Illu Illalu Pillalu August 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు..గుడికి ప్రేమ- భద్రావతితో బల్లక్కాయ్ మరో ప్లాన్- పాపం ధీరజ్

Illu Illalu Pillalu August 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 10 ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది. ప్రేమను రెచ్చగొట్టి మరీ గుడికి వచ్చేలా చేస్తాడు విశ్వ. తన బండారం బయటపడుతుందని బల్లక్కాయ్ టెన్షన్ పడుతుంది. భద్రావతితో కలిసి మరో ప్లాన్ వేస్తుంది. భర్త పేరు చెప్పకుండా ప్రేమ షాకిస్తుంది.

Published on: Aug 10, 2026, 07:50:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu August 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ప్రేమను గుడికి రప్పించడానికి విశ్వ డ్రామా స్టార్ట్ చేస్తాడు. ధీరజ్ నన్ను నానా మాటలు అన్నాడని విశ్వ చెప్తాడు. మీ చెల్లెలు కచ్చితంగా గుడికి రాదని ఎగతాళి చేశాడు. గుడిలో మీ ఆయన్ని చూడగానే ప్రేమను ఆపుకోలేక ధీరజ్ అని వెళ్లి హగ్ చేసుకుంటావంటానని ప్రేమను విశ్వ రెచ్చగొడతాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

విశ్వ ప్లాన్ సక్సెస్

ప్రేమ అని ధీరజ్ అనగానే ఐస్ క్రీమ్ లా నీ మనసు కరిగిపోతుందంటా అని విశ్వ తన ప్లాన్ ప్రకారం మాటలు చెప్తాడు. విశ్వ మాటలతో ప్రేమ రెచ్చిపోతుంది. నేను కూడా గుడికి వస్తున్నా అన్నయ్య అని ప్రేమ రెడీ అవుతుంది. ధీరజ్ ఎక్స్ ట్రాలు చేస్తున్నాడు. అవన్నీ పగటి కలలు అని తెలిసొచ్చేలా చేస్తానని ప్రేమ అంటుంది. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు విశ్వ తెగ ఖుషీ అయిపోతాడు. ప్రేమను, ధీరజ్ ను కలిపేందుకు ఫస్ట్ స్టెప్ పడిందని అనుకుంటాడు.

రెచ్చగొట్టేలా సేనాపతి

రామరాజు, భద్రావతి కుటుంబాలు గుడి దగ్గర ఎదురుపడతాయి. ధీరజ్ ను చూసి ప్రేమ ముఖం తిప్పుకుంటుంది. విశ్వ ఏమో అమూల్య ముందు బిల్డప్ కొడతాడు. శ్రీవల్లి ఏమో ప్రేమకు ఎక్కడ నిజం తెలిసిపోతుందేమోనని తెగ టెన్షన్ పడుతుంది. గుడికి దేవుడి కోసం వచ్చారా? లేకపోతే దొంగ పెళ్లిళ్లు చేద్దామని వచ్చారా? అని సేనాపతి రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. తన కొడుకులను రామరాజు ఆపుతాడు.

ధీరజ్ చేతుల్లో ప్రేమ

విశ్వ కావాలనే ప్రేమ కాలుకు తన కాలు అడ్డం పెడతాడు. దీంతో ప్రేమ వెళ్లి ధీరజ్ చేతుల్లో పడుతుంది. ఆ సీన్ అదిరిపోతుంది. ప్రేమ అదేంటే, అలా పడిపోయావని భద్రావతి అడుగుతుంది. మొగుడికి దూరంగా ఉండలేకపోతుందేమో. చూసేసరికి ప్రేమతో పడిపోయిందని నర్మద అంటుంది. నేనే చేశానని విశ్వ అనేసరికి అమూల్య స్మైల్ ఇస్తుంది.

వల్లి టెన్షన్

గుడిలో భద్రావతిని శ్రీవల్లి పక్కకు తీసుకెళ్తుంది. కొంపలు కూలిపోయేలా ఉన్నాయి. ఏదో ఒక మాయ చేసి ధీరజ్, ప్రేమను ఒకటి చేసేందుకు వీళ్లు గుడికి వచ్చారు. మా అత్తయ్య అమాయకురాలు కాదు. ధీరజ్, ప్రేమను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు. ప్రేమ వాళ్ల మాటలు నమ్మిందంటే, ఎప్పటికీ మిమ్మల్ని నమ్మదు. మీ ఇంటికి రాదని భద్రావతిని బల్లక్కాయ్ రెచ్చగొడుతుంది.

ఇప్పుడు సహనంగా ఉండాలి. వాళ్ల ప్లాన్ అమలు కాకుండా చేయాలి. ప్రేమ మనసు మార్చడానికి ప్రయత్నిస్తారు. ప్రేమను ఒంటరిగా కలిసి, మాట్లాడాలని చూస్తారు. మనం ప్రేమను, వాళ్లను కలవనివ్వకుండా చేస్తే చాలు. అప్పుడు వాళ్ల ప్లాన్ ఫెయిల్ అవుతుందని బల్లక్కాయ్ చెప్పడంతో భద్రావతి సరేనంటుంది.

ప్రేమ దగ్గరకు నర్మద

అందరూ దేవుడికి మొక్కుకుంటారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక ప్రేమతో మాట్లాడటం ఎలా అని నర్మద, వేదవతి అవకాశం కోసం చూస్తారు. భద్రావతి, సేనాపతి పక్కకు వెళ్లడంతో ప్రేమతో మాట్లాడమని నర్మదకు వేదవతి చెప్తుంది. ప్రేమ పక్కకు నర్మద వెళ్లగానే.. భద్రావతి వచ్చి విడగొడుతుంది. దేవుడు అటు వైపు కనిపించడం లేదు, అందుకే ఇటు వైపు వచ్చానని నర్మద అంటుంది.

భర్త పేరు చెప్పిన ధీరజ్

నువ్వు అటు వైపు కదా మరి ఇటు వైపు ఎందుకు వచ్చావని భద్రావతి అడుగుతుంది. దేవుడిని ఏమైనా ఇంటి నుంచి తెచ్చారా? అని నర్మద కౌంటర్ వేస్తుంది. అక్క ఇక్కడే ఉండని అని అత్తకు ప్రేమ చెప్తుంది. పూజారి వచ్చి భర్త పేరు చెప్పమంటే ప్రేమ ఆలోచిస్తుంది. నా ఒక్క దాని పేరు మీదే అర్చన చేయించండని అంటుంది.

అర్చన కోసం భర్త పేరు చెప్పకపోవడం అశుభం అని పూజారి చెప్పినా ప్రేమ వినదు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More