Illu Illalu Pillalu August 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. బల్లక్కాయ్‌పై నర్మదకు డౌట్- వీడియోతో షాక్- ప్రేమ ఇగో
Illu Illalu Pillalu August 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 4 ఎపిసోడ్ లో నర్మదకు వచ్చిన డౌట్ తో ట్విస్ట్ నెలకొంది. ధీరజ్, ప్రేమ విడిపోవడానికి వెనుక కుట్ర ఉందని నర్మద అనడంతో వల్లి ఫ్యూజుల్ ఔట్ అవుతాయి. మరోవైపు ధీరజ్ ఎవరో తెలియదని ప్రేమ అంటుంది. పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం.
Illu Illalu Pillalu August 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ధీరజ్, ప్రేమ విడిపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని నర్మదకు అనుమానం వస్తుంది. వల్లిని నర్మద టెస్ట్ చేస్తుంది. ఇంకా టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

శ్రీవల్లిని రమ్మన్న రామరాజు
నేను ఎదురు రాకుండా మీ మామయ్య బయటకు వెళ్లరు కదా అని నర్మదతో సంతోషంగా చెప్తుంది వేదవతి. అందుకే బయట నిలబడ్డానని అంటుంది. కానీ రామరాజు మాత్రం అమూల్యను పిలుస్తాడు. అమూల్య కాలేజీకి వెళ్లిందని శ్రీవల్లి వచ్చి చెప్తుంది. శ్రీవల్లిని ఎదురు రమ్మంటాడు రామరాజు.
రామరాజు సీరియస్
ఈ పాతికేళ్లలో నేనే కదా ఎదురు వచ్చేది, ఇప్పుడు తనను ఎందుకు రమ్మంటున్నారని వేదవతి అడుగుతుంది. నమ్మకం పోతే అలవాట్లు కూడా మారతాయని రామరాజు అంటాడు. వల్లి ఏమో అత్తయ్య కాకుండా నేను ఎదురొస్తే అత్తయ్య బాధపడుతుందని తెగ వల్లిస్తూ చెప్తుంది. అప్పుడు నేను కూడా బాధపడతానని వల్లి అంటుంది. సలహాలు ఆపి నేను చెప్పిన పని చేయమని రామరాజు అంటాడు.
చందు చెప్పడంతో
వల్లి ఎదురు వస్తుంటే చందు వచ్చి ఆపుతాడు. మీ మధ్య మాట పట్టింపు రావొచ్చు కానీ సెంటిమెంట్ మాత్రం మారకూడదని చందు చెప్తాడు. చందు చెప్పేసరికి తల్లి ఎదురొస్తుంది. అప్పుడే శారదాంబ వచ్చి పెద్ద మనసుతో వేదవతిని అర్థం చేసుకోమని అడుగుతుంది. నా కారణంగానే తన పుట్టిల్లు దూరమైందనే బాధతోనే కదా అవమానాలు ఎదురైనా ఎదురుగా ఉంటున్నాం. మరి మోసం చేస్తే ఎలా ఉంటుందని రామరాజు వెళ్లిపోతాడు.
నర్మదకు డౌట్
రెండు కుటుంబాలు కలుస్తాయనే ఆశతో పుట్టిన రోజు చేయమన్నా. కానీ నా కారణంగానే నా మనవడు, మనవరాలు విడిపోయారు. ముందేమో నా పుట్టిన రోజు చేయనని భద్రావతి చెప్పింది. కానీ ఓ మెట్టు దిగి వచ్చి పుట్టిన రోజు చేస్తానంది. భద్రావతి మొదటి మాటకే కట్టుబడి ఉన్నా ఈ గొడవలు జరిగేవి కావని శారదాంబ అంటుంది. ఈ మాటలతో నర్మదకు డౌట్ వస్తుంది. దీంతో పక్కనే ఉన్న వల్లి టెన్షన్ పడుతుంది.
వల్లి ఫ్యూజులు ఔట్
ఇవన్నీ చూస్తుంటే ముందే ఏదో ప్లాన్ చేశారనిపిస్తోంది అత్తయ్య అని నర్మద అంటుంది. ధీరజ్, ప్రేమ పెళ్లి గురించి మా అక్కకు తెలియదు కదా అని వేదవతి అడుగుతుంది. ఎవరైనా చెప్పారేమోనని నర్మద అంటుంది. నీకు, నాకు, ధీరజ్, ప్రేమకు తప్పా ఎవరికి తెలియదు. మరి మా అక్కకు ఎవరు చెప్పారు? అలా జరిగే అవకాశం లేదని వేదవతి అంటుంది. కచ్చితంగా ఏదో జరిగింది, అది తెలుసుకుంటానని నర్మద అనగానే వల్లి ఫ్యూజులు ఔట్ అయిపోతాయి.
వీడియోతో మైండ్ బ్లాక్
లోపలికి వెళ్లి వల్లి తెగ టెన్షన్ పడుతుంది. నర్మదకు డౌట్ వచ్చిందో లేదోనని క్లారిఫై చేసుకోవాలని వల్లి అనుకుంటుంది. చేసుకో అక్కా అని నర్మద వస్తుంది. నీ మనసులో ఏదో టెన్షన్ ఉందని నర్మద అంటుంది. భద్రావతిని వల్లి కలిసిన వీడియోను నర్మద చూపిస్తుంది. దీంతో వల్లి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ వీడియో చూడగానే చేసిన తప్పులు గుర్తుకొచ్చాయా అని నర్మద అడుగుతుంది.
ఏఐ వీడియో
భద్రావతితో నీకేంటి పని? ధీరజ్, ప్రేమ విడిపోవడానికి నువ్వే కారణమా? అని వల్లిని నర్మద అడుగుతుంది. నేను విడగొట్టలేదని వల్లి తడబడుతుంది. ఇంటి వెనుకకు వెళ్లి రహస్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముందని నర్మద అడుగుతుంది. మేం మాట్లాడుకుంది గార్డెన్ లో కదా. మరి ఇంటి వెనుక అని అంటుందేంటీ? ఇదేదో ప్లాన్ అని ఆ వీడియో చూస్తూ శ్రీవల్లి నవ్వుతుంది.
ఓ అబద్దాన్ని నిజంగా చాలా బాగా క్రియేట్ చేశావ్. ఇది ఏఐ వీడియో. ఎవరో నన్ను ఇరికించారని వీడియో చేశారు. వాళ్లను పోలీసులకు అప్పగిద్దామని వల్లి అంటుంది. ఈ వీడియో చేసింది నేనే. కొంపతీసి వెళ్లి కలిశావా ఏంటీ? అని నర్మద తెలివిగా గుట్టు రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది. కానీ వల్లి మాత్రం నిజం చెప్పదు. కచ్చితంగా కుట్ర జరిగింది. అందులో ఉన్నవాళ్లను బయటకు లాగుతానని నర్మద వార్నింగ్ ఇస్తుంది.
ధీరజ్ ను పట్టించుకోకుండా
మరోవైపు కోచింగ్ సెంటర్ దగ్గర ధీరజ్ వెయిట్ చేస్తాడు. ఈ రాక్షసి ఇంకా రావడం లేదేంటని అనుకుంటాడు. అప్పుడే ప్రేమ వస్తుంది. ధీరజ్ ను చూసి చూడకుండా వెళ్లిపోతుంది. నేను నీతో మాట్లాడటం కోసం వెయిట్ చేస్తుంటే వెళ్లిపోతాన్నావేంటీ? అని ధీరజ్ అడుగుతాడు. ఇంట్లో మాట్లాడిన మాటలు సరిపోవా, ఇంకా ఏమైనా మాట్లాడతావా అని ప్రేమ అంటుంది.
ఎవరో తెలియదని
నువ్వు ఇచ్చిన మాటను నమ్మి మోసపోయానని ప్రేమ అంటుంది. సెక్యూరిటీ వచ్చి ధీరజ్ ను ఆపుతాడు. ఆమెకు ఏమవుతానని అడుగుతాడు. ఇద్దరూ ఈగోతో ఆగిపోతారు. చివరకు ధీరజ్ తనకు కావాల్సిన అమ్మాయి అని అంటాడు. ఈ అబ్బాయి తెలుసా? అని సెక్యూరిటీ అడిగితే.. తనకు తెలియదని ప్రేమ అంటుంది. దీంతో ధీరజ్ ను సెక్యూరిటీ బయటకు తోసేస్తాడు.
అమూల్య చేయిపట్టుకున్న విశ్వ
ఇటు కాలేజీలో అమూల్య కోసం విశ్వ వెయిట్ చేస్తూనే ఉంటాడు. కానీ అమూల్య మాత్రం పట్టించుకోదు. 5 నిమిషాలు టైమ్ ఇవ్వమని అమూల్య చేయి పట్టుకుంటాడు విశ్వ. నా చేయి పట్టుకోవడానికి ఎంత ధైర్యం అని అమూల్య అంటుంది. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మా చెల్లెలు, మీ అన్నయ్య గురించి మాట్లాడాలని విశ్వ అంటాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


