Illu Illalu Pillalu April 18 Episode: లారీ డ్రైవర్‌ను పంపించేసిన సేనాపతి- సాగర్‌ను 20 లక్షలు కట్టమన్న సేటు- నెల గడువు
Illu Illalu Pillalu Serial April 18th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 18వ ఎపిసోడ్‌లో తల్లి భాగ్యంను కూతురు శ్రీవల్లితోనే కొట్టిస్తాడు ధీరజ్. లారీ డ్రైవర్ ఫొటోను ధీరజ్‌కు చూపిస్తుంది నర్మద. దాంతో వెతుకులాట మొదలుపెడతాడు ధీరజ్. కానీ, లారీ డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు సేనాపతి.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో భాగ్యం కాళ్ల మీద కర్రతో నర్మద తెగ కొడుతూనే ఉంది. నొప్పే లేదు. ఆనంద బాష్పాలు అని భాగ్యం అంటుంది. దాంతో వదిన మీరు బాగా అలసిపోయారు. అయినా అత్తలో చలనం లేదు. అదే పెద్ద వదిన అయితే బలంగా ఉంది. ఆవిడ కొడుతుంది. కర్ర ఇచ్చేయండి అని ధీరజ్ అంటాడు.

తల్లిని కూతురుతో కొట్టించిన ధీరజ్
దాంతో తల్లి భాగ్యంను శ్రీవల్లి కొడుతుంది. తల్లిని కూతురుతోనే కొట్టిస్తాడు ధీరజ్. శ్రీవల్లి కొట్టడంతో అమ్మో నొప్పి అని లేచి కూర్చొంటుంది భాగ్యం. ట్రీట్‌మెంట్ బాగా పనిచేస్తోంది. రోజుకు నాలుగు పూటల బడితపూజ చేయండి అత్తయ్య లేచి పరుగెత్తుతుందని ధీరజ్ అంటాడు. తర్వాత మా అన్నయ్యను, కుటుంబాన్ని మోసం చేయడానికి సిగ్గు అనిపించడంలేదా అని ధీరజ్ తిట్టేసి వెళ్తాడు.
డ్రైవర్ గురించి తెలిసింది. ఆర్టీఏ ఆఫీస్‌లో ఎంక్వైరీ చేయించాను అని నర్మద చెబుతుంది. చందుకు యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ ఫొటోను ధీరజ్‌కు చూపిస్తుంది నర్మదా. తర్వాత రాత్రి నిద్రపట్టని ధీరజ్ ప్రేమవైపు ప్రేమగా చూస్తాడు. ప్రేమ ఇచ్చిన గిఫ్ట్ దగ్గరికి తీసుకుని తను పగులగొట్టింది గుర్తు చేసుకుంటాడు. దానికి చాలా ఫీల్ అయిన ధీరజ్ పగిలిపోయిన ముక్కలను అంటిస్తాడు.
దాంతో ఆ గిఫ్ట్ ఎప్పటిలా కనిపిస్తుంది. ఇంతలో లారీ యాక్సిడెంట్ కలలో వచ్చి ప్రేమ ఉలిక్కిపడి లేస్తుంది. ధీరజ్ ఓదారుస్తాడు. ఆ యాక్సిడెంట్ ఎవరో కావాలనే చేశారు. అందుకే అది నన్ను వెంటాడుతుందని ప్రేమ కంగారుగా అంటుంది. అది డైవర్ట్ చేసేందుకు నీకో సర్‌ప్రైజ్ చూపిస్తాను అని తను అతికించిన గిఫ్ట్ చూపిస్తాడు. అది చూసి ప్రేమ చాలా సంతోషిస్తుంది. ఎమోషనల్ అవుతుంది ప్రేమ. జరిగినదానికి ధీరజ్ సారీ చెబుతాడు.
కొత్తగా పుట్టిన ప్రేమ
మనల్ని ఏడిపించినవాళ్లే సంతోషపెట్టినప్పుడు మళ్లీ ఆ ప్రేమ కొత్తగా పుట్టినట్లు ఉంటుందట, నీ ప్రేమ కూడా నాకు అలాగే ఉందిరా ధీరజ్‌ను ప్రేమ హగ్ చేసుకుంటుంది. లైఫ్‌లో నిన్ను, నీ జ్ఞాపకాలను ఇంకెప్పుడు దూరం చేసుకునేలా ప్రవర్తించను అని ధీరజ్ అంటాడు. తర్వాత ప్రేమను పడుకోబెట్టిన ధీరజ్ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తాడు. ఆ యాక్సిడెంట్ గురించి తెలియాలంటే వెంటనే వీడిని పట్టుకోవాలి అని ధీరజ్ అనుకుంటాడు.
మరుసటి రోజు ఉదయం లారీ డ్రైవర్‌ను కొట్టి ఆ అమ్మాయిని ఎందుకు గుద్దావురా అని సేనాపతి తిడతాడు. నా తప్పు ఏం లేదు. ఆ అమ్మాయే సడెన్‌గా వచ్చిందని లారీ డ్రైవర్ అంటాడు. ఆ అమ్మాయికి ఏం కాలేదు కాబట్టే బతికిపోయావని సేనాపతి అంటాడు. మరోవైపు లారీ డ్రైవర్ ఫొటోను తన ఫ్రెండ్స్‌కు చూపించి వాడిని పట్టుకోవాలని ధీరజ్ చెబుతాడు. ఇంకోవైపు నీకోసం ఎవరైనా వెతక్కుంటూ వస్తే నేను దొరికిపోతాను. వెంటనే వేరే స్టేట్‌కు వెళ్లిపో అని లారీ డ్రైవర్‌కు డబ్బు ఇస్తాడు సేనాపతి.
ఒకవేళ నువ్వు దొరికి నా పేరు గనుక బయటకొచ్చిందే అదే నీకు చివరి రోజు అవుతుంది అని వార్నింగ్ ఇచ్చి వేరే రాష్ట్రానికి వెళ్లమని చెప్పి వెళ్లిపోతాడు సేనాపతి. మరోవైపు తన ఫ్రెండ్స్‌కు లారీ డ్రైవర్‌ను పట్టుకోమ్మని ధీరజ్ చెబుతాడు. ఇంకోవైపు నర్మదకు నగల షాపు సేటు కాల్ చేసి సాగర్ చూపించిన పొగరు, బలుపు గురించి చెబుతాడు. సాగర్ డబ్బులు విసిరికొట్టింది, రామరాజుకు చెప్పినదాని గురించి సాగర్ గొడవ పడింది చెబుతాడు సేటు.
సాగర్ 20 లక్షల అప్పుకు గడువు
సేటుకు 30 వేలు ఇచ్చిన సాగర్ మిగిలిన ఇంట్రెస్ట్, వచ్చె నెలతోపాటు కట్టేస్తానని చెబుతాడు. నీకు వచ్చే 60 వేల జీతంతో 90 వేలు ఎలా కడతావని సేటు అడుగుతాడు. నేను గవర్నమెంట్ ఉద్యోగిని ఎలాగైనా ఇస్తాను అని సాగర్ అంటాడు. నేను మీ నాన్న మొహం చూసి ఇచ్చాను. ఉద్యోగం ఉందని కాదు. చూస్తుంటే నీకు మీ నాన్నకు ఏదో గొడవ ఉన్నట్లుంది. ఇదేదో తేడాగా ఉంది. వచ్చే నెల ఇదే డేట్‌కల్లా నేను ఇచ్చిన రూ. 20 లక్షలు ఇవ్వాలి అని సేటు అంటాడు.
నెల రోజుల్లో ఎలా ఇస్తానని సాగర్ అంటాడు. ఇప్పటికే చాలా మాట్లాడావ్. నెలరోజుల్లో నా 20 లక్షలు ఇవ్వకుంటే మర్యాదగా ఉండదు వెళ్లు అని తిట్టి పంపిస్తాడు సేటు. దాంతో సాగర్ సైలెంట్‌గా వెళ్లిపోతాడు. అదంతా నర్మదకు చెబుతాడు సేటు. ఉద్యోగం ఉందన్న పొగరుతో అలా చేశాడు. సరిగ్గా నెల రోజుల్లో అప్పు తీర్చాలి అని సేటు కాల్ కట్ చేస్తాడు. లోన్ అప్లై చేస్తుంటే రెజెక్ట్ అవుతుంది. నెల రోజుల్లో 20 లక్షల అప్పు ఎలా తీర్చాలి అని నర్మద కంగారుపడుతుంది.
రోడ్ మీద వెళ్తున్న ధీరజ్‌కు ఎస్సై ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయని తెలుస్తుంది. దాంతో వెళ్లి ప్రేమ హాల్ టికెట్ నెంబర్ చెప్పి చెక్ చేయిస్తాడు ధీరజ్. కానీ, ప్రేమ ఫెయిల్ అయిన వాళ్లలో లాస్ట్ ప్లేసులో ఉందని ఇంటర్నెట్ షాప్ అతను చెబుతాడు. దాంతో పులిహార చేసేశావు కదే అని తిట్టుకుంటాడు ధీరజ్. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


