Illu Illalu Pillalu July 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- శ్రీవల్లిని వెలేసిన భర్త, అత్త- పగతో రగిలిపోయిన పెద్ద కోడలు
Illu Illalu Pillalu Serial July 9th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 9వ ఎపిసోడ్‌లో శ్రీవల్లి తన జీవితం నుంచి దూరమైపోయిందని, కేవలం బయటి వాళ్లకు మాత్రమే భార్యవని అని చందు అంటాడు. ఇంటికొచ్చిన నలుగురి ముందు శ్రీవల్లిని వేదవతి అవమానిస్తుంది. నర్మదకు వేదవతి సారీ చెబుతుంది.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో నర్మదను క్షమించమని, తనతో మాట్లాడమని బతిమిలాడుకుంటుంది వేదవతి. చివరికి సారీనే అని చెబుతుంది. దాంతో నర్మద కరుగుతుంది. నా గడసరి అత్తతో మాట్లాడకుండా ఉండగలనా అని నర్మద అంటుంది.

నర్మదకు వేదవతి సారీ
నేను నీకు సారీ చెప్పినట్లు ఎవరికి చెప్పకని, అందరిముందు లోకువ అయిపోతానుగా అని వేదవతి అంటుంది. సరేనని చెప్పిన నర్మద ఇంట్లో చెప్పను కానీ ఊర్లో చెబుతానంటుంది. దాంతో ఇద్దరు నవ్వుకుంటారు. హగ్ చేసుకుంటారు. మరోవైపు చందు గదిలోకి వచ్చి చాప, దిండు తీసుకెళ్తాడు. ఇకనుంచి బయటే పడుకుంటానని చందు అంటాడు.
తన తప్పేం లేదని శ్రీవల్లి అంటుంది. ఒట్టేసి చెబుతున్నా అంటుంది. అనవసరపు ఒట్లు వేస్తే చంపేస్తా. మీ అమ్మ చెబితే నీకు తెలియదా. ఏది చెబితే అది ఆడతావా. నేను చూపించే ప్రేమ చూసైనా నిజం చెప్పాలనిపించలేదా అని చందు అంటాడు. బాధ అనిపించింది. కానీ, కాపురం కూలిపోతుందేమో అని భయపడ్డానని వల్లి అంటుంది.
మరి ఇప్పుడేమైంది చెప్పు. ఇంకా నర్మద మీద నిందలు వేశావ్. ఇన్ని మోసాలతో ఏ కాపురం నిలబడదు అని చందు అనేసి వెళ్లిపోతాడు. నన్ను దూరం పెట్టకు బా అని శ్రీవల్లి అంటే.. దూరం పెట్టడం కాదు నా జీవితం నుంచి దూరమైపోయావ్. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మా నాన్న బాధపడుతుంటే చూడలేక పెళ్లి చేసుకున్నా. నువ్వు గొప్ప కోడలివి అని మా నాన్న భ్రమలో ఉన్నాడు. నీ గురించి తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుంది. అందుకే ఇక్కడ ఉన్నావని చందు అంటాడు.
పేరుకే భార్యవి
ఇదంతా చేసింది నీకోసమే అని శ్రీవల్లి అంటే.. దూరమైపోవడం కాదు నిన్ను భార్యగా కూడా చూడను. అందరిముందు నువ్వు జస్ట్ పేరుకే భార్యవి. మన మనసుల మధ్య కనపడని గీత ఉంటుంది. అది ఎప్పటికీ చేరుకోలేవు అని తెగేసి చెప్పి కోపంగా వెళ్లిపోతాడు చందు. శ్రీవల్లి ఏడుస్తుంటుంది. మరోవైపు ప్రేమ నిద్రపోకుండా కంగారుగా ఉంటుంది.
ధీరజ్ చూసి నిద్ర పోకుండా ఏం చేస్తున్నావే. కొంపదీసి శుద్ర శక్తులు, మంత్ర శక్తులు లాంటివి ప్రాక్టీస్ చేస్తున్నావా అని అడుగుతాడు. మనసు నిండా బాధ ఉన్నప్పుడు నిద్ర ఎలా పడుతుంది. రేపు అమూల్య కోర్టు కేసు. ఓవైపు పుట్టిల్లు, మరోవైపు అత్తిల్లు అని ప్రేమ అంటుంది. ప్రేమను హగ్ చేసుకుని ఓదారుస్తాడు ధీరజ్. తప్పు చేసింది అన్నయ్య అయినా శిక్ష పడాల్సిందే అన్నావుగా. అక్కడ మరో మెట్టు ఎక్కేసావని ముద్దు పెట్టుకుంటాడు ధీరజ్.
రేపు కోర్టుకు రానా అని ప్రేమ అడిగితే మీ నాన్న ఎంత బీభత్సం ఎంత చేస్తాడో. అది చూస్తే మరింత బాధపడతావ్. వద్దని ధీరజ్ అంటాడు. ఇంతలో పాటలు గట్టిగా వినిపిస్తాడు. ప్రేమను పడుకోబెట్టి బయటకు వెళ్తాడు ధీరజ్. తిరుపతి పెళ్లి కావట్లేదని ఫీల్ అవుతుంటే.. పెళ్లి చేసుకుని ఎవరు సంతోషంగా లేరని అంటాడు ధీరజ్. నా ప్రేమ బ్రేకప్ అయిపోయింది. నా దేవకన్య సుకన్య ఇక్కడే ఉంటే ప్రేమ ఫలించేది. కానీ తనను అక్కడ పెట్టారు అని తిరుపతి అంటాడు.
తిరుపతి బ్రేకప్
నువ్వు ప్రేమించింది సుకన్యనా అని ధీరజ్ షాక్ అవుతాడు. సుకన్యను తనను కలపమని తిరుపతి అంటాడు. ఆ భాగ్యం కుటుంబం నుంచి అమ్మాయి ద్వారా నిప్పుల కుంపటి పెట్టుకున్నామని అమ్మ అనుకుంటుంది. ఇప్పుడు ఇంకొకరు వద్దని ధీరజ్ వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం కొంతమంది ఆడవాళ్లు వేదవతి దగ్గరికి వస్తారు.
తన కోడలు నెల తప్పిందని పసుపు కుంకుమ ఇచ్చేందుకు వచ్చినట్లు చెబుతుంది ఒకావిడ. వాటిని దేవుని దగ్గర పెట్టమని, పిల్ల పాపలతో ఇల్లు కళకళలాడుతుందని అంటుంది. పక్కనే ఉన్న వల్లిని పిలుస్తుంది. శ్రీవల్లిని కొంగు పట్టమని పసుపు కుంకుమ తీసుకోమ్మంటుంది. శ్రీవల్లి కొంగుపడితే.. వేదవతి ఆపి నర్మదను పిలుస్తుంది. నర్మదను తీసుకోమంటుంది.
పెద్ద కోడలిని కాదని రెండో కోడలిని తీసుకోమంటున్నావని ఆమె అడిగితే.. పెద్దోడిని చేసుకున్నంతమాత్రన పెద్ద కోడలు అయిపోరు. బాధ్యతలు తీసుకోవడంలో పెద్ద మనసు ఉండటంలో ఉంటుందని వేదవతి అంటుంది. దాంతో నర్మద కొంగులో వాళ్లు పసుపు కుంకుమ పెడతారు. కోడళ్లకి కుంకుమ పెట్టమని ఆమె అంటే.. నర్మద, ప్రేమకు పెట్టి వల్లికి పెట్టదు వేదవతి. వల్లి బాధపడుతుంది.
వల్లికి అవమానం
పెద్ద కోడలికి బొట్టు పెట్టలేదేంటీ అని అడిగితే.. పెట్టించుకునే అర్హత ఉండాలిగా అని వేదవతి ఇతరుల ముందు అవమానిస్తుంది. వాళ్లంతా వెళ్లిపోతారు. తర్వాత వేదవతి దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకుని ఏడుస్తుంది శ్రీవల్లి. నన్ను క్షమించు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా కాలు వదులు అని కాలదన్నుతుంది వేదవతి. ఒకప్పుడు అమ్మలా ప్రేమను పంచారు. ఇప్పుడు ఇంతలా ద్వేషం చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని వల్లి అంటుంది.
కోపం పోయేదాకా కొట్టండి. కానీ, ఇలా ద్వేషించకండని వల్లి అంటుంది. మిగతా కోడళ్లకంటే నీకే విలువ ఎక్కువ ఇచ్చాను. ప్రేమ చూపించాను. కానీ, నా మంచితనం నీకు చేతకానీ తనం అయిపోయింది. పిచ్చితనం అయిపోయింది. నీ మీద ఉంది ద్వేషం కాదు అసహ్యం. ఇదంతా నువ్వే కొని తెచ్చుకున్నావ్ అని కోపంగా వెళ్లిపోతుంది వేదవతి.
పగతో రగిలిపోయిన వల్లి
వర్షం పడుతుంది. వర్షంలో కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది శ్రీవల్లి. మరోవైపు ప్రేమ, నర్మద బట్టలు తీస్తుంటే.. వేదవతి వచ్చి గొడుగు పడుతుంది. ప్రేమ, నర్మదను వేదవతి తల్లిలా ప్రేమగా చూడటం చూసి శ్రీవల్లి కోపం తెచ్చుకుంటుంది. భర్త, అత్త తనను వెలివేయడానికి కారణం నర్మద, ప్రేమ అని పగతో రగిలిపోతుంది వల్లి. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


