Illu Illalu Pillalu July 11 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- అమూల్య కాళ్లపై పడ్డ రేవతి- ప్రేమపై ధీరజ్ నింద- విశ్వకు నిజం
Illu Illalu Pillalu Serial July 11th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 11వ ఎపిసోడ్‌లో విశ్వ కుటుంబం గురించి ఆలోచించే కేసు వాపసు తీసుకున్న అని అమూల్య చెబుతుంది. అమూల్య అలా చేయడానికి కారణం ప్రేమే అని ధీరజ్ నిందిస్తాడు. ప్రేమ పది లక్షల లాటరీ అబద్ధమని వేదవతికి నర్మద చెబుతుంది.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో నేను ఏడవటం కాదు ఇకనుంచి ఆ ప్రేమ, నర్మదను గ్యాప్ లేకుండా ఏడిపిస్తాను. నా బావ అంటే నాకు ప్రాణం. అలాంటి బావ నన్ను అసహ్యించుకునేందుకు, నా కాపురం కూలేందుకు కారణమైనవాళ్లను వదులుతానా. నా జీవితంలో లేని సంతోషాన్ని వాళ్ల జీవితంలో ఉండనిస్తానా అని శ్రీవల్లి తల్లితో అంటుంది.

నర్మద, ప్రేమ మొగుళ్లను దూరం చేస్తాను
నన్ను నా బావను విడదీసినట్లే ప్రేమ, నర్మదకు వాళ్ల మొగుళ్లకు దూరం పెంచుతాను. కాపురం నిలువునా ముంచుతాను. ఇకనుంచి వాళ్ల మధ్య గొడవలు పెట్టడం తప్పా ఇంకో పని లేదు అని శ్రీవల్లి శపథం చేసినట్లుగా మాట్లాడుతుంది. మరోవైపు ఇంట్లో విశ్వపై కేసు విత్ డ్రా తీసుకోవడంపై అమూల్యను నిలదీస్తారు. ఎవరైనా బెదిరించారేమో అని నర్మద అంటుంది.
అదైనా చెప్పాలిగా. ఏం చెప్పకుండా ఉంటే ఎలా తెలుస్తుందని వేదవతి తిడుతుంది. ఆ విశ్వ ఎలాంటివాడో తెలుసుగా. అలాంటి వాడికి శిక్ష వేస్తేనే కదా చేసిన తప్పు తెలిసేదని చందు అంటాడు. తప్పు చేసినవారికి రెండో అవకాశం ఇస్తే మారుతారని అలా చేసిందేమో అని శ్రీవల్లి అంటుంది. మారుతారని అవకాశం ఇవ్వడం అంటే పాముకు పాలు పోసినట్లే. అవకాశం ఇస్తే గోతులు తవ్వుతారని వేదవతి అంటుంది.
నువ్వు చెప్పింది అక్షరాల నిజం అమ్మా అని చందు అంటుంది. నీ మీద కోపంతో అడగట్లేదు. నీ జీవితం గురించి భయంతో అడుగుతున్నా అని గతంలో జరిగిన విషయాలు గుర్తు చేసి నిజం చెప్పమని అడుగుతాడు రామరాజు. ఇప్పటికీ నాకు విశ్వ మీద కోపం ఉంది. జీవితంలో కూడా క్షమించను. వాడు చేసిన తప్పుకు ఆ కుటుంబం బాధపడటం కరెక్ట్ కాదని అమూల్య అంటుంది.
విశ్వకు భిక్షగా జీవితం
వాళ్లు చేసిన తప్పుకు మన కుటుంబం బాధపడలేదా అని ధీరజ్ అంటాడు. మర్చిపోలేదు. మన నాన్నకు వచ్చిన పరిస్థితి వాళ్ల ఇంట్లో ఎవరికి రాకూడదనే ఇలా చేశాను. వాళ్లు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నాను. వాళ్లు మంచివాళ్లే. మన గొడవలు మరింత ముదరకూడదనే కేసు వాపసు తీసుకున్నా అని అమూల్య చెబుతుంది.
ఇలా చేస్తే విశ్వ మరింత రెచ్చిపోతాడని ధీరజ్ అంటాడు. అమూల్య చిన్నదైన చేసింది మంచి పనే. క్షమించి వదిలేయడం అంటే మనం తగ్గినట్లు కాదురా వాడికి జీవితాన్ని భిక్షగా పడేయడం. అమూల్య ప్రశాంతంగా ఉందిగా. మనకు కావాల్సింది అదే. ఇక దీని గురించి మర్చిపోండని రామరాజు అంటాడు. తర్వాత ప్రేమ తింటుంటే ధీరజ్ చూస్తూ ఉంటాడు.
ఏంట్రా చూస్తున్నావ్ అని ప్రేమ అంటే.. అమూల్య కేసు వాపసు తీసుకోవాలనే ప్లాన్ నీదే కదా. మీ అన్నయ్యకు ఏం కావద్దనేగా ఇలా చేశావ్ అని ధీరజ్ నిందిస్తాడు. అరేయ్ ఒట్టురా నేను చేయలేదని ప్రేమ అంటుంది. చాప కింద నీరులా అంతా చేశావ్. ఇకనుంచి నువ్వు ఇంట్లో ఉండకూడదు నడు అని ధీరజ్ అంటాడు. నిన్ను నమ్మించడానికి ఏ ప్రమాణం చేయమంటావో చెప్పురా అని భయంతో అంటుంది ప్రేమ.
లాటరీ గురించి చెప్పిన నర్మద
దాంతో ఒక్కసారిగా నవ్వుతాడు ధీరజ్. నిన్ను ఆటపట్టించడానికి అన్నానని అంటాడు. సచ్చినోడా. ఎక్కడ నన్ను అపార్థం చేసుకున్నావో అని భయంతో చచ్చానని ప్రేమ కొడుతుంది. ప్రేమకు చక్కిలిగింతలు పెడతాడు ధీరజ్. ఇంతలో వేదవతి, నర్మద వస్తారు. ధీరజ్, ప్రేమలది రొమాన్స్ అంటూ సెటైర్లు వేస్తారు. నర్మద, వేదవతి సరదాగా గొడవ పడతారు.
అత్తలా ఉంటే ఓ గుడ్ న్యూస్ చెప్పనంటుంది నర్మద. అయితే ఫ్రెండ్స్ అని వేదవతి అంటుంది. ప్రేమకు లాటరీలో పది లక్షలు వచ్చింది అబద్ధం, అసలు విషయం వేరే ఉందని, తన భర్తకు కారు కొనిచ్చేందుకు డ్యాన్స్ కాంపిటీషన్‌లో పాల్గొంది. ఆ ప్రైజ్ మనీతోనే వాళ్ల ఆయనకు కారు కొనిచ్చిందని నర్మద చెబుతుంది. దాంతో వేదవతి ఏడుస్తుంది.
నా చిన్న కొడుకు నా దగ్గర ఏది దాచడనుకున్నా. కానీ, వీళ్లు కూడా మోసం చేశారని వేదవతి అంటుంది. దాంతో ధీరజ్ బుజ్జగిస్తాడు. తర్వాత ఇద్దరు ఇష్టపడని మీరు ఒకరికోసం మరొకరు ఉండటం చాలా సంతోషంగా ఉందని వేదవతి అంటుంది. ఆ మాటలు శ్రీవల్లి వింటుంది. అది నర్మద చూస్తుంది. వేదవతికి చెబుతుంది. వేదవతి కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది.
శ్రీవల్లిని కొట్టిన వేదవతి
ఇలా దొంగచాటుగా వినే బుద్ధి మార్చుకోవా అని లాగిపెట్టి శ్రీవల్లిని కొడుతుంది వేదవతి. ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు వింటున్నాను అంతే. మీరేం మాట్లాడుకుంటున్నారు. నిజంగా నేను వినలేదు. నాకు మీద తప్పుడు అభిప్రాయం ఉంది కాబట్టి నన్ను ప్రతిదానికి అంటారు. కానీ, నేను నా తల్లి కొట్టిందనుకుంటాను. చేసిన తప్పుకు శిక్ష అనుకుంటాను అని వెళ్లిపోతుంది ఏడుస్తూ శ్రీవల్లి.
వల్లి మన మాటలు వినలేదు. భయపడాల్సిన అవసరం లేదని ప్రేమ అంటుంది. ప్రేమను పోలీస్ కోచింగ్‌లో జాయిన్ చేయించాలని, మంచి టైమ్ చూసి నాన్నకు చెప్పాలని తల్లిని అడుగుతాడు ధీరజ్. నన్ను వదిలేయండని వేదవతి వెళ్లిపోతుంది. మరోవైపు ఎంతో కోపం ఉన్న అమూల్య కేసు ఎందుకు వాపసు తీసుకుందని ఫొటో చూస్తూ ఆలోచిస్తాడు విశ్వక్.
ఇంతలో తల్లి రేవతి, నానమ్మ శారదాంబ వస్తారు. మీ అమ్మ బతిమిలాడుకుంటే అమూల్య కేసు వాపసు తీసుకుందని శారద చెబుతుంది. నడుస్తున్న అమూల్య కాళ్లపై రేవతి పడుతుంది. నా కొడుకు క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటుంది. పెద్దవాళ్లు ఇలా పడొచ్చా. నేను వినను అని అమూల్య అంటుంది. ఈ కన్నతల్లి పేగు గురించి ఆలోచించమ్మా. ఇప్పటికీ నా కూతురు విషయంలో దుఖిస్తున్నాను. నా కొడుకు చెడ్డోడే. కానీ, వాడి విషయంలో తట్టుకోలేని అంటుంది రేవతి.
అమూల్య కేసు వాపసు వెనుక అసలు కారణం
నువ్వు క్షమిస్తే నా కొడుకుని మార్చుకుంటాను. కనీసం కొడుకు విషయంలో అయిన నరకం నుంచి తప్పించమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది రేవతి. అదంతా విశ్వకు చెబుతుంది రేవతి. ఈ అమ్మ కన్నీళ్లు అర్థం చేసుకుని అమూల్య నీకు కొత్త జీవితం ఇచ్చింది. ఇప్పటికైనా అమూల్య ఎంత మంచిదో అర్థం చేసుకో అని చెబుతుంది రేవతి.
మనలాగే వాళ్లు కూడా ప్రతికారం కోసం చూస్తే నువ్వు ఇంట్లో ఉండేవాడివి కాదు. ఇప్పటికైనా పంతాలు పక్కన పెట్టి కనీసం నువ్వైనా మారి చావురా. రామరాజు కుటుంబం మంచితనం గురించి తెలుసుకో అని శారద అంటుంది. మరోవైపు చందు చాప, దిండు తీసుకెళ్తుంటే ఇక్కడే పడుకో అని పక్కకు పడేస్తుంది శ్రీవల్లి.
ఏంటీ నోరు లేస్తుందని చందు కోప్పడుతాడు. ఇదివరకే చెప్పాను మనం నలుగురి మధ్యనే భార్యభర్తలం నాలుగు గోడల మధ్య కాదు అని చందు అంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


