Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో వేదవ‌తి ఎక్కడ? ప్రేమ‌కు యాక్సిడెంట్ జ‌రిగినా కనిపించని ఆమని

Illu Illalu Pillalu: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. అయితే ఈ సీరియల్ ప్రధాన పాత్రల్లో ఒకటైన వేదవతి ఈ మధ్య కనిపించడం లేదు. ఈ క్యారెక్టర్ చేస్తున్న ఆమనికి ఏమైంది? ఆమె ఎక్కడ? అనే ప్రశ్నలు వస్తున్నాయి. 

Apr 13, 2026, 13:47:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో టాప్ సీరియల్స్ లో ఒకటిగా ఇల్లు ఇల్లాలు పిల్లలు దూసుకెళ్తోంది. రామరాజు, భద్రావతి కుటుంబం మధ్య వార్ గా ఈ సీరియల్ కొనసాగుతోంది. ఇందులో మేల్ లీడ్ రోల్ లో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ నటిస్తున్నాడు. అతనికి జోడీగా సీనియర్ నటి ఆమని నటిస్తోంది. అయితే ఇటీవల సీరియల్ లో ఆమని కనిపించడం లేదు.

ఆమని (instagram-Aamani official)
ఆమని (instagram-Aamani official)

వేదవతిగా

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సీనియర్ నటి ఆమని.. వేదవతి క్యారెక్టర్ ప్లే చేస్తోంది. రామరాజు (ప్రభాకర్) తన భార్య వేదవతిని ముద్దుగా బుజ్జమ్మ అని పిలుస్తాడు. వేదవతి ఇంట్లో పనోడిగా చేసిన రామరాజు, వేదవతిని లవ్ చేసి లేపుకొని వస్తాడు. దీంతో రామరాజుపై వేదవతి అక్క భద్రావతి పగ పెంచుకుంటుంది.

చలాకీ నటనతో

‘అంటే అన్నానంటారు కానీ’ అంటూ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో తన చలాకీ నటనతో ఆమని అదరగొడుతోంది. అయితే ఈ మధ్య ఆమని కనిపించడం లేదు. ఏప్రిల్ 8 ఎపిసోడ్ లో వేదవతి పుట్టింటికి వెళ్తుంది. ఆ తర్వాత సీరియల్ లో అసలు ఆమె పాత్రను ఎక్కడా చూపించలేదు.

ప్రేమకు యాక్సిడెంట్

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమకు యాక్సిడెంట్ అవుతుంది. చందు బావను తప్పించబోయి తాను ప్రమాదానికి గురైంది. ఈ సీరియల్ లో వేదవతి మేనకోడలే ప్రేమ. పైగా తన మూడో కొడుకు ధీరజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాంటి ప్రేమకు యాక్సిడెంట్ అయితే ఎంతో కీలకమైన వేదవతి క్యారెక్టర్ కనిపించాలి కదా. కానీ ఆమె కనిపించలేదు.

అటు పుట్టింట్లోనూ భద్రావతి, జానకి, శారదాంబ పాత్రలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ వేదవతి జాడ మాత్రం లేదు. ఈ నేపథ్యంలో ఆమని ఈ సీరియల్ మానేసిందా? అనే డౌట్లు వస్తున్నాయి.

సినిమా షూటింగ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఆమని కనిపించట్లేదని ఫ్యాన్స్ కంగారు పడాాల్సిన అవసరం లేదు. ఆమె ప్రస్తుతం పారిస్ లో సినిమా షూటింగ్ లో ఉంది. అందుకే సీరియల్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది. పారిస్ లో సినిమా షూటింగ్ లో ఉన్నట్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆమని ఎప్పటికప్పుడూ అప్ డేట్లు ఇస్తూనే ఉంది.

త్వరలోనే ఆమని తిరిగి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ షూటింగ్ లో పాల్గొనే అవకాశముంది. మళ్లీ వేదవతిగా తనదైన డైలాగ్.. ‘అంటే అన్నానంటారు కానీ’ అంటూ అలరించబోతుంది. త్వరలోనే మళ్లీ సీరియల్ లో కనిపించనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More