Illu Illalu Pillalu: జనాలను పిచ్చోళ్లను చేసిన ఇల్లు ఇల్లాలు పిల్లలు మేకర్స్-సీరియల్ లాగే ప్లాన్-ధీరజ్, ప్రేమ కలుస్తారా?

Illu Illalu Pillalu: స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే ప్రముఖ సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu) లో మేకర్స్ ఇచ్చిన అనూహ్యమైన ట్విస్ట్ వీక్షకులకు మైండ్ బ్లాక్ చేసింది. సీరియల్ ను ఇంకా సాగదీసే ప్రయత్నంలో భాగంగా చూసే ప్రేక్షకులను మేకర్స్ పిచ్చోళ్లను చేశారనే కామెంట్లు వస్తున్నాయి.

Published on: Aug 1, 2026, 17:18:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి టీఆర్పీ రేటింగ్‌లతో దూసుకుపోతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. రోజుకో మలుపుతో ఆడియన్స్‌ను కట్టిపడేసే ప్రయత్నం చేస్తున్న మేకర్స్, తాజాగా ప్లే చేసిన ఒక క్లాసిక్ 'డ్రీమ్ సీన్' ట్విస్ట్ మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్లు, సీరియల్ ప్రేమికుల నుంచి తీవ్ర అసహనానికి దారితీసింది.

జనాలను పిచ్చోళ్లను చేసిన ఇల్లు ఇల్లాలు పిల్లలు మేకర్స్-సీరియల్ లాగే ప్లాన్-ధీరజ్, ప్రేమ కలుస్తారా? (jiohotstar)
జనాలను పిచ్చోళ్లను చేసిన ఇల్లు ఇల్లాలు పిల్లలు మేకర్స్-సీరియల్ లాగే ప్లాన్-ధీరజ్, ప్రేమ కలుస్తారా? (jiohotstar)

ప్రేమ దగ్గరకు ధీరజ్

జూలై 31 (శుక్రవారం) ప్రసారమైన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్‌లో కథ అత్యంత ఆసక్తికరమైన ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ధీరజ్ తను చేసిన తప్పును తెలుసుకుని ప్రేమ దగ్గరకు వెళ్లడం, ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడం విజువల్‌గా చూపించారు.

ప్రేమ కూడా తన ఇగోను పక్కనపెట్టి ధీరజ్ క్షమాపణను అంగీకరించి, అతనితో తిరిగి వెళ్లేందుకు సిద్ధపడింది. సరిగ్గా అదే సమయంలో భద్రావతి ఎంట్రీ ఇచ్చి వారిని అడ్డుకోవడంతో ఎపిసోడ్‌కు భారీ హైప్ క్రియేట్ అయింది.

అంతా ఒక కలా?

అయితే, ఆగస్టు 1 (శనివారం) ఎపిసోడ్‌లో మేకర్స్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు. ధీరజ్ వెళ్లడం, ప్రేమ క్షమించడం, భద్రావతి అడ్డుకోవడం.. ఇదంతా కేవలం ధీరజ్ కన్న ఒక కల అని తేల్చేశారు! తూచ్.. ధీరజ్ తన ఇంట్లోనే ఉన్నాడని చూపించేశారు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా తీవ్ర అసహనానికి గురయ్యారు.

నిజ జీవితంలో ప్రేమ ఇంకా భద్రావతి ఇంట్లోనే ఉంటోంది, ధీరజ్ తన తప్పును తెలుసుకుని నిజంగా క్షమాపణలు చెప్పే పరిస్థితి ఇంకా రాలేదు.

మరికొన్ని వారాల పాటు

ధీరజ్, ప్రేమలను వెంటనే కలిపేస్తే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రస్తుత కథలోని ప్రధాన సంఘర్షణ ముగిసిపోతుంది. అందుకే భద్రావతి కుట్రలను మరికొన్ని వారాల పాటు కొనసాగించడానికి, ఎపిసోడ్ రన్ టైమ్‌ను పెంచడానికే మేకర్స్ ఈ 'డ్రీమ్ సీన్' డ్రామాను తెరపైకి తెచ్చారని చెప్పాలి.

నిజంగా ప్రేమ, ధీరజ్‌లు ఒకటవుతున్నారని భావించిన ఫ్యాన్స్.. ఇది కేవలం కల అని తేలడంతో సోషల్ మీడియా వేదికగా మేకర్స్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. "మా ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

టీఆర్పీ రేటింగ్స్ కోసం ట్రిక్!

బుల్లితెర ట్రెండ్స్‌ను లోతుగా పరిశీలిస్తే.. ప్రైమ్ టైమ్ సీరియల్స్ లో రేటింగ్‌లు పెంచుకోవడానికి మేకర్స్ వాడే అత్యంత పాత, కానీ ప్రభావవంతమైన ప్లాట్ డివైజ్ ఈ 'డ్రీమ్ సీక్వెన్స్'.

ఒక జంట మధ్య సుదీర్ఘకాలంగా విడిపోవడం అనే కథ నడుస్తున్నప్పుడు, ప్రేక్షకులు వారి కలయిక కోసం తీవ్రంగా ఎదురుచూస్తుంటారు. వీకెండ్ కు ముందు ఇలా ఒక ఆర్టిఫిషియల్ హ్యాపీ ఎండింగ్ లేదా డ్రామాను క్లైమాక్స్‌గా చూపించడం వల్ల సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఇది TRP చార్ట్‌లలో నెంబర్ 1 స్పాట్ సాధించడానికి సహాయపడుతుంది.

ధీరజ్ - ప్రేమ ఎప్పుడు ఒకటవుతారు?

ప్రస్తుతం నడుస్తున్న ట్రాక్ ప్రకారం.. భద్రావతి వేస్తున్న ఎత్తుగడలు పూర్తిగా బయటపడే వరకు, లేదా ధీరజ్ స్వయంగా రియలైజ్ అయి నిజ జీవితంలో ప్రేమ ఇంటి ముందు నిలబడే వరకు వీరిద్దరి కలయిక సాధ్యమయ్యేలా లేదు. రాబోయే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్లలో భద్రావతి నిజస్వరూపాన్ని బయటపెట్టేలా కథ మలుపు తిరిగే ఛాన్స్ ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More