Illu Illalu Pillalu August 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ప్రేమ తన భార్య కాదా? ధీరజ్ రచ్చ- నర్మద ఆపరేషన్ డీపీ షురూ!
Illu Illalu Pillalu August 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 5 ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. ధీరజ్, ప్రేమను కలిపేందుకు మనం కలిసిపోదామని చెప్పిన విశ్వను అమూల్య నమ్మదు. ధీరజ్ ఫుల్ గా తాగి నానారచ్చ చేస్తాడు. మరోవైపు నర్మద ఏమో ఆపరేషన్ డీపీ స్టార్ట్ చేస్తుంది. పూర్తి ఎపిసోడ్ చూసేయండి.
Illu Illalu Pillalu August 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో ప్రేమ, ధీరజ్ ను తిరిగి కలిపేందుకు సాయం చేయమని విశ్వ అడిగితే అమూల్య ఒప్పుకోదు. ఇక ఫుల్ గా తాగిన ధీరజ్ నానా హంగామా చేస్తాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

అమూల్య ఫైర్
ప్రేమ, ధీరజ్ గురించి మాట్లాడాలని అమూల్యకు విశ్వ చెప్తాడు. ధీరజ్ అంటే మా చెల్లెలికి ఎంత ప్రేమ ఉందో, తను దూరం అయినందుకు ఎంత నరకం అనుభవిస్తుందో నేను కళ్లారా చూస్తున్నా. మీ అన్నయ్య కూడా అంతే బాధపడుతుంటాడు. మనమిద్దరం కలిసి, వాళ్లను కలుపుదామని విశ్వ చెప్తాడు. ఏంట్రా, మళ్లీ కొత్త నాటకం మొదలుపెట్టావా? నన్ను నమ్మించి మోసం చేయాలనుకుంటున్నావా? అని అమూల్య ఫైర్ అవుతుంది.
మారానని చెప్పిన విశ్వ
మా చెల్లెలి బాధ గురించి ఆలోచిస్తున్నా కాబట్టే అడుగుతున్నానని విశ్వ అంటాడు. ఒకప్పుడు మన ఫ్యామిలీలు కలవాలంటే మన పెళ్లితోనే సాధ్యం అవుతుందని అన్నావ్. ఆ మాట నిజమని నమ్మినందుకు నా భవిష్యత్ ను సగం కోల్పోయా. రెండో సారి నమ్మితే పిచ్చిదాన్ని అంటారని అమూల్య ఫీల్ అవుతుంది. కోర్టులో నువ్వు పెట్టిన క్షమాభిక్షతో నేను మారానని విశ్వ అంటాడు.
వార్నింగ్ ఇచ్చిన అమూల్య
మీరు మారారని నమ్మితే అంతకంటే బుద్ధి తక్కువ ఏం ఉండదని అమూల్య అంటుంది. నేను నిజంగానే మారానని విశ్వ చెప్తూనే ఉంటాడు. కానీ అమూల్య నమ్మదు. మరోసారి తనతో మాట్లాడితే ఇంట్లో వాళ్లందరూ కొడతారని అమూల్య వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
కిక్కులో ధీరజ్
ఇక నైట్ మామ తిరుపతితో కలిసి ధీరజ్ ఫుల్ గా మందు తాగుతాడు. మందు ఎక్కువైన తర్వాత ప్రేమ చేసిన దాన్ని గుర్తు తెచ్చుకుని తిరుపతిపై కోప్పడతాడు ధీరజ్. నేను ఎవరూ అని అడిగినప్పుడు సెక్యూరిటికీ ఎందుకు చెప్పలేదని తిరుపతిని కొట్టేందుకు ధీరజ్ వెళ్తాడు. ఇదంతా భద్రావతి ఇంటి బాల్కనీ నుంచి ప్రేమ చూస్తుంటుంది.
ప్రేమలా తిరుపతి
సెక్యూరిటీ అడిగితే పెద్ద కళ్లు వేసుకుని చూశావే తప్పా, ఇతను నా ప్రాణనాథుడు అని చెప్పావా? చెప్పు అని ధీరజ్ అడుగుతాడు. వెంటనే తిరుపతి ఏమో చీరను చుట్టుకుని ప్రేమ క్యారెక్టర్లోకి వెళ్లిపోతాడు. నన్ను ప్రేమ అనుకొని నీ ఫ్రస్టేషన్ మొత్తం తీర్చుకో అని తిరుపతి చెప్తాడు. ఒసేయ్ రాక్షసి నేను నీ మొగుణ్ని అని చెప్పకుండా సెక్యూరిటీతో గెంటేయిస్తావా? అని తిరుపతిని కొరికేస్తాడు ధీరజ్.
ఎందుకే అంత ఇగో
తిరుపతి వెనుకాల పడుతూ ధీరజ్ బయటకు వస్తాడు. ప్రేమ కూడా బయటకు వస్తుంది. ప్రేమను చూసి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు ధీరజ్. ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావ్? ఓ దెయ్యాలు రాత్రే కదా తిరిగేది. మొగుడిని అలా కోపంగా చూస్తావా? నన్ను మొగుడు అని సెక్యూరిటీతో చెప్పడానికి నీకెందుకే అంత ఇగో. నా అందంతో పోలిస్తే నీది అందమే కాదు. నీకు ఎందుకు అంత టెక్కు అని ధీరజ్ తులుతూ మాట్లాడతాడు.
నా పెళ్లానివి కాదు
అందగత్తెవే అని ప్రేమ బుగ్గలు గిల్లేస్తాడు ధీరజ్. నన్ను మొగుడు అని చెప్పడానికి నీ ప్రాబ్లెం ఏంటీ అని ప్రేమ పైకి వెళ్తాడు ధీరజ్. వెంటనే ధీరజ్ ను తోసేస్తుంది ప్రేమ. నన్ను తోసేస్తావా? నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలియదా? నువ్వు అలిగి వెళ్లిపోతావా? అని ధీరజ్ ఫీల్ అవుతాడు.
సెక్యూరిటీ అడిగితే మాత్రం నా పెళ్లాం అని నువ్వు చెప్పావా? అని ప్రేమ అడుగుతుంది. ఇప్పుడు చెప్తా. నువ్వు నా పెళ్లానివే. మరి నేను నీ మొగుడిని అని చెప్పు అని ధీరజ్ అడుగుతాడు. కానీ ప్రేమ చెప్పదు. దీంతో ధీరజ్ కు చిర్రెత్తుకొస్తుంది. నువ్వు నా పెళ్లానివి కాదని ధీరజ్ అంటాడు. చెప్పేది పూర్తిగా వినకపోవడం వల్లే పరిస్థితులు ఇక్కడికి వచ్చాయని ప్రేమ అంటుంది. ధీరజ్ ను తోసేసి లోపలికి వెళ్లిపోతుంది.
ఆపరేషన్ డీపీ
మరోవైపు ధీరజ్, ప్రేమ విడిపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని నర్మద ఆలోచిస్తుంది. ‘ఆపరేషన్ డీపీ’ అని బోర్డు మీద రాసుకొని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ ఇంటికి ఉన్న శత్రవులు భద్రావతి, వల్లి అక్కా. ప్రేమ, ధీరజ్ ల పెళ్లి విషయం భద్రావతికి తెలియాలంటే ఒక్క వల్లి అక్క తప్పా ఎవరూ చెప్పరు. కచ్చితంగా వల్లినే ఇదంతా చేసిందని నర్మద అనుకుంటుంది.
మీరే కారణమన్న సాగర్
అప్పుడే నిద్రలో నుంచి లేచిన సాగర్ ఈ గోల ఏంటీ? అని నర్మదను అడుగుతుంది. ఆపరేషన్ డీపీ అంటే ధీరజ్, ప్రేమ. వాళ్లు విడిపోవడానికి కారణం కనిపెట్టా. శారదాంబ బర్త్ డే వచ్చిన భద్రావతి, సేనాపతి నవ్వుతూ నటించారు. దీని వెనుక వ.. అని నర్మద చెప్పబోతుంటే సాగర్ అడ్డుకుంటాడు.
ధీరజ్, ప్రేమ విడిపోవడానికి నువ్వు, మా అమ్మ, ధీరజ్ కారణం. మీకు మీరే వాతలు పెట్టుకుని వాళ్లను కలపండి. ధీరజ్, ప్రేమకు బలవంతంగా పెళ్లి చేసింది ఎవరు? దాన్ని దాచిపెట్టింది ఎవరు? తప్పులన్నీ మీరే చేసి ఇప్పుడు వాళ్లను విడగొట్టింది మీరే. ప్రేమకు సారీ చెప్పి తీసుకురమ్మని మీ మరదికి చెప్పు అని నర్మదకు చెప్తాడు సాగర్.
ఇక పొద్దున బయటకు వచ్చిన విశ్వ.. గేటు దగ్గరే పడుకుని ఉన్న ధీరజ్, తిరుపతిని చూసి ఫీల్ అవుతాడు. వాళ్లపై ప్రేమ నీళ్లు చల్లుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


