Illu Illalu Pillalu July 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ఒకే ఫొటోలో 2 కుటుంబాలు- తిరుపతి నిలువుదోపిడీ- ప్రేమతో ధీరజ్
Illu Illalu Pillalu Serial July 25th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 25వ ఎపిసోడ్‌లో ధీరజ్ డౌట్ తీర్చేలా భద్రావతి కేక్ తింటుంది. తర్వాత ఒకే ఫ్రేమ్‌లో రామరాజు, సేనాపతి 2 కుటుంబాలు ఫొటోలు దిగుతారు. తిరుపతి ప్రేమ విషయం తెలిసి బంగారు ఉంగరాలతో నిలువుదోపిడీ చేస్తుంది కామాక్షి.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో సేనాపతి తెచ్చిన కేక్‌లో విషం కలిపారేమో అని ధీరజ్ డౌట్ పడతాడు. దాంతో భద్రావతి ముందుగా కేక్ తిని చూపిస్తుంది. తనకేం కాలేదుగా అని, అమ్మ కోరిక కోసం దిగొచ్చాం కదా అని అన్నింట్లో అనుమానించకూడదు అని భద్రావతి అంటుంది.

శారద బర్త్ డే సెలబ్రేషన్స్
ఇప్పుడేం సమాధానం చెబుతావ్ అని ప్రేమ అంటుంది. ఆపండి.. ఫంక్షన్ అయ్యేవరకు ఎవరిని ఏం అనొద్దు అని చెప్పానుగా అని రామరాజు తిడతాడు. మామ అల్లుళ్లు సెటైర్లు వేసుకుంటున్నారని తిరుపతి వాతావరణాన్ని కూల్ చేస్తాడు. అంతా కేక్ తినిపించుకుంటూ శారద పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేస్తారు. అంతా సంతోషంగా చిందులు వేస్తారు.
అందరం కలిసి ఫొటో దిగుదామని శారద అంటుంది. ఫ్యామిలీ ఫొటోకి కెమెరా రెడీ అని తిరుపతి అంటాడు. రామరాజు, భద్రావతి రెండు కుటుంబాలు కలిసి ఉంటాయి. అబ్బా రెండు కుటుంబాలు ఒకే ఫ్రేమ్‌లో ఉన్నాయని సంతోషంగా అంటాడు తిరుపతి. అందరూ ఫొటోలు చూసి సంతోషిస్తారు. తర్వాత అంతా డ్యాన్స్ చేస్తారు.
బంతిపూల జానకి పాటకు నర్మద సాగర్ డ్యాన్స్ చేస్తారు. చిరుత పాటకు ధీరజ్, ప్రేమ డ్యాన్స్ చేస్తారు. చూపుల్తో గుచ్చి గుచ్చి సంపకు పాటకు తిరుపతి సుకన్య చేస్తారు. అక్కా అక్కా ఎక్కడే అని సాంగ్‌కి ఆమని, భద్రావతి డ్యాన్స్ చేస్తారు. తర్వాత అంతా వాళ్ల చుట్టూ చేరి డ్యాన్స్ చేస్తారు. మీ ఆనందానికి టైమ్ అయిపోయింది. కొట్టుకు చావడానికి టైమ్ స్టార్ట్ అయిందని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది.
నర్మద సెటైర్లు
తర్వాత నువ్వు మీ మామ ఫ్రెండ్స్ అయినట్లున్నారుగా అని నర్మద సెటైర్లు వేస్తుంది. ప్రేమను అస్సలు ఆపలేకపోతున్నాను అని ధీరజ్ అంటాడు. కూల్ డ్రింక్స్ పట్టుకుని ప్రేమ పరిగెత్తుతుంది. ధీరజ్‌పై కూల్ డ్రింక్ పడుతుంది. ఇప్పుడే కదే పీతల్లాగా తాగారు, ఇంకా డ్రింక్స్ ఏంటే. మీవాళ్లు తాగారు కానీ నువ్వు తాగే అని ప్రేమ చీరపై ధీరజ్ కూల్ డ్రింక్ పోస్తాడు.
కూల్ డ్రింక్ షర్ట్ లాగా కూల్ డ్రింక్ సారీ అని ధీరజ్ కౌంటర్ ఇస్తాడు. ప్రేమ కోపంగా వెళ్లిపోతుంది. ఎందుకు ఇలా చేశావ్ అని నర్మద అడిగితే.. ఎందుకంటే నా భార్య కోసం చీర తీసుకున్నా. ప్రేమను సర్‌ప్రైజ్ చేయాలని ధీరజ్ అంటాడువెళ్తాడు. మరోవైపు సుకన్య స్వీట్స్ తింటూ ఉంటుంది. తిరుపతి వచ్చి మాట్లాడితే సుకున్య అంకుల్ అంటూ, ఏజ్ గ్యాప్ అంటూ సెటైర్లు వేస్తుంది.
దాంతో తిరుపతి ఆవేశపడతాడు. నా మీద అరిచావ్ అని అలుగుతుంది సుకన్య. మీ వాళ్లతో పరిచయం చేయిస్తానన్నావ్. మీ వాళ్లు ఎవరు నన్ను కలుపుకుపోవట్లేదు. నాకు కోపం వస్తుందని సుకన్య అంటుంది. దాంతో సుకన్యపై పాట పాడతాడు తిరుపతి. మరోవైపు భర్తతో బంగారు నగల లిస్ట్ రాయిస్తుంది. పుట్టింటి వాళ్ల నుంచి ఎన్నేళ్లయిన లాగాల్సిందే అని కామాక్షి అంటుంది.
తిరుపతి నిలువుదోపిడీ
తిరుపతి, సుకన్య ప్రేమగా హగ్ చేసుకుని ఊగిపోవడం కామాక్షి చూస్తుంది. వారి దగ్గరికి వెళ్తుంది కామాక్షి. తిరుపతి చేతికి ఉన్న బంగారం ఉంగరం, వెండి రింగ్ లాగేసుకుంటుంది కామాక్షి. తిరుపతి నుంచి 3 ఉంగరాలు తీసుకుని నిలువుదోపిడీ చేసి నీ పెళ్లిలో మేనకోడలి కట్నం ఏం పెడతావ్ అని అడుగుతుంది కామాక్షి. బంగారు నగల లిస్ట్ చెప్పి నీ పెళ్లిలో ఇవి రాకుంటే నీ పెళ్లి ఆపేస్తానని కామాక్షి అంటుంది.
మా మావయ్యకు ఆస్తులు బాగున్నాయి. వాటిమీద కన్నేశావనుకో నీ లైఫ్ సెట్టు. ఇంతకీ నీకెన్ని ఆస్తులున్నాయని కామాక్షి అడుగుతుంది. ఇది నా మీద కన్నేసిందేంటని తప్పించుకోవాలని సుకన్య అనుకుంటుంది. కోనసీమలో 10 ఎకరాల కొబ్బరితోట అంటూ చాలా లిస్ట్ చెబుతుంది సుక్కు. మీ పెళ్లి నేను చేయిస్తా నా సంగతి మర్చిపోవద్దే అని కామాక్షి వెళ్లిపోతుంది.
ఇవన్నీ నిజాలేనా అని తిరుపతి అంటే.. అవి నిజాలు అయితే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను అని సుకన్య వెళ్లిపోతుంది. మరోవైపు ప్రేమకు చీరతో సర్‌ప్రైజ్ ఇస్తాడు ధీరజ్. ఫంక్షన్ కోసం ఈ చీర కొన్నాను. మీవాళ్లు వస్తున్నారని చీర కట్టేసుకున్నావ్. ఇది కట్టుకోడానికే కూల్ డ్రింక్ పోశాను అని ధీరజ్ చెబుతుంది. దాంతో సంతోషంతో మురిసిపోతుంది ప్రేమ.
ప్రేమ, ధీరజ్‌ల సర్‌ప్రైజ్ గిఫ్ట్స్
నీకు కూడా ఓ గిఫ్ట్ తీసుకొచ్చాను అని ధీరజ్‌కు షర్ట్ ఇస్తుంది ప్రేమ. అది చూసి ఆశ్చర్యపోతాడు ధీరజ్. అలా ఒకరికొకరు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు ధీరజ్, ప్రేమ. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


