వు మంచం మీద పడుకో, నేను కింద పడుకుంటానని వల్లి చెప్తుంది. కింద పడుకొని వేదవతి, ప్రేమ, ధీరజ్ గురించే ఆలోచిస్తుంది వల్లి. ప్రేమ, ధీరజ్ గురించి వేదవతి ఫీల్ అవడం తలుచుకొని వల్లి రగిలిపోతుంది.

పెళ్లి రహస్యం

మీ పెళ్లి రహస్యాన్ని మామయ్యకు చెప్తానని ప్రేమతో వేదవతి అంటుంది. మామయ్యకు చెప్పొద్దని ప్రేమ ఆపుతుంది. కళ్యాణ్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఆ కళ్యాణ్ నన్ను మోసం చేస్తే ధీరజ్ నా మెడలో తాళి కట్టాడని చెప్పాలి. అది తెలిస్తే మా వాళ్లు తట్టుకోలేరు. కళ్యాణ్ విషయాన్ని ఎవరితో చెప్పనని మాట ఇవ్వండి అత్తయ్య అని ప్రేమ అడుగుతుంది. ఇదంతా సీక్రెట్ గా వల్లి వింటుంది. నమ్మించి నాటకం ఆడతారా? మీ పని చెప్తానని వల్లి అనుకుంటుంది.

ఫీల్ అయిన ప్రేమ

ఉదయం ప్రేమ బాధపడుతూ ఉంటుంది. మనకు నచ్చనివి చెరిపేసే ఆప్షన్ ఉంటే బాగుండేది కదా అని ప్రేమ ఏడుస్తుంది. మన పెళ్లి గురించి మాట్లాడినప్పుడు వల్లి అక్క వినేసిందని భయపడ్డాం కదా. ఆ విషయం మామయ్యకు కానీ లేదా మా వాళ్లకు కానీ తెలిస్తే ఎలా అని ప్రేమ టెన్షన్ పడుతూ ధీరజ్ కు చెప్తుంది. కళ్యాణ్ చచ్చిపోతానంటే గుడ్డిగా నమ్మి వాడి కోసం వెళ్లా. ఆ రోజు పరిస్థితులు నా చేతుల్లో లేవు. కానీ నా లైఫ్ ను నీ చేతుల్లోకి తీసుకెళ్లావ్ అని ప్రేమ ఫీల్ అవుతుంది.

ధీరజ్ ఒట్టు

ఇవన్నీ వదిలేయమని ధీరజ్ అంటాడు. ఈ విషయాలు మా వాళ్లకు తెలిస్తే నేను తట్టుకోలేను. నేను ఒకడి చేతిలో మోసపోయాననే గిల్ట్ ను తట్టుకొని బతకలేను. కళ్యాణ్ గురించి మా వాళ్లకు ఎప్పటికీ తెలియకూడదని ధీరజ్ తో ప్రేమ చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్యాణ్ గురించి మా వాళ్ల దగ్గర మాట్లాడనని మాట ఇవ్వమని ప్రేమ అడుగుతుంది. అలాగే అని ధీరజ్ మాటిస్తాడు.

భాగ్యం ప్లాన్

మరోవైపు సుక్కు ఊరు వెళ్లడానికి బట్టలు సర్దుకుంటుంది. నాకిచ్చిన పని, నా క్యారెక్టర్ అయిపోయింది. ఇక సినిమాల్లోకి వెళ్లి ఛాన్స్ ల కోసం ట్రై చేసుకుంటానని సుక్కు అంటుంది. లైఫ్ సెట్ అయ్యే స్కీమ్, స్కామ్ చెప్తానని భాగ్యం అంటుంది. ఆ తిరుపతిని పెళ్లి చేసుకో, నీ లైఫ్ సెట్ అవుతుందని భాగ్యం చెప్తుంది.

తిరుపతితో లవ్

హీరోయిన్ ని అయిన నన్ను కమెడియన్ ను పెళ్లి చేసుకోమంటావేంటీ అని సుక్కు అడుగుతుంది. ఆ తిరుపతి జమీందార్ కొడుకు. అతని వాటా కోట్లకు కోట్లు ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే సొంతంగా సినిమా తీసుకోవచ్చని భాగ్యం చెప్తుంది. అప్పుడే తిరుపతి బైక్ మీద స్టైల్ గా వస్తాడు. ఇక తిరుపతిని పడేసి పనిలో పడిపోతుంది సుక్కు.

తిరుపతితో ప్రేమగా మాట్లాడుతుంది సుక్కు. నా హార్ట్ తిరు తిరు అని కొట్టుకుంటుందని డాక్టర్ చెప్పాడని సుక్కు సిగ్గు పడుతుంది. నా పొలంలో మొలకలు వచ్చాయని తిరుపతి గంతులేస్తాడు. అదే స్పీడ్ తో బైక్ పై వెళ్లి చెట్టుకు ఢీ కొడతాడు.

రామరాజు గర్వం

ఇటు రైస్ మిల్ లెక్కలను రామరాజుకు చెప్తుంటాడు చందు. మీ నాన్న నీకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు కదా ఇంకా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని చందును వేదవతి అడుగుతుంది. రైస్ మిల్ కు సంబంధించిన ప్రతి విషయం, ప్రతి రూపాయి నాన్నకు తెలియాలని చందు అనగానే రామరాజు గర్వంతో పొంగిపోతాడు. అప్పుడే నర్మద, సాగర్ గది నుంచి బయటకు వస్తారు.

సాగర్ రివర్స్ కౌంటర్

వాళ్లను చూసి చందును కావాలనే రామరాజు పొగుడుతాడు. కొంతమందిలా నామూషీ ఫీల్ కాడని సాగర్ కు కావాలనే కౌంటర్ వేస్తాడు రామరాజు. వెంటనే సాగర్ ఫోన్ తీసి మా ఇంట్లో నేను, నా భార్య మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగులం. మిగతా వాళ్లు చెప్పేంత గొప్ప పని ఏం చేయట్లేదు. కొంతమంది రైస్ మిల్ చూసుకుంటూ ఉంటారు. కొంతమంది కారు తోలుకుంటూ ఉంటారని రివర్స్ కౌంటర్ ఇస్తాడు రామరాజు.

ధీరజ్ డ్రామా

నోరు మూసుకోరా అని వేదవతి చెప్తున్నా సాగర్ వినడు. ప్రేమను ఎస్ఐ కోచింగ్ కు పంపించేందుకు ఇదే సరైన టైమ్ అని తల్లితో కలిసి ప్లాన్ వేస్తాడు ధీరజ్. ఏంట్రా నీకు, నీ భార్యకు మాత్రమే గవర్నమెంట్ జాబ్ ఉందని ఎక్స్ ట్రాలు మాట్లాడుతున్నావని ధీరజ్ డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఇంట్లో గవర్నమెంట్ జాబ్ చేయడానికి మేం తప్పా ఎవరున్నారని సాగర్ అడుగుతాడు. నా భార్య ప్రేమ ఉందని ధీరజ్ గొప్పగా చెప్తాడు.

ప్రేమకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది కల. తను తలుచుకుంటే తెల్లారేసరికల్లా పోలీస్ ఆఫీసర్ కాగలదని వేదవతి రెచ్చగొడుతోంది. దగ్గరుండి ప్రేమను పోలీస్ ఆఫీసర్ చేస్తానని ధీరజ్ చెప్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More