Illu Illalu Pillalu July 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు..ఏడిపించేసిన అత్తాకోడలు-వల్లితో తిరుపతి డీల్-మారిపోయిన సుక్కు

Illu Illalu Pillalu July 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 21 ఎపిసోడ్ లో ఆడియన్స్ ను అత్తాకోడలు కలిసి ఏడిపించేస్తారు. పుట్టింటి వాళ్ల రాక కోసం ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తారు. మరోవైపు ఏదో కుట్ర ఉందని ధీరజ్, నర్మద అనుమానపడతారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం.

Published on: Jul 21, 2026, 07:53:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu July 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 21 ఎపిసోడ్ లో సుక్కు మేకోవర్ పూర్తిగా ఛేంజ్ అవుతుంది. పుట్టింటి వాళ్ల కోసం త్వరగా తెల్లవారాలని వేదవతి, ప్రేమ ఎదురు చూస్తుంటారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

మారిపోయిన సుక్కు

శారదాంబ పుట్టిన రోజు వేడుకల్లో మందు పాతర లాంటి ఐడియా పేలబోతుంది. ప్రేమ శాశ్వతంగా పుట్టింటికి వెళ్లబోతుందని తల్లితో శ్రీవల్లి చెప్తుంది. అప్పుడే అక్కడికి తిరుపతి వస్తాడు. వల్లి ఎందుకు ఇక్కడ ఉందని అడుగుతాడు. మీ మమ్మీ బర్త్ డే కు మమ్మల్ని రమ్మంటుందని భాగ్యం కవర్ చేస్తుంది. సుకన్యను గుర్తు పట్టలేనంతగా తిరుపతి మార్చేస్తాడు.

వల్లిని రిక్వెస్ట్

ముఖానికి మేకప్, కళ్లకు అద్దాలతో సుక్కు ఎంట్రీ ఇస్తుంది. అందమైన సుక్కును ఇన్నాళ్లు పాతబడ్డ చెక్కలా చేశారు. ఇప్పుడే కాస్త మోడ్రన్ గా తయారైంది. సుక్కు మా అమ్మ పుట్టిన రోజుకు వచ్చేసేయ్ అని తిరుపతి చెప్తాడు. మా ఇద్దరినీ నువ్వే కలపాలని వల్లిని రిక్వెస్ట్ చేస్తాడు. నిన్ను చూశానని నేను, నన్ను చూశానని నువ్వు చెప్పొద్దని వల్లితో డీల్ సెట్ చేసుకొని వెళ్లిపోతాడు. రూ.25 వేలు లాగి బట్టలు తెచ్చానని సుక్కు చెప్పడంతో భాగ్యం షాక్ అవుతుంది.

ప్రేమ కన్ఫ్యూజన్

మరోవైపు ధీరజ్, నర్మద, సాగర్ తెగ ఆలోచిస్తుంటారు. భద్రావతి మన ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరపడంలో ఏదో ప్లాన్ ఉందని ధీరజ్ అంటాడు. అప్పుడే ఫుల్ కన్ఫ్యూజన్ అంటూ ప్రేమ వస్తుంది. రేపు మా వాళ్లు అందరూ వస్తున్నారు కదా. చుడీదార్ లో రెడీ అవ్వాలో, చీర కట్టుకోవాలో అర్థం కావడం లేదని ప్రేమ అడుగుతుంది. స్కూల్ యూనిఫామ్ వేసుకో అని ధీరజ్ సెటైర్ వేస్తాడు.

నర్మద అనుమానం

ఏదో ఒక కుట్రతో ఈ బర్త్ డే ప్లాన్ చేశారని ధీరజ్ మళ్లీ అంటాడు. భద్రావతికి సడెన్ గా మన ఫ్యామిలీపై ఇంత ప్రేమ పుట్టుకు రావడం, మన ఇంట్లో పుట్టిన రోజు చేయాలనుకోవడం వెనుక ఏదో ఉందని నర్మద కూడా అంటుంది. అంటే మా భద్రావతి అత్త రాక్షసిలా కనిపిస్తుందా అని ప్రేమ కోప్పడుతుంది. మీ భద్రావతి అత్త కొన్నేళ్లుగా నాన్నను అవమానిస్తూనే ఉన్నారని ధీరజ్ అంటాడు.

మా నానమ్మ ఆశ కోసం మా వాళ్లు పగలు, పంతాలు పక్కన పెడితే అది మీకు కుట్రలా కనిపిస్తుందా? మా వాళ్ల ప్రేమను మీరు అర్థం చేసుకోరని ఏడుస్తూ ప్రేమ లోపలికి వెళ్తుంది. పుట్టింటివాళ్లను ఎవరైనా ఏమైనా అంటే మొగుడైనా సరే ఊరుకోరని నర్మద చెప్తుంది. పుట్టింటి వాళ్లు వస్తున్నారని మీ అమ్మ ఇంక ఎంత హడావుడి చేస్తారోనని ధీరజ్ తో నర్మద అంటుంది.

వేదవతి ఎదురు చూపులు

ఈ చంద్రుడు కదలడం లేదు. గడియారం నత్తకంటే దారుణంగా నడుస్తోందని ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని వేదవతి ఎదురు చూస్తుంటుంది. నువ్వే గడియారంలో టైమ్ 6 గంటలు అయినట్లు పెట్టు అని రామరాజు సరదాగా చెప్తాడు. అప్పుడే ధీరజ్ నవ్వుతూ వస్తాడు. టైమ్ అయితే అదే తెల్లవారుతుంది కదా. దీనికి జాగారం చేయడం ఎందుకు అని ధీరజ్ అడుగుతాడు. మా అన్న, అక్కకు మీ మీద కంప్లయింట్ ఇస్తానని వేదవతి అంటుంది.

పాతికేళ్లుగా పాపం పిచ్చిదానిలా వెయిట్ చేస్తుంది. అక్క, అన్నయ్యతో మాట్లాడేందుకు ఎదురు చూస్తుందని ధీరజ్ తో రామరాజు చెప్తాడు. అమ్మను ఇంత హ్యాపీగా చూడటం ఇదే ఫస్ట్ టైమ్ అని ధీరజ్ అంటాడు. ఇన్నాళ్లకైనా మీ అమ్మ కల తీరుతుంది. వాళ్లకు అహం ఎక్కువ. చిన్న చిన్న మాటలంటే పట్టించుకోకు అని చిన్న కొడుక్కు చెప్తాడు రామరాజు.

ఏడిపించేసిన అత్తాకోడలు

మరోవైపు పుట్టింటిని చూస్తూ ప్రేమ ఫీల్ అవుతుంది. ప్రేమ దగ్గరకు వేదవతి వెళ్తుంది. అత్త రేపు అందరూ వస్తున్నారు. మన పుట్టింటి వాళ్లు వస్తున్నారని సంతోషంగా అత్తకు చెప్తుంది ప్రేమ. మనం మన వాళ్లతో తనివితీరా మాట్లాడుకోవచ్చు. ఇన్ని రోజులుగా కోల్పోయిన ప్రేమను పొందొచ్చు. మనం పడిన బాధను మర్చిపోవచ్చు అత్త. నాకు చాలా హ్యాపీగా ఉంది అత్త అని ప్రేమ సంబరపడుతుంది.

8 నెలల ఎదురు చూపులకే నీకు అలా ఉంటే, పాతికేళ్ల ఎదురు చూపులకు నాకు ఎలా ఉండాలి? కనిపించే దూరంలో అందరూ ఉన్నా, నా బాధను వినిపించుకోలేనంత దూరమైపోయారు. నాలాంటి పరిస్థితే నీకూ వచ్చిందని వేదవతి ఏడ్చేస్తుంది. ఇక నుంచి ప్రేమగా పలకరింపులు ఉంటాయని ప్రేమ చెప్తుంది.

వంటింట్లో సందడి

తెల్లవారగానే అందరూ వంటింట్లో సందడి చేస్తుంటారు. ఇక వేదవతి హడావుడి వేరే లెవల్ లో ఉంటుంది. వంటల గురించి సాగర్, నర్మద కౌంటర్లు వేసుకుంటారు. ధీరజ్ లడ్డూలు చూడతాడు. ఎంచక్కా క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తే సరిపోయేది కదా అని చందు అడుగుతాడు. నా చేత్తో వండి పెట్టాననే ఆనందం ఎలా ఉంటుంది చెప్పు? పాతికేళ్ల తర్వాత వాళ్లు గుమ్మం తొక్కుతున్నారు. అందుకే నా చేతులతో స్వయంగా వండిపెట్టాలని పుట్టింటి ముచ్చట్లు చెప్తుంది వేదవతి.

ఇష్టమైన వంటకాలు

అక్క ఇక్కడికి వచ్చిన తర్వాత కచ్చితంగా మొదటి ముద్ద నాకే పెడుతుంది. పాతికేళ్ల తర్వాత మా అక్క తినిపించబోతుంది. మా వాళ్లకు ఇష్టమైన వంటలన్నీ చేస్తున్నా. వాళ్లు కడుపు నిండా తినాలి. ఆ ఆనందాన్ని నేను మనసు నిండా దాచుకోవాలని వేదవతి మళ్లీ ఏడ్చేస్తుంది. ఎమోషనల్ అవుతున్న ప్రేమను ధీరజ్ ఏడిపిస్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More