Illu Illalu Pillalu July 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ప్రేమ పెళ్లి నిజం చెప్పిన ధీరజ్-భర్తను కొట్టిన ప్రేమ
Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 28 ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. కుట్ర ప్రకారం ధీరజ్ ను సేనాపతి రెచ్చగొడతాడు. వేదవతిని నానా మాటలు అంటాడు. సేనాపతిని ధీరజ్ కొడతాడు. ప్రేమ పెళ్లి గురించి నిజం చెప్పేస్తాడు. అది తట్టుకొని ప్రేమ ఏమో ధీరజ్ ను కొడుతుంది.
Illu Illalu Pillalu July 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో భద్రావతి, సేనాపతి, శ్రీవల్లి కుట్ర సక్సెస్ అవుతుంది. సేనాపతిని ధీరజ్ కొడతాడు. ప్రేమ పెళ్లి నిజాన్ని అందరికీ చెప్పేస్తాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

అవమానించిన సేనాపతి
భోజనాలు చేస్తున్న సమయంలో కావాలనే ధీరజ్ ను అవమానించేలా సేనాపతి మాట్లాడతాడు. మా ఆస్తి కోసం నా కూతురిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని సేనాపతి అంటాడు. అన్నయ్య నిజానిజాలు తెలియకుండా మాట్లాడకు అని వేదవతి అరుస్తుంది. ఇదే నిజం. మా కారు డ్రైవర్ గా కూడా పనికి రానివాడిని నా కూతురు పెళ్లి చేసుకుంటుందా? అని సేనాపతి మరీ దారుణంగా మాట్లాడతాడు.
ట్రాప్ చేశాడని
కచ్చితంగా వీడు నా కూతురిని ట్రాప్ చేశాడని సేనాపతి అంటాడు. నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని వేదవతి అంటుంది. కానీ సేనాపతి మళ్లీ అదే మాట అంటాడు. వీడి మోసానికి బలికాకుండా ఉంటే నా కూతురు అమెరికాలో ఉండేది. బంగారం లాంటి నా కూతురి భవిష్యత్ అన్యాయం అయిపోయిందని సేనాపతి తిడతాడు.
వేదవతి చెప్పిన నిజం
నీది ఒక బతుకేనా అని ధీరజ్ పై ఉమ్మేస్తాడు సేనాపతి. ఇలా దిగజారి బతికే బదులు నా కాళ్ల మీద పడి ఉంటే నీకెంత డబ్బు కావాలంటే అంత ముఖాన విసిరికొట్టేవాడిని. నువ్వు కూడా నీ బాబులాగే తయారయ్యావ్ అని సేనాపతి అంటాడు. నా కొడుకు వల్ల నీ కూతురి జీవితం అన్యాయమైపోవడం కాదు. నా కొడుకు లేకుంటే నీ కూతురి జీవితం అన్యాయమైపోయేదిన వేదవతి చెప్తుంది.
నా కొడుకు పెళ్లి చేసుకోకపోయి ఉంటే నీ కూతురికి జీవితమే ఉండేది కాదు. నీ కూతురు ప్రాణాలు తీసుకునే పరిస్థితుల్లో ఉంటే నా కొడుకు తాళి కట్టి తన ప్రాణాలు కాపాడాడని నిజం చెప్పేస్తుంది వేదవతి. కానీ సేనాపతి నమ్మడు. ఏం కథలు అల్లుతున్నావే అని అంటాడు సేనాపతి.
సేనాపతిపై దాడి
నీ కూతురు ఎవరినో ప్రేమించి మోసపోతే అని వేదవతి చెప్తుండగా సేనాపతి ఆపుతాడు. పనోడితో లేచిపోయిన నువ్వు నా కూతురు మీద నింద వేయాలని చూస్తున్నావ్. నీకు సిగ్గు లేదని అంటాడు సేనాపతి. మా అమ్మ గురించి ఏం కూశావురా అని ధీరజ్, చందు, సాగర్ సేనాపతిని కొడతారు. ఇప్పుడు ప్రేమను తీసుకొచ్చి కాపురం కూల్చేద్దామని ఆమె దగ్గరకు శ్రీవల్లి వెళ్తుంది. మీ నాన్నను ధీరజ్ కొడుతున్నాడని వల్లి చెప్తుంది.
రామరాజు గొడవను ఆపుతాడు. ఇంటికి వచ్చిన అతిథిని ఇలాగేనా చూసుకునేదని రామరాజు అంటాడు. వీడు కుట్రతోనే మన ఇంటికి వచ్చాడని సేనాపతిని తోసేస్తాడు ధీరజ్. అది చూసి ప్రేమ మా నాన్నను ఎందుకు కొట్టావ్ అని అడుగుతుంది. వాళ్లు నీపై నిందలు వేశారు. నువ్వు ఎవరితోనో లేచిపోయావంటా, వీడు తాళి కట్టి నీకు జీవితాన్ని ఇచ్చాడంటా అని ప్రేమతో సేనాపతి అంటాడు.
మొత్తం చెప్పేసిన ధీరజ్
ఇది నింద కాదు నిజం. మీ అందరికీ చెప్పినట్లు మేం ప్రేమించుకోలేదు. ప్రేమ కాలేజీలో కళ్యాణ్ అనే చెత్త వెధవను ప్రేమించింది. వాడితో కలిసి పెళ్లికి ముందు రోజు మోపిదేవికి వెళ్లింది. కళ్యాణ్ వేరే వాళ్లకు ప్రేమను అమ్మేశాడు. అదే రోజు నేను, అమ్మ, మా చిన్న వదిన మోపిదేవి గుడికి వెళ్లాం. అదే హోటల్లో దిగామని ధీరజ్ చెప్తాడు.
రామరాజు షాక్
ప్రేమను పోలీసులు వ్యభిచార కేసులో అరెస్టు చేయబోయారు. తాళి కట్టమని మా అమ్మ బతిమిలాడింది. మా అమ్మ మాట కాదనలేక ప్రేమ మెడలో తాళి కట్టా. నీ కూతురి గురించి, నీ పరువు గురించి అంతలా ఆలోచించిన మా అమ్మను నోటికొచ్చినట్లు మాట్లాడతావా అని సేనాపతిపై ధీరజ్ ఫైర్ అవుతాడు. అది విని రామరాజు షాక్ అవుతాడు. వాళ్లిద్దరికీ నువ్వే పెళ్లి చేశావా అని భార్యపై కోప్పడతాడు రామరాజు.
భద్రావతి మాటలు
మన కుటుంబానికి దూరమైనందుకు బాధపడుతున్నావ్ అనుకున్నా. నీ కడుపులో ఎంత విషం ఉందే. ఈ అమాయకపు నటన వద్దు. ప్రేమ చావాలో బతకాలో అనే నిస్సహాయ స్థితిలో ఉంటే అవకాశంగా తీసుకొని నీ కొడుకుతో తాళి కట్టిస్తావా? నా మేనకోడలిని నాకు దూరం చేస్తావా? నీకు పుట్టిల్లు లేదని తనకు కూడా పుట్టిల్లు లేకుండా చేస్తావా? అని వేదవతితో భద్రావతి అంటుంది.
ఫోన్ ఎందుకు చేయలేదు
మీరు నా రక్త సంబంధం. మీకు ఏదైనా అయితే నాకు అయినట్లే. నా మేనకోడలి ప్రాణాలు పోవొద్దని వాళ్లకు పెళ్లి చేశానని వేదవతి ఏడుస్తుంది. మాకు ఎందుకు ఫోన్ చేయలేదని సేనాపతి అడుగుతాడు. అప్పటికే పోలీసులు వచ్చారని వేదవతి చెప్తుంది. తప్పు చేయనప్పుడు మా అమ్మాయి ఎందుకు భయపడాలి. అదే విషయాన్ని పోలీసులకు చెప్పి మా అమ్మాయిని తెచ్చుకునేవాళ్లమని సేనాపతి అంటాడు.
ప్రేమ ఎమోషనల్
నా గతం గురించి మీ వాళ్లకు, మా వాళ్లకు తెలిస్తే ఆ గిల్ట్ ను భరించే శక్తి నాకు లేదని చెప్పా కదా. ఆ నిజం నీ నోటి నుంచి రాదని మాట ఇచ్చావ్ కదా అని ప్రేమ అంటుంది. మీ నాన్న మా అమ్మ గురించి దారుణంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయా. మీ వాళ్ల నోరు మూయించేందుకు నిజం చెప్పానని ధీరజ్ చెప్తాడు. నువ్వు నీ భార్య ఆత్మభిమానానికి ఇచ్చిన విలువ ఇదేనా అని ప్రేమ అడుగుతుంది.
ధీరజ్ ను కొట్టిన ప్రేమ
నేను నమ్మిన నువ్వే నన్ను నలుగురిలో నిలబెట్టేశావ్. నా ధైర్యం నువ్వే అనుకున్నా. నువ్వే నన్ను అనాథను చేశావని ప్రేమ ఏడుస్తుంది. మా వాళ్లకు కలిగిన బాధ నీకు అర్థం కావడం లేదా? అని ధీరజ్ అంటాడు. ఇంకా ఆ వెధవతో మాటలేంటీ? అని సేనాపతి అంటే ధీరజ్ కొట్టడానికి వెళ్తాడు. ధీరజ్ ను ఆపిన ప్రేమే అతణ్ని కొడుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


