Illu Illalu Pillalu July 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-మామ అల్లుడి గొడవ-బావబామ్మరిది మందు పార్టీ- ఏడ్చిన భద్రావతి

Illu Illalu Pillalu Serial July 23rd Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 23వ ఎపిసోడ్‌లో రామరాజుతో మర్యాదలు చేయించుకుంటాడు సేనాపతి. మామ సేనాపతితో అల్లుడు ధీరజ్ గొడవ పడతాడు. రామరాజు ఆపుతాడు. వేదవతి, భద్రావతి చిన్నప్పటి విషయాలు గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు.

Published on: Jul 23, 2026, 08:35:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో రామరాజు ఇంట్లోకి సేనాపతి, భద్రావతి వాళ్లు వస్తారు. రెండు కుటుంబాలు కలిసి రావడం చాలా సంతోషంగా ఉందని తిరుపతి అంటాడు. వేదవతి చెప్పడంతో నర్మద, ప్రేమలు హారతి తీసుకొచ్చేందుకు వెళ్తారు. తిరుపతిని నీళ్లు ఇవ్వమంటాడు రామరాజు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 23వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 23వ ఎపిసోడ్

రామరాజు మర్యాదలు

నువ్వు ఈ ఇంట్లో పనోడివా.. పిలిచినోళ్లు నీళ్లు ఇవ్వలేరా అని సేనాపతి అంటాడు. ధీరజ్ కోప్పడితే రామరాజు చేయితో ఆపుతాడు. సేనాపతికి చెంబులో నీళ్లు ఇస్తాడు రామరాజు. అందరికి నీళ్లు ఇస్తాడు రామరాజు. అలా రామరాజుతో మర్యాదలు చేయించుకుంటాడు సేనాపతి. భద్రావతి కాళ్లు కడుగుతుంది వేదవతి. ఇదంతా నా ఆనందం కోసం, పాతికేళ్ల భారాన్ని కడిగేసుకోడం కోసం అని వేదవతి అంటుంది.

ఈ ఇంటి పనోడిని చేసుకుంది నీళ్లతో కడిగితే పోయే పాపం కాదని సేనాపతి అంటాడు. ఏంటీ మామ మాటలు మర్యాదగా రాని, లేకుంటే సేఫ్‌గా వెళ్లవని ధీరజ్ గొడవకు దిగుతాడు. ఏం చేస్తావురా అని సేనాపతి పైకి వెళ్తాడు. ఇద్దరిని ఆపుతారు. అమ్మ కోసం వచ్చాం, గొడవలు లేకుండా చేసుకుని వెళ్దామని భద్రావతి అంటుంది. ధీరజ్‌ను కోపం తెచ్చుకోకని వేదవతి బతిమిలాడుకుంటుంది.

పగతో రగిలిపోతున్న శ్రీవల్లి

సేనాపతి కుటుంబానికి హారతి ఇస్తారు. ఇంట్లోకి భద్రావతి వాళ్లు అడుగుపెడతారు. వేదవతి తెగ డ్యాన్స్ చేస్తూ సంతోషిస్తారు. ఆ సంతోషంలో నర్మదకు ముద్దు పెడుతుంది. అదంతా శ్రీవల్లి, సుకన్య చూస్తారు. ఫంక్షన్ చివరిలో ఆవిడ మొహం చూడాలి. నన్ను బాధపెట్టిన ప్రతి ఒక్కరు అంతకుమించి బాధపడేలా చేస్తాను అని వల్లి వెళ్తుంది.

నిన్ను చూస్తుంటే భయమేస్తుందే తల్లి అని సుక్కు అనుకుంటుంది. తన గదిలోకి తీసుకెళ్లి భద్రావతికి చీరలు చూపిస్తుంది వేదవతి. ఇద్దరం ఒకే రంగు చీర కట్టుకున్నామని వేదవతి అంటుంది. చిన్నప్పుడు అనుకున్న విషయాలు గుర్తు చేస్తుంది వేదవతి. దాంతో భద్రావతి ఎమోషనల్ అవుతుంది. వేదవతిని కౌగిలించుకుని ఏడుస్తుంది.

పాతికేళ్ల బాధ

ఇద్దరు ఏడుస్తారు. పాతికేళ్ల బాధ అంతా పోయిందని వేదవతి అంటుంది. ఆ పనోడిని పెళ్లి చేసుకుంటే ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉండేవాళ్లం అని భద్రావతి మనసులో అనుకుంటుంది. రామరాజు, సేనాపతి వాళ్లు మాత్రం అంతా సైలెంట్‌గా ఉంటారు. తిరుపతి వచ్చి హడావిడి చేస్తాడు. సేనాపతి పక్కన ధీరజ్ కూర్చునేలా చేస్తాడు. సేనాపతి కాలు మీద కాలు వేసుకుంటాడు.

దాంతో ధీరజ్ కూడా కాలు వేసుకుంటాడు. మాట్లాడుకోండని తిరుపతి చెబితే అంతా సీరియస్‌గా చూస్తారు. ఇంతలో ప్రేమ వచ్చి మామ అల్లుళ్లు కలిసిపోయారా అని అంటుంది. వీళ్లని కలిపింది నేనే, నాకు కచ్చితంగా సన్మానం చేయాల్సిందే అని తిరుపతి అంటాడు. నేను చేస్తానురా బాగా చేస్తాను అని సేనాపతి అంటాడు. దాంతో వద్దని తిరుపతి భయపడతాడు.

సాయంత్రం మందుపార్టీ

ప్రేమ కూల్ డ్రింక్ ఇస్తే వద్దంటాడు సేనాపతి. పనోడి ఇంట్లో నేను తాగడం ఏంటని అంటాడు. ధీరజ్ కోపంగా లేస్తాడు. రామరాజు ఆపుతాడు. అతిథులను గౌరవించడం మన సాంప్రదాయం. అది నిలబెట్టుకోవడం, నిలబెట్టుకోకపోవడం ఎదుటివాళ్ల సంస్కారంపై ఉంటుందని రామరాజు అంటాడు. ప్రేమ తనకోసం తీసుకోమనడంతో తాగుతాడు సేనాపతి.

అందరికి కూల్ డ్రింక్స్ ఇస్తారు. ఇలా కూల్‌గా ప్రారంభమైన బంధం సాయంత్రం బావబావమరిదిల మందుపార్టీతో మారుమోగిపోవాల్సిందే అని తిరుపతి అంటాడు. సేనాపతి, రామరాజు కోపంగా చూస్తారు. మరోవైపు భద్రావతికి స్వీట్ ఇస్తుంది వేదవతి. కామాక్షి స్వీట్స్ తింటుంది. అమూల్య సెటైర్లు వేస్తుంది.

నర్మద స్కూల్

నా వంట అంటే భద్రావతికి చాలా ఇష్టమని చెప్పేదని, అక్కకు నేనంటే చాలా ప్రేమ అని వేదవతి సంతోషంగా చెబుతుంది. మీరు నా స్కూలేనా అని వేదవతితో నర్మద అంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More