Illu Illalu Pillalu July 20 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. భద్రావతి డ్రామా షురూ- వల్లి సైకో ఆనందం- రామరాజుకు అనుమానం
Illu Illalu Pillalu July 20 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 20 ఎపిసోడ్ లో భద్రావతి ట్విస్ట్ ఇస్తుంది. ప్లాన్ ప్రకారమే తల్లి పుట్టిన రోజు వేడుకలను రామరాజు ఇంట్లో చేసేందుకు ఒప్పుకొంటుంది. కానీ రామరాజు, ధీరజ్, చందుకు అనుమానం వస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ వివరాలు మీకోసం.
Illu Illalu Pillalu July 20 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 20 ఎపిసోడ్ లో శ్రీవల్లి ప్లాన్ ను భద్రావతి అమలు చేస్తుంది. తల్లి పుట్టిన రోజు వేడుకలను రామరాజు ఇంట్లో చేస్తానంటుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

శారదాంబ అలక
అన్నం తిననని శారదాంబ భీష్మించుకుని కూర్చుంటుంది. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అమ్మా? ఆ కూలోడితో వెళ్లిపోయిన చిన్న కూతురిని పిలవాలని అడిగావు. కానీ అది జరగదని సేనాపతి కోప్పడతాడు. అప్పుడే భద్రావతి డ్రామా స్టార్ట్ చేస్తుంది. మాకున్న పెద్ద దిక్కువు నువ్వే. కానీ నువ్వేమో ఆ కుటుంబం కోసం తినకుండా ఉంటున్నావని భద్రావతి అంటుంది.
భద్రావతి ఓకే
నా బాధను మీరు అర్థం చేసుకోవడం లేదు. నా చివరి రోజుల్లోనైనా రెండు కుటుంబాలు కలిస్తే చూడాలన్న బాధ. నేను ఎలా పోతే మీకు ఎందుకు? నేను ఉంటే ఉంటాను, పోతో పోతాను అని శారదాంబ ఫీల్ అవుతుంది. నీ పుట్టిన రోజు వేడుకల్లో ఆ కుటుంబం ఉండాలి అంతే కదా. నాకు ఇష్టం లేదు. కానీ నీ బాధ చూడలేక ఒప్పుకొంటున్నానని భద్రావతి తన ప్లాన్ ప్రకారమే అంటుంది.
వాళ్ల ఇంట్లోనే
సేనాపతి మాత్రం ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటాడు. తమ్ముడు సేనాపతిపై భద్రావతి కోప్పడుతుంది. వాళ్లు మన ఇంటికి రాకుండా, మనమే వాళ్లింటికి వెళ్దాం. నీ చిన్న కూతురు ఇంట్లో నీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేద్దామని అమ్మతో చెప్తుంది భద్రావతి. ఇంతకన్నా సంతోషం ఇంకోటి లేదని శారదాంబ సంతోషపడుతుంది. అప్పుడే శ్రీవల్లి చెప్పిన మాటలను భద్రావతి గుర్తు చేసుకుంటుంది.
శారదాంబ సంతోషం
వెంటనే చిన్న కూతురు వేదవతి ఇంటికి శారదాంబ వెళ్తుంది. అది చూసి.. భద్రావతి మనం చెప్పిన ప్లాన్ ఆచరణలో పెట్టింది. మనం అంటించిన అగ్గిపుల్ల మంటగా మారబోతుందని శ్రీవల్లి అనుకుంటుంది. మీ ఒక్కరినే పంపించారా? అని వల్లి నోరు జారుతుంది. నన్ను పంపించిన విషయం నీకెలా తెలుసు? అని శారదాంబ అడుగుతుంది. వల్లి ఏదో కవర్ చేస్తుంది.
పుట్టిన రోజు వేడుకలు
వేదవతి ఇది కలో నిజమో తెలియడం లేదు. రేపు నా 70వ పుట్టిన రోజు. రెండు కుటుంబాలతో కలిసి ఈ పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలని మీ అక్కను అడిగా. రెండు కుటుంబాలతో కలిసి ఓ గ్రూప్ ఫొటో దిగి ప్రాణం ఉన్నంతవరకూ దాన్ని చూసుకోవాలని అనుకున్నా. అందుకు మీ అక్క ఒప్పుకుందని శారదాంబ హ్యాపీగా చెప్తుంది.
ధీరజ్ కు అనుమానం
అక్క నిజంగానే ఒప్పుకొందా? అని వేదవతి అడుగుతుంది. అమ్మమ్మ ఇది కలో నిజమో కాదో, ఇదో కుట్ర. మొన్న కోర్టులో కూడా బుసలు కొట్టిన మీ అత్త ఇప్పుడు సాధు జీవిలా మారిపోయిందంటే ఏదో కుట్ర ఉన్నట్లే అని ధీరజ్ అంటాడు. ప్రతి విషయంలో అనుమానపడతావేంటీ? మా నానమ్మ అంటే ప్రేమ. అందుకే మా అత్త ఒక మెట్టు దిగిందని ప్రేమ చెప్తుంది. మీ భద్రావతి అత్తను నమ్మలేమని ధీరజ్ అంటాడు.
నమ్మకం లేదన్న రామరాజు
ఫస్ట్ నేను అడిగితే నా కూతురు ఒప్పుకోలేదు. కానీ నేను తినడం మానేయడంతో ఒప్పుకొంది. అంతే కాకుండా ఈ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు చేద్దామని చెప్పిందని శారదాంబ చెప్తుంది. దీంతో నర్మద, రామరాజు సహా అందరూ అనుమానపడతారు. పాతికేళ్లుగా నా మీద పగతో రగిలిపోతున్నారు. నా నాశనాన్ని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్లు నా ఇంటికి వస్తానని అనడం, మీ పుట్టిన రోజు నా ఇంట్లో చేస్తానని చెప్పడం నాకైతే నమ్మకం కలగడం లేదని రామరాజు అంటాడు.
వెంటనే వల్లి రంగంలోకి దిగుతుంది. వాళ్లలో మార్పు రావడానికి కారణం అమూల్యనే. ఆయ్, విశ్వక్ పై పెట్టిన కేసును అమూల్య వెనక్కి తీసుకుంది కదా. మేనల్లుడి జీవితం జైలు పాలవకుండా కాపాడిందని భద్రావతిలో మార్పు వచ్చిందని వల్లి చెప్తుంది. నిన్నెవరు అడిగారని పెద్ద కోడలిపై వేదవతి ఫైర్ అవుతుంది.
రామరాజు చేతులు పట్టుకొని
మీ పుట్టిన రోజును మీ ఇంట్లో జరిపించండని శారదాంబతో ధీరజ్ అంటాడు. మా ఇంట్లో మీ పుట్టిన రోజును చేద్దామని చెప్పడం వెనుక ఏదో ఉంది. అందుకే మీ ఇంట్లోనే జరిపించండని చందు కూడా అంటాడు. దీంతో రామరాజు దగ్గరకు వెళ్లి శారదాంబ ఎమోషనల్ అవుతుంది.
పెద్ద కూతురు పెళ్లి చేసుకోలేదన్న బాధతో మీ మామయ్య కన్నుమూశారు. ఈ రెండు కుటుంబాలు కలవాలని ఆయన చివరి కోరిక. పాతికేళ్లుగా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా. దయచేసి మన రెండు కుటుంబాలు కలిసి నా పుట్టిన రోజు చేయండని రామరాజు చేతులు పట్టుకుని శారదాంబ వేడుకుంటుంది.
ఒప్పుకొన్న రామరాజు
మా అక్క తగ్గింది కదా. రెండు కుటుంబాలు కలిసి ఉండటానికి దేవుడు ఇచ్చిన అవకాశంలా కనిపిస్తోంది. ప్లీజ్ ఒప్పుకోండి అని వేదవతి అడుగుతుంది. ప్రేమ కూడా రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో రామరాజు ఒప్పుకొంటాడు. శారదాంబ సంతోషంతో వెళ్లిపోతుంది. పాతికేళ్ల తర్వాత మా అక్క, అన్నయ్య మన ఇంటికి రాబోతున్నాడని వేదవతి సంబరపడుతుంది.
రేపు సాయంత్రానికి ఈ సంతోషం మొత్తం కన్నీళ్లుగా మారుతుంది. జరిగేది పుట్టిన రోజు వేడుక కాదు, మీ చిన్న కొడుకు, కోడలు విడిపోయే బీభత్సం అని వల్లి అనుకుంటుంది.
పగతో వల్లి
ఇటు వల్లిపై భాగ్యం విరుచుకుపడుతుంది. నీ చేతిలో బ్రహ్మాస్త్రం పెడితే నువ్వేమో తీసుకెళ్లి భద్రావతి చేతిలో పెడతావా అని కూతురిని తిడుతుంది. నా అత్త నన్ను కొట్టిన చెంప దెబ్బలు. నువ్వు నా పెళ్లానివి కాదని మా ఆయన అన్న మాటలు నన్ను పొడుస్తూనే ఉన్నాయి. ఇందుకు కారణమైన వాళ్ల మీద పగ తీర్చుకోకుండా వదులుతానా? భద్రావతికి మందుపాతర లాంటి ప్లాన్ చెప్పానని వల్లి అంటుంది.
శారదాంబ పుట్టిన రోజు వేడుకల్లో ఆ మందు పాతర పేలుతుంది. దీంతో ధీరజ్, ప్రేమ విడిపోతారు. ప్రేమ శాశ్వతంగా పుట్టింటికి వెళ్లిపోతుంది. అప్పటివరకూ మీరు ఆ చుట్టుపక్కలకు రాకండని భాగ్యంతో వల్లి చెెప్తుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


