ఇల్లు ఇల్లాలు పిల్లలు జూలై 4 ఎపిసోడ్: ప్రేమను గెలిపించిన ధీరజ్- రామరాజుకు సహనరత్న అవార్డ్-వల్లి ఐడియా, లాటరీలో 10 లక్షలు

Illu Illalu Pillalu Serial July 4th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 4వ ఎపిసోడ్‌లో ధీరజ్, ప్రేమల గురించి వేదవతి టెన్షన్ పడుతుంది. నర్మద కనుక్కుని వేదవతిని ఆటాడుకుంటుంది. స్టేజీపై డ్యాన్స్ చేస్తూ ప్రేమ కిందపడిపోతుంది. ధీరజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తాడు. ప్రేమ గెలిచి పది లక్షలు అందుకుంటుంది.

Published on: Jul 4, 2026, 08:36:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ ఇంకా రాకపోవడంపై వేదవతి టెన్షన్ పడుతుంది. అప్పుడే నర్మద ఫోన్ చేసి కనుక్కుందామని అనుకుంటుంది. మరోవైపు డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతుంటుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 4వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 4వ ఎపిసోడ్

ప్రేమను కొట్టబోయిన ధీరజ్

మరోవైపు ప్రేమను కాపాడిన ధీరజ్ కోప్పడుతాడు. లాగి కొట్టబోయి ఆగిపోతాడు. ఇలాంటి వాళ్ల గురించి న్యూస్ వింటున్నావుగా. ఏం తెలిసి వచ్చావని తిడతాడు ధీరజ్. నీకు కారు కొనివ్వడం కోసంరా. నా భర్త డెలివరీ బాయ్‌గా ఉండటం చూడలేకపోయానురా. ట్రావెల్ బిజినెస్‌లో ఆగిపోయినందుకు, నిన్ను గెలిపించడానికిరా అని ప్రేమ అంటుంది.

ఇంతలో నెక్ట్స్ పార్టిస్‌పెంట్ ప్రేమ అని అనౌన్స్ చేస్తారు. వెళ్లి డ్యాన్స్ చేయమని, ఎలాగు వచ్చావుగా కనీసం ఈ హ్యాపీనెస్ అయినా దక్కని అని ధీరజ్ అంటాడు. దాంతో ధీరజ్‌ను హగ్ చేసుకుని వెళ్తుంది ప్రేమ. నర్మద ఫోన్ చేయడంతో అంతా ఓకే అని, కాసేపట్లో బయలుదేరతామని చెబుతాడు ధీరజ్. నర్మదను అడిగేందుకు వేదవతి ఇబ్బంది పడుతుంది.

నర్మద అది చూసి కావాలనే చెప్పదు. ఏంటంటా.. ఏమైందట అని వేదవతి అంటే.. నర్మద దిక్కులు చూస్తుంది. కాసేపు అత్తతో ఆడుకుంటుంది నర్మద. ఇంతకీ ధీరజ్ ఏమన్నాడని వేదవతి అంటే.. మీకెందుకు చెప్పాలని నర్మద అంటుంది. మనమధ్య మాటలు లేవుగా అని నర్మద వెళ్లిపోతుంది. మరోవైపు ప్రేమ డ్యాన్స్ చేస్తుంది.

ప్రేమను గెలిపించిన ధీరజ్

డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కింద పడిపోతుంది ప్రేమ. మోకాలి నొప్పుతో లేవలేకపోతుంది ప్రేమ. దాంతో ధీరజ్ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తాడు. ప్రేమ నిలుచుని ఉంటే.. ధీరజ్ డ్యాన్స్ చేసి కవర్ చేస్తాడు. తర్వాత మిగతా డ్యాన్సర్స్ కూడా వస్తారు. ఆ తర్వాత ప్రేమ కూడా డ్యాన్స్ చేస్తుంది. ధీరజ్, ప్రేమ ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. అంతా లేచి చప్పట్లు కొడతారు.

తర్వాత స్టేజీ మీదకు వచ్చిన జడ్జెస్ ప్రేమ విన్నర్ అని చెబుతారు. దాంతో ప్రేమ తెగ సంతోషపడుతుంది. స్టేజీ మీదకు వెళ్తుంది ప్రేమ. ప్రైజ్ మనీ రూ. 10 లక్షల చెక్ అందజేయాలని యాంకర్ చెబుతుంది. దాంతో ధీరజ్‌ను స్టేజీ మీదకు ప్రేమ పిలుస్తుంది. ధీరజ్, ప్రేమ ఇద్దరు కలిసి పది లక్షల చెక్ తీసుకుంటారు. ఇద్దరు గెలిచిన ఆనందంలో మురిసిపోతారు.

మరుసటి రోజు ఉదంయ ఇంట్లో రామరాజు ఇంట్లో ప్రేమ, ధీరజ్ గురించి అంతా కంగారుగా ఉంటారు. ఫోన్ చేశాను. వచ్చేస్తున్నారట అని నర్మద చెబుతుంది. నిన్ను అడిగానా. అన్నింట్లో ఎందుకు వేలు పెడతావని కోడలిపై పగ తీర్చుకుంటుంది వేదవతి. ప్రతిదానికి కోడలిపై ఎందుకు అరుస్తున్నావ్. తను చెప్పింది మంచి విషయమేగా అని రామరాజు అంటాడు.

రామరాజుకు సహనరత్న అవార్డ్

తిన్నది అరక్క అరుస్తున్నా. ఏంటయ్యా రామరాజు నువ్వు కొడుకు, కోడలు రావడంపై మాట్లాడకుండా మా గొడవపై ఆరా తీస్తున్నావ్ పెద్ద పోలీస్ ఆఫీసర్‌లా అని వేదవతి అంటుంది. బావ నువ్వు మా అక్క బీపీని ఇంత భరిస్తున్నావ్ అంటే నీకు కచ్చితంగా సహనరత్న అవార్డ్ ఇవ్వాల్సిందే అని తిరుపతి అంటాడు. ఇంతలో ధీరజ్, ప్రేమ కారులో వస్తారు.

ఈ కారు ఎవరిదిరా అని వేదవతి అడిగితే.. మనదే. ఆరోజు ఫైనాన్సియర్ తీసుకెళ్లిన కారు ఇదే అని ధీరజ్ అంటాడు. వాడు అంత నిర్ధాక్షిణ్యంగా ఎలా ఇచ్చాడని వేదవతి అంటే.. కారు డబ్బులు మొత్తం వాడి మొహాన కొట్టి తీసుకొచ్చాం. ఇప్పుడు కారు మీద ఒక్క రూపాయి బాకీ లేదు. ఇప్పుడు ఇది మన సొంత కారు అని ధీరజ్ అంటాడు.

దానికి పది లక్షలకుపైగా అవుతుందిగా. అంత డబ్బు ఎక్కడిదిరా అని రామరాజు అడుగుతాడు. ఏముంది మావయ్య గారు అంత డబ్బు వచ్చిందంటే రాత్రికి రాత్రే డబ్బు మూట దొరికి ఉండాలి, ఏదైనా స్కీములు, స్కాములు అయి ఉండాలని శ్రీవల్లి పుల్లపెడుతుంది. కొంతమంది అదే పనిలో ఉదయం నుంచి ఉంటారని శ్రీవల్లినే రివర్స్‌లో అంటుంది అమూల్య.

శ్రీ వల్లి ఐడియా, లాటరీ తగిలిందని

ఒక్కరోజులో పది లక్షలు ఎలా వస్తాయి. అద్భుతం ఏమైనా జరిగిందా. లాటరీ తగిలిందా అని శ్రీవల్లి అంటుంది. వావ్ సూపర్ వదినా. లాటరీనే తగిలి 10 లక్షలు వచ్చాయని ధీరజ్ చెబుతాడు. మావయ్య ఇచ్చిన డబ్బుతో చీర కొన్నాను. లక్కీ డ్రాప్‌లో పది లక్షలు వచ్చాయని ప్రేమ అంటుంది. దాంతో వల్లి షాక్ అవుతుంది.

నీ ఫ్రెండ్ వాళ్ల అమ్మకు బాగా లేకుంటే వెళ్లావుగా అని వల్లి అడుగుతుంది. పక్కనే షాప్ ఉంటే కొన్నాను అని ప్రేమ అంటుంది. ప్రేమను పొగిడి నర్మదను తిడుతుంది వేదవతి. తర్వాత ప్రేమను కోపంగా చూస్తుంది నర్మద. డ్యాన్స్ చేసి బాగా అలసిపోయాను. కొడితే కొట్టు గానీ అలా చూడకని ప్రేమ అంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More