Illu Illalu Pillalu July 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- భద్రావతితో శ్రీవల్లి నాటుబాంబు ఐడియా- ధీరజ్‌కు కత్తిపోట్లు!

Illu Illalu Pillalu Serial July 18th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 18వ ఎపిసోడ్‌లో ధీరజ్, ప్రేమ పెళ్లి వీడియోను భద్రావతికి చూపిస్తుంది శ్రీవల్లి. రగిలిపోయిన భద్రావతితో తన నాటుబాంబు ఐడియా చెబుతుంది వల్లి. అందులో భాగంగానే రామరాజు ఇంటికి శారద వస్తుంది. ధీరజ్‌ను ఒకతను కత్తితో పొడుస్తాడు.

Published on: Jul 18, 2026, 08:40:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్, ప్రేమ రహస్య పెళ్లి వీడియో దొరికిందని భాగ్యం చెబుతుంది. ఆ వీడియో పంపమని శ్రీవల్లి అంటే.. భాగ్యం పంపిస్తుంది. ఆ ధీరజ్, ప్రేమల కాపురం నాశనం అయినట్లే అని భాగ్యం అంటుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 18వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 18వ ఎపిసోడ్

రామరాజుకు చెబితే లాభం లేదు

ధీరజ్ పెళ్లి వీడియో చూసిన శ్రీవల్లి బ్రహ్మాస్త్రం కంటే పవర్‌ఫుల్ అస్త్రం దొరికిందని అనుకుంటుంది. శ్రీవల్లి అంతరాత్మ బయటకు వచ్చి ఎక్కడికి అని అడుగుతుంది. మావయ్యకు ఈ పెళ్లి వీడియో చూపించేందుకు అని చెబుతుంది శ్రీవల్లి. దాంతో ఏమవుతుంది. ధీరజ్‌పై ముందు కోప్పడుతాడు నిజమే. కానీ, ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా చేసినందుకు పొగిడే ప్రమాదం కూడా ఉందని అంతరాత్మ చెబుతుంది.

అవును కదా అని శ్రీవల్లి అంటుంది. మరి వాళ్లను శాశ్వతంగా విడగొట్టాలంటే ఎలా అని శ్రీవల్లి అడుగుతుంది. భద్రావతి వాళ్లకు చూపించు అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పి మాయం అవుతుంది అంతరాత్మ. ధీరజ్, ప్రేమలు పడుకోవడం చూసి రేపటి నుంచి ఎలా ప్రశాంతంగా పడుకుంటారో చూస్తాని అనుకుంటుంది వల్లి. అంతా పడుకున్నారా లేదా అని చెక్ చేసుకుంటుంది శ్రీవల్లి.

సైలెంట్‌గా భద్రావతి ఇంటికి వెళ్తుంది శ్రీవల్లి. భద్రావతికి కాల్ చేసి వచ్చి డోర్ తీయమంటుంది. భద్రావతి వస్తుంది. ఎందుకు వచ్చావని అడుగుతుంది. మీకు మబ్బులు వదిలిపోయే విషయం అని చెబుతుంది శ్రీవల్లి. ఏంటా సీక్రెట్ అని భద్రావతి అడిగితే.. ధీరజ్ ప్రేమకు బలవంతంగా తాళి కట్టిన వీడియో చూపిస్తుంది శ్రీవల్లి.

భద్రావతికి తెలిసిన ధీరజ్ పెళ్లి సీక్రెట్

అది చూసి భద్రావతి షాక్ అవుతుంది. మీరు ధీరజ్ మీద ప్రేమతో పెళ్లి చేసుకుందని అనుకున్నారు. కానీ, వాళ్ల పెళ్లి వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలిసిందిగా. మీ మేనకోడలు కళ్యాణ్ అనే వాన్ని ప్రేమించి మోసపోయింది. ప్రేమ పరిస్థితిని మా అత్త వేదవతి క్యాష్ చేసుకునేందుకు కొడుకుతో బలవంతంగా తాళి కట్టించింది. మీ మీద ప్రతికారంతో ఇలా చేసి పగ తీర్చుకుందని భద్రావతికి ఎక్కిస్తుంది శ్రీవల్లి.

ఇంత ద్రోహం చేస్తుందా. నా కోడలిని తీసుకొచ్చుకుంటా అని భద్రావతి అంటుంది. మీరెళ్లి విధ్వంసం చేసిన ప్రేమ రాదు అని శ్రీవల్లి అంటుంది. ధీరజ్ తాళి కట్టేటప్పుడు ప్రేమకు ప్రేమ లేదు. కానీ ఇప్పుడు ఉంది. పైగా పోలీస్ కేసులో అరెస్ట్ అవబోతున్న ఆడపిల్ల మెడలో తాళి కట్టి కొత్త జీవితాన్ని ప్రసాదించాడని ఉత్తమ పురుష అనే బిరుదు కొట్టేస్తాడని శ్రీవల్లి అంటుంది.

మరి నా మేన కోడలిని తెచ్చుకునేది ఎలా అని భద్రావతి అంటుంది. దానికి నా దగ్గర నాటుబాంబు లాంటి నాటు సీన్ ఉంది. టైమ్ వచ్చినప్పుడు చెబుతా. నాకు అవసరం వచ్చినప్పుడు చేయాలి. మీ అమ్మగారి బర్త్ డే ఉందిగా అని ప్లాన్ చెబుతుంది శ్రీవల్లి. మీరు ఒక్క మెట్టు దిగినట్లు యాక్టింగ్ చేస్తే మీ మేనకోడలు మీకు దక్కుద్ది. అర్థమైందా అని చెప్పి వెళ్లిపోతుంది శ్రీవల్లి.

ధీరజ్‌కు కత్తిపోట్లు

మరుసటి రోజు ఉదయం ధీరజ్ కారులో వెళ్తుంటాడు. ధీరజ్ కోసం ఒకడు కత్తి పట్టుకుని చూస్తుంటాడు. ధీరజ్ కారు ముందు ఫోన్ మాట్లాడుతూ పిట్స్ వచ్చి పడిపోయినట్లు నటిస్తాడు. అది చూసి ధీరజ్ కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. కారు కీస్ తీసుకొచ్చి అతని చేతిలో పెడతాడు ధీరజ్. దాంతో అతను తేరుకుంటాడు. ధీరజ్ వాటర్ తీసుకొస్తాడు.

ఈ గ్యాప్‌లో జేబులో నుంచి కత్తి తీసి ధీరజ్‌ను పొడుస్తాడు. ధీరజ్ రక్తపుమడుగులో కింద పడిపోతాడు. ధీరజ్ అంటూ ప్రేమ ఉలిక్కిపడి లేస్తుంది. అదంతా కల అని తెలుస్తుంది. ధీరజ్ ధీరజ్ అని కలవరిస్తుంది ప్రేమ. ఏమైంది అని ధీరజ్ అడుగుతాడు. వాటర్ ఇస్తాడు. వాటర్ తాగి ధీరజ్‌ను చూసి నీకేం కాలేదుగా. సేఫ్‌గానే ఉన్నావుగా అని కంగారుపడుతుంది ప్రేమ.

కత్తిపోట్లు ఉన్నాయా లేవా అని చూసి తేరుకుంటుంది ప్రేమ. నిన్ను ఎవరో కత్తితో పొడిచినట్లు కల వచ్చిందని భయపడిపోతుంది ప్రేమ. తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయంటారు అని వణికిపోతుంది ప్రేమ. మనం దూరమవుతావేమో, మన బంధం విడిపోతుందేమో అని భయంగా ఉందని ప్రేమ అంటే.. నాకు అంత అదృష్టం లేదే. దెయ్యాలు అంత తేలిగ్గా విడిచిపెట్టవని ధీరజ్ జోకులు వేస్తాడు.

రామరాజు ఇంటికి శారద

తర్వాత మనమంతా తేలిగ్గా విడిపోమని ధైర్యం చెబుతాడు ధీరజ్. మరుసటి రోజు ఉదయం రామరాజు ఇంటిని చూస్తుంటుంది శారద. శ్రీవల్లి యాపిల్ తింటూ ఉంటుంది. రామరాజు ఇంటికి శారద వస్తుంది. అది చూసి మనం చెప్పిన ప్లాన్ ఆచరణలో పెట్టేసిందని, మనం అంటించిన అగ్గిపుల్ల మండబోతుందని వల్లి అనుకుంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More