Illu Illalu Pillalu July 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- భాగ్యం చేతికి ధీరజ్, ప్రేమ పెళ్లి వీడియో- నిలదీసిన రామరాజు!
Illu Illalu Pillalu Serial July 17th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 17వ ఎపిసోడ్‌లో ధీరజ్, ప్రేమ పెళ్లి చేసుకున్న హోటల్‌కి వెళ్లి రిసెప్షన్‌కు మొత్తంగా 40 వేలు లంచం ఇస్తారు భాగ్యం, ఆనందరావు. దాంతో ధీరజ్, ప్రేమల రహస్యపు పెళ్లి వీడియో సీసీటీవీ వీడియోను భాగ్యం ఇస్తుంది రిసెప్షనిస్ట్.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో హోటల్‌కి వెళ్లిన ధీరజ్, ప్రేమలు పెళ్లయిన గది తాళాలు తీసుకుని లోపలికి వెళ్తారు. రూమ్‌లోకి వెళ్లిన ధీరజ్, ప్రేమ ఇదివరకు గదిలో ఉండటం, పోలీసులు రావడం, తాళి కట్టడం, పోలీసులు రావడం గుర్తు చేసుకుంటారు. ఇద్దరు ఎమోషనల్ అవుతారు.

ధీరజ్, ప్రేమ కాపురంలో నిప్పులు
తర్వాత బయటకు వస్తారు. మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, ఒకరి చేతిని మరొకరు వదలకూడదని అనుకుంటారు. కారులో వెళ్లిపోతారు. అక్కడే ఉన్న భాగ్యం, ఆనందరావు హా మీరు అనుకుంది జరగనిస్తామా. మీ కాపురంలో నిప్పులు పోసి మీరు సంతోషంగా లేకుండా చేస్తామంటారు. హోటల్ దగ్గర కాపు కాస్తారు ఇద్దరు.
ఇడ్లీ బాబాయ్ నిద్రపోతే భాగ్యం గిల్లి లేపుతుంది. ఏంటీ ఈ మోటు సరసం అంటాడు. మేనేజర్ దగ్గరికి వెళ్లి ధీరజ్, ప్రేమల పెళ్లి రహస్యం గురించి తెలుసుకుందామనుకున్నాంగా అని భాగ్యం అంటుంది. హోటల్‌కి వెళ్లి రిసెప్షన్ దగ్గర ధీరజ్, ప్రేమల పెళ్లి రహస్యం అడుగుతారు. అందుకు పదివేలు ఇస్తారు. అడిగితే చెబుతారు మరీ అని రిసెప్షన్ అంటుంది.
మరోవైపు పదివేలు తీసి ఇస్తాడు ఇడ్లీ బాబాయ్. దాంతో ఆరోజు చాలా పెద్ద ఇష్యూ జరిగింది. అది బయటకు చెబితే నాకు ఇష్యూ అవుతుంది అని రిసెప్షన్ అంటే.. మరో పదివేలు ఇస్తారు. దాంతో 30 వేలకు జరిగింది అంతా చెప్పేస్తుంది రిసెప్షన్. కల్యాణ్ అనేవాడు ప్రేమను ప్రేమించి తీసుకురావడం, ప్రేమను అమ్మేసి వెళ్లిపోయాడు. ప్రేమను అందులోనుంచి బయటపడేసేందుకు ధీరజ్ వాళ్ల అమ్మ అతనితో తాళి కట్టించిందని జరిగింది మొత్తం చెబుతుంది రిసెప్షనిస్ట్.
8 నెలల కిందటి వీడియో
ఆరోజు జరిగింది సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా అని భాగ్యం అడిగితే.. 8 నెలల కిందట జరిగింది ఎలా ఉంటుంది. కష్టం అని రిసెప్షన్ అంటుంది. దాంతో మరో పదివేలు ఇస్తాడు ఇడ్లీ బాబాయ్. దాంతో సీసీ ఫుటేజ్ వీడియో తీస్తుంది రిసెప్షన్. అందులో ప్రేమ మెడలో బలవంతంగా ధీరజ్ తాళి కట్టడం ఉంటుంది. ఈ వీడియో తీసుకెళ్లి వాళ్ల సంగతి చెప్తా అని భాగ్యం అనుకుంటుంది.
మరోవైపు వేదవతి కంగారుపడుతుంటుంది. అది చూసి శ్రీవల్లి నవ్వుతుంది. పక్కనే అమూల్య చదువుకుంటుంది. విశ్వ సైగలు చేస్తాడు. బతిమిలాడుకుంటాడు. అమూల్య పక్కకు తిరిగి చదువుకుంటుంది. ఇంతలో రామరాజు భోజనం వడ్డించమంటుంది. అన్నీ అక్కడే ఉన్నాయని వేదవతి చెబుతుంది. మార్కులు కొట్టేద్దామని శ్రీవల్లి వెళ్లి వడ్డిస్తుంది.
ఏమైంది, ఎందుకు కంగారుపడుతున్నాం అని రామరాజు అడిగితే.. చిన్నోడు, ప్రేమ రాలేదని నోరు జారుతుంది వేదవతి. ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని అడిగితే ఏం చెబుతారు అని నర్మద వారిస్తుంది. ఇంకా రాకపోవడం ఏంటని రామరాజు అడిగితే.. షాపింగ్‌కు వెళ్లారని వేదవతి అబద్ధం చెబుతుంది. ఇంతలో ధీరజ్, ప్రేమ వస్తారు.
కేసు ఏంటన్న రామరాజు
పోలీసులు ఎందుకు పిలిచారని వేదవతి అడుగుతుంది. ఏదో వేరే కేసు గురించి ఎంక్వైరీ అని ధీరజ్ అంటాడు. హమ్మయ్య ఆ కేసు గురించేమో అనుకుని హడలిపోయానని వేదవతి అంటుంది. తిరిగి చూసే సరికి రామరాజు ఉంటాడు. వేదవతి మరింత భయపడిపోతుంది. చిన్నోడ కేసు ఏంట్రా అని రామరాజు నిలదీస్తాడు.
ట్రాఫిక్ పోలీసులు, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతున్నారు. లేకుంటే కేసులు పెడుతున్నారని ధీరజ్ కవర్ చేస్తాడు. మీరు షాపింగ్‌కు వెళ్లారని అత్తయ్య చెప్పింది. కవర్స్ లేవేంటీ అని శ్రీవల్లి ఇరికిస్తుంది. షాపులు మూసేశారు. తిరిగినదాంట్లో నచ్చలేదని ప్రేమ చెబుతుంది. ఇంకా గుచ్చి గుచ్చి అడుగుతుంది శ్రీవల్లి. దాంతో వేదవతి తిడుతుంది.
నీకెందుకు అని శ్రీవల్లిని వారిస్తుంది వేదవతి. అందరిని తినమని అరుస్తుంది వేదవతి. రేపు మీకు ఉంటుంది అని శ్రీవల్లి అనుకుంటుంది. వీడియో చూసి సంబరపడిన భాగ్యం శ్రీవల్లికి కాల్ చేసి ప్రేమ, ధీరజ్ పెళ్లిలో సినిమా లెవెల్‌లో ట్విస్టులు ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో కూడా సంపాదించాం అని అంటుంది.
శ్రీవల్లికి ధీరజ్, ప్రేమల పెళ్లి వీడియో
అవునా, ఆ రహస్యాన్ని ఎప్పుడు బయటపెట్టాలా, ఎప్పుడు సునామీ సృష్టించాలా అని చూస్తున్నా. వెంటనే పంపించండి అని శ్రీవల్లి అంటుంది. పంపిస్తాం అమ్మడు అని భాగ్యం అంటుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


