ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 19 ఎపిసోడ్: బ‌ల్ల‌క్కాయ్‌తో ట్యాబ్లెట్లు మింగించిన న‌ర్మ‌ద‌, ప్రేమ‌-నోటీసుతో భద్రావతి టెన్షన్

Illu Illalu Pillalu June 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 19 ఎపిసోడ్ లో ప్రేమ ఫీల్ అవుతూ ఉంటుంది. ధీరజ్ ధైర్యం చెప్తాడు. కారు కొనేందుకు ప్రేమకు బంపరాఫర్ వస్తుంది. విశ్వకు కోర్టు నోటీసులు రావడంతో భద్రావతి ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు. ఇలా టుడే ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

Published on: Jun 19, 2026, 07:45:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu June 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 19 ఎపిసోడ్ లో ధీరజ్ కు కారు కొనివ్వడం కోసం ప్రేమకు ఓ బంపరాఫర్ వస్తుంది. డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది. మరి పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

ప్రేమ బాధ

కారు తీసుకోవడానికి రూ.10 లక్షలు కావాలి. నెలకు రూ.50 వేల జీతం వస్తే కారు కొనేందుకు రెండేళ్లు పడుతుందని ప్రేమ అనుకుంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. కారు పోయినందుకు బాధ లేదా? అని ప్రేమ అడుగుతుంది. మొన్నటివరకూ డెలివరీ బాయ్ గా పని చేశావ్. కారు కొనుక్కొని ట్రావెల్స్ స్టార్ట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ ఇప్పుడు మళ్లీ మొదటికే వచ్చావని ప్రేమ ఫీల్ అవుతుంది.

ధీరజ్ ధైర్యం

కొన్ని రోజులు పోతే మళ్లీ కారు తీసుకుంటాం. ఆ హ్యాపీనెస్ కోసం ఎదురు చూడాలని ధీరజ్ అంటాడు. నగలు తాకట్టు పెడతానంటే వద్దంటావ్, మీ నాన్న డబ్బులు తీసుకోవు. మరి ఎలా కారు తీసుకుంటావని ప్రేమ అడుగుతుంది. అడుగుపడటం లేట్ అవొచ్చు కానీ ముందుకు సాగుతా. నువ్వు నాకు ధైర్యంగా ఉంటే, ఎన్నిసార్లు పడ్డా లేస్తూనే ఉంటానని ధీరజ్ ప్రేమను దగ్గరకు తీసుకుంటాడు.

శ్రీవల్లి ఏడుపు

మరోవైపు శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. అంతా అయిపోయింది. సాగర్ మరిది వేరు కాపురం పెట్టాడు కాబట్టి మామయ్యకు నర్మద మీద కోపం ఉందని అనుకున్నా. కానీ నర్మద బండి మీద మామయ్య వచ్చారు. అంటే నర్మద మీద ప్రేమ ఉన్నట్లే కదా అని సుక్కుతో వల్లి అంటుంది.

ఇరుక్కున్న బల్లక్కాయ్

అప్పుడే బల్లక్కాయ్ అని నర్మద, ప్రేమ వస్తారు. నా మంచితనాన్ని అర్థం చేసుకోరని వల్లి మాట మారుస్తుంది. డిన్నర్ కు ఏం చేయమంటావో చెప్పమని వల్లిని నర్మద, ప్రేమ అడుగుతారు. ఆల్రెడీ డిన్నర్ చేశానంటుంది వల్లి. మరి ట్యాబ్లెట్స్ అని అడిగితే వేసుకున్నానని వల్లి, వేసుకోలేదని సుక్కు చెప్పి ఇరుక్కుంటారు. వేసుకోవాలని చెప్పానని వల్లి కవర్ చేస్తుంది.

వల్లి పరుగులు

ట్యాబ్లెట్స్ మింగుతానని వల్లి అంటుంది. మా ముందే వేసుకోవచ్చని నర్మద అంటుంది. మీరు చూపించినవన్ని దొంగ ట్యాబెట్లా? అని ప్రేమ డౌట్ పడుతుంది. ప్రగ్నెన్సీ నిజమే కదా, లేకపోతే తెల్లవార్లు మోషన్లు అవుతాయని నర్మద అంటుంది. నా కడుపు నిజమేనని వల్లి మళ్లీ అంటుంది. నర్మద, ప్రేమ కలిసి ట్యాబ్లెట్స్ వేసి వెళ్తారు. వెంటనే వల్లికి మోషన్లు స్టార్ట్ అవుతాయి. వల్లి బాత్రూమ్ కు, బయటకు పరుగులు తీస్తూనే ఉంటుంది.

ఇడ్లీ ఆనందం

మరోవైపు రైస్ మిల్ లో రూ.20 వేలు కొట్టేసిన ఇడ్లీ బాబాయ్ వెండి పట్టీలతో భార్య భాగ్యం దగ్గరకు వెళ్తాడు. ప్రియతమా తెలుసునా అని పాట పాడుతూ పట్టీలు చూపిస్తాడు. పట్టీల సౌండ్ విని దెయ్యం అనుకుంటుంది భాగ్యం. నీ కోసం తీసుకొచ్చిన పట్టీలని ఇడ్లీ బాబాయ్ చూపిస్తాడు. ఎక్కడివి అని భాగ్యం అడుగుతుంది.

శాంతించిన భాగ్యం

భాగ్యం కాళ్లకు ఇడ్లీ బాబాయ్ పట్టీలు తొడుగుతూ మురిసిపోతాడు. చేతి వాటం చూపించి రైస్ మిల్ లో రూ.20 వేలు కొట్టేశానని ఇడ్లీ బాబాయ్ బిల్డప్ గా చెప్తాడు. రైస్ మిల్ మన గుప్పిట్లో పెట్టుకోవాలి కానీ చిల్లర దొంగతనాలు చేస్తావా? అని ఇడ్లీని భాగ్యం బాదేస్తుంది. అవకాశం వచ్చినప్పుడే డబ్బులు వెనకేసుకోవాలని ఇడ్లీ బాబాయ్ హితబోధ చేస్తాడు. దీంతో భాగ్యం శాంతిస్తుంది.

డ్యాన్స్ కాంపిటీషన్

ఉదయం తన ఫ్రెండ్ నిఖిత నుంచి ప్రేమకు కాల్ వస్తుంది. ప్రేమ నీకో గుడ్ న్యూస్. నువ్వు చిన్నప్పటి నుంచి ఇష్టంగా నేర్చుకున్న డ్యాన్స్ కు రూ.10 లక్షలు రాబోతున్నాయి. సిటీలో గ్రాండ్ గా డ్యాన్స్ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తున్నారు. అందులో నువ్వు పార్టిసిపేట్ చేస్తే, కచ్చితంగా గెలుస్తావ్. రూ.10 లక్షలు వస్తాయని ప్రేమకు ఫ్రెండ్ చెప్తుంది.

కారు కొనేందుకు ఇదే మంచి ఆప్షన్ అని ప్రేమ అనుకుంటుంది. ముందు అప్లికేషన్ పెడతానని ఫ్రెండ్ చెప్తుంది. దీంతో ధీరజ్ ను అడక్కుండానే ప్రేమ ఓకే చెప్పేస్తుంది.

కోర్టు నోటీస్

ఇటు భద్రావతి ఇంట్లో పరిస్థితి సీరియస్ గా ఉంటుంది. కోర్టు నోటీస్ వచ్చిందని భద్రావతి చెప్తుంది. వచ్చే సోమవారం నుంచి కేసు వాదనలు మొదలవుతున్నాయని భద్రావతి అంటుంది. అమూల్య సాక్ష్యం బలంగా ఉంది. కోర్టులో నా కొడుక్కి శిక్ష వేస్తారని రేవతి బాధ పడుతుంది. పోలీసులు తీసుకెళ్తే మీరు ఏం చేశారు? ఇప్పుడు ఎలా ఆపగలరు? ఏ విధంగా బయటకు తీసుకొస్తారు? అని రేవతి అడుగుతుంది.

బెయిల్ విషయంలోనే చాలా కష్టపడ్డాం. హై కోర్టు దాకా వెళ్లిపోదాం. బెయిల్ రావడమే కష్టమైనప్పుడు శిక్ష పడకుండా ఎలా కాపాడతాం అని సేనాపతి కూడా అడుగుతాడు. కళ్ల ముందే పరిష్కారం ఉందని, అదే రామరాజు అని శారదాంబ చెప్పడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More