Illu Illalu Pillalu August 3 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు..ధీరజ్ మామూలోడు కాదు-రెచ్చిపోయిన ప్రేమ-విశ్వను కొట్టిన సాగర్

Illu Illalu Pillalu August 3 Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 3 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. రామరాము ఏమో వేదవతితో మాట్లాడటం లేదు. అది చాలదన్నట్లు అగ్నికి ఆజ్యంలా తల్లిదే తప్పన్నట్లు సాగర్ మాట్లాడాడు. ప్రేమను ధీరజ్ రెచ్చగొట్టాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం. 

Published on: Aug 3, 2026, 07:54:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu August 3 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజుఎపిసోడ్ లో వేదవతితో రామరాజు మాట్లాడకుండానే ఉంటాడు. ఇక ప్రేమ ఎస్ఐ కోచింగ్ కు వెళ్లేలా ధీరజ్ రెచ్చగొడతాడు. కాలేజీలో అమూల్య కోసం వచ్చిన విష్వక్ కు సాగర్ కొడతాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

ప్రేమ రానందని

డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసి భర్త కోసం వేదవతి చూస్తుంది. కానీ రామరాజు ఏమో రాకుండా అటూ ఇటూ తిరుగుతుంటాడు. చిన్నోడా టిఫిన్ చేద్దాం రా అని ధీరజ్ ను చందు పిలుస్తాడు. అప్పుడే వచ్చిన నర్మదను ప్రేమ గురించి అడుగుతుంది వేదవతి. మాట్లాడితే రానని తెగేసి చెప్పిందని నర్మద చెప్తుంది.

బిల్డప్ ఎందుకు?

మాట్లాడితే ప్రేమకు నేను సొంత అక్కలాంటిదాన్ని. మా చెల్లెలికి నేను ఎంత చెప్తే అంతా అని తెగ బిల్డప్ ఇచ్చావ్ కదా. కానీ తీసుకు రావడం చేతకాదు. దీనికి గవర్నమెంట్ జాబ్ ఎందుకు? అని వేదవతి అంటుంది. అప్పుడే నర్మద చెల్లాయ్, అత్త టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందురు రండి అని శ్రీవల్లి కావాలనే పిలుస్తుంది. వేదవతికి వస్తున్న కోపాన్ని నర్మద కంట్రోల్ చేస్తుంది.

మంగతాయారు టిఫిన్

మామయ్యను కూడా టిఫిన్ చేయడానికి శ్రీవల్లి పిలుస్తుంది. నాకు టిఫిన్ వస్తుందని రామరాజు అంటాడు. మంగతాయారు నుంచి టిఫిన్ తెచ్చానని తిరుపతి వస్తాడు. ఎవర్రా మంగతాయారు? అని వేదవతి అడుగుతుంది. మంగతాయారు అంటే మా ఫ్రెండ్ వాళ్ల నానమ్మ, ఆవిడ పేరు మీద టిఫిన్ సెంటర్ పెట్టాడని తిరుపతి చెప్తాడు. మీ బావ అంటే నాకు చచ్చేంత ప్రేమ, అందుకే ఆడ మనిషి పేరు వినగానే తట్టుకోలేకపోయానని వేదవతి అంటుంది.

అమ్మ బాధ

ఆ టిఫిన్ అమూల్య తింటుంది. బాగుందని చెప్తుంది. అత్తయ్య చేసిన దానికంటే బాగుందా? అయితే నేను కూడా తింటానని నర్మద తింటుంది. అత్తయ్య మీరు చేసిన దానికంటే బాగుందని రెచ్చగొట్టేలా నర్మద మాట్లాడుతుంది. అమ్మ బాధను చూడలేక ధీరజ్ మళ్లీ నాన్నతో మాట్లాడతాడు. అమ్మ దగ్గర మాట తీసుకున్నా. అందుకే అమ్మ మీతో చెప్పలేదు. ఇంకా కోపంగా ఉంటే ఎలా? అని ధీరజ్ అంటాడు.

ప్రేమను తీసుకురావాలని

అప్పుడే వచ్చిన సాగర్ అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడతాడు. నమ్మిన భార్య మోసం చేస్తే వచ్చే కోపంలో తప్పేం లేదని సాగర్ అంటాడు. అమ్మ మోసంతో పాటు నీ కాపురం ఇలా అయిపోయిందనే దిగులు కూడా నాన్నకు ఉంది. ప్రేమను తీసుకొస్తే ఈ సమస్యలు తీరిపోతాయని చందు చెప్తాడు. వాడికి తెలియదా? చిన్నోడు ఏదో ఒకటి చేసుకుంటాడు కానీ టిఫిన్ తినండని రామరాజు సీరియస్ గా చెప్తాడు.

ప్రేమ కోపం

ధీరజ్ బయటకు వచ్చి భద్రావతి ఇంటి వైపు చూస్తాడు. ధీరజ్ కు ప్రేమ గిఫ్ట్ గా ఇచ్చిన షర్ట్ ఎగిరి వెళ్లి ప్రేమ కాళ్ల దగ్గర పడుతుంది. ఆ షర్ట్ ను పట్టుకుని ప్రేమ ఎమోషనల్ అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే ధీరజ్ కనిపిస్తాడు. కోపంతో ఆ షర్ట్ ను మడతపెట్టి ధీరజ్ పైకి విసిరేస్తుంది ప్రేమ. అప్పుడే కోచింగ్ సెంటర్ నుంచి ధీరజ్ కు కాల్ చేసి ప్రేమను పంపించమని చెప్తారు.

ప్రేమను రెచ్చగొట్టేలా

తిరుపతిని అడ్డం పెట్టుకొని ప్రేమకు అర్థమయ్యేలా చెప్తాడు ధీరజ్. నీ గోల్ గురించి ఆలోచన ఉందా? ఎస్ఐ కావడం లక్ష్యమని బిల్డప్ ఇచ్చావ్ కదా? మరి కోచింగ్ కు వెళ్లకుండా కోడిపిల్లలా వాకింగ్ చేస్తున్నావ్? ఈ రోజు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది. ఐపీఎస్ ఆఫీసర్ వస్తున్నాడు. మొగుడి మీద అలిగి వెళ్లిపోతే అయిపోతుందా? చిన్న గొడవ కాగానే వెళ్లి పుట్టింట్లో కూర్చున్నావ్ అని ప్రేమను రెచ్చగొట్టేలా ధీరజ్ మాట్లాడతాడు.

భద్రావతి నాటకం

అప్పుడే భద్రావతి, సేనాపతి బయటకు వస్తారు. టార్గెట్ గురించి సీరియస్ గా లేని మనుషులు అంటే నాకు అసహ్యం అని ధీరజ్ అంటాడు. అత్త నేను కోచింగ్ సెంటర్ కు వెళ్లాలి. వాడు లేకపోతే నేను చదవలేనని అనుకుంటున్నాడు. నేను ఎస్ఐ కాలేనని అనుకుంటున్నాడని భద్రావతిని ప్రేమ అడుగుతుంది. వాళ్లు మూర్ఖులు, పంపించరని ధీరజ్ అంటాడు. దీంతో నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటానని భద్రావతి చెప్తుంది.

ఎందుకు ఒప్పుకున్నావ్ అక్క అని భద్రావతిని సేనాపతి అడుగుతాడు. ప్రేమ మన గుప్పిట్లో ఉండాలంటే తన ఇష్టాలను ఒప్పుకొన్నట్లు నటించాలని భద్రావతి చెప్తుంది.

విష్వక్ ను కొట్టిన సాగర్

మరోవైపు విష్వక్ ఏమో అమూల్య కోసం విశ్వ కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తాడు. అమూల్య హెల్ప్ తీసుకుని ప్రేమ, ధీరజ్ ను కలపాలని అనుకుంటాడు. అమూల్య ఏమో విశ్వతో మాట్లాడేందుకు నో అంటుంది. అక్కడి నుంచి వెళ్లకపోతే కంప్లైంట్ ఇస్తానంటుంది.

ఇదంతా సాగర్ చూస్తాడు. కోపంగా వెళ్లి విశ్వను కొడతాడు సాగర్. మన ఇంట్లో ఉన్న గొడవలు చాలు, కొత్త గొడవలు వద్దు అన్నయ్య అని అమూల్య సాగర్ ను ఆపుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More