Illu Illalu Pillalu August 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు..ఏడిపించేసిన ప్రేమ-వేదవతి బాధ-లవ్ ఇడ్లీలతో రెడ్ హ్యాండెడ్ గా

Illu Illalu Pillalu August 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 6 ఎపిసోడ్ లో ప్రేమ, ధీరజ్ మళ్లీ గొడవ పడతారు. అత్తారింటి ముందు ప్రేమ ముగ్గు వేస్తుంది. మరోవైపు తిరుపతి కోసం సుకన్య లవ్ ఇడ్లీలు చేస్తుంది. అమూల్యను ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ చూసేయండి.

Published on: Aug 6, 2026, 07:53:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu August 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో.. ఫుల్ గా తాగి గేటు దగ్గరే పడుకున్న ధీరజ్, తిరుపతిపై ప్రేమ కోపంతో నీళ్లు పోస్తుంది. వర్షం పడుతుంది అల్లుడూ అంటూ ధీరజ్ ను మామ లేపుతాడు. ఇది వాన దేవుడి వాన కాదు అల్లుడు, మా అమ్మాయి నిప్పుల వాన అని తిరుపతి అంటాడు. కళ్లు కనిపించట్లేదా? ఎంత పొగరే నీకు. ఒళ్లు ఎలా ఉందని ప్రేమ పైపైకి వెళ్తాడు ధీరజ్.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడేె ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడేె ఎపిసోడ్ (jiohotstar)

ధీరజ్ బిల్డప్

రాత్రి మందు తాగి ఎక్స్ ట్రాలు చేశావురా అని ధీరజ్ ను తిరుపతి ఆపుతాడు. దీంతో ధీరజ్ తగ్గుతాడు. తెలియక తప్పు చేశావనుకోని వదిలేస్తున్నానని ధీరజ్ తెగ బిల్డప్ ఇస్తాడు. అప్పుడే వచ్చిన శారదాంబ నీళ్లతో ఆడుకుంటూ, రొమాన్స్ స్టార్ట్ చేశారా? అని అడుగుతుంది. వాడు నా మొగుడే కాదు. నేను వాడి పెళ్లాన్ని కాదని రాత్రి అన్నాడని శారదాంబతో ప్రేమ చెప్తుంది.

నా మొగుడివి కాదు

వాడికే అంత బలుపు, పొగరు ఉంటే, నాకెంత ఉండాలి. నువ్వు నా మొగుడివి కాదు కాదు అని ప్రేమ అరుస్తుంది. అదే నీ స్టేట్మెంట్ అయితే నా స్టేట్మెంట్ కూడా విను. రాత్రి మందు ఎక్కువై చెప్పడం కాదు. ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు నా పెళ్లానివి కాదు అని ధీరజ్ అనడంతో ప్రేమ కోపంతో ఊగిపోతుంది. అప్పుడు వచ్చిన వేదవతి ఏమో ధీరజ్ ను లోపలికి పంపిస్తుంది.

ప్రేమకు ప్రేమ

ప్రేమ ఏంటే ఇదే? గొడవ చక్కదిద్దుకోవాలి కానీ ఎందుకు పెద్దది చేసుకుంటున్నారని వేదవతి అడుగుతుంది. అయినా ముగ్గు వేయడానికి నువ్వు వచ్చావేంటీ? నీ పెద్ద కోడలు ఇంటి దీపాన్ని. కంటి కార్పూరాన్ని అంటూ ఎగురుకుంటూ వస్తుంది కదా అని ప్రేమ అడుగుతుంది. నేను వేస్తాను ఉండూ అని అత్త వాకిట్లో కళ్లాపి చల్లుతుంది. ఎంత పుట్టింట్లో ఉన్నా అత్త ఇంటి మీద ప్రేమ ఏంటో అని నర్మద అంటుంది.

ప్రేమ ముగ్గు

ప్రేమ, నర్మద కలిసి ముగ్గు వేస్తారు. వాడు నిన్ను పెళ్లాం కాదని అంటే రుసరుసలాడుతున్నావ్. మరి ఎందుకు దూరంగా ఉంటున్నావని ప్రేమను వేదవతి అడుగుతుంది. నువ్వు అసలు నీ కొడుకును పట్టించుకుంటున్నావా? రాత్రి తాగి ఇక్కడే పడుకున్నాడని అత్తపై అరుస్తుంది ప్రేమ. అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకే కోపంగా ఉండటం అని వేదవతి అడుగుతుంది. ఒకప్పుడు ప్రేమ ఉండేది, దాన్ని వాడు కోపంగా మార్చేశాడని ప్రేమ చెప్తుంది.

కన్నీళ్లతో ఇంట్లోకి

ధీరజ్ మీద కోపం ఉంటే మాతో కలిసి ఉండటానికి ఏంటి ప్రాబ్లెం అని నర్మద అడుగుతుంది. ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే. అదేదో ఇప్పుడే రావొచ్చు కదా అని వేదవతి కూడా అంటుంది. నా వ్యక్తిగత జీవితాన్ని నలుగురిలో పెట్టిన వాడితో కలిసి బతకలేనని ప్రేమ ఏడుస్తూ పుట్టింట్లోకి వెళ్లిపోతుంది.

ముట్టుకుంటే ముద్దు

మరోవైపు సుకన్య కోసం భాగ్యం ఇంటికి వెళ్తాడు తిరుపతి. తిరుపతికి దొరకకుండా సుక్కు దాగుడుమూతల ఆటలు ఆడుతుంది. ముట్టుకుంటే ముద్దు, పట్టుకుంటే హగ్ ఇస్తానని తిరుపతికి దొరకకుండా సుక్కు పరుగులు పెడుతుంది. పట్టుకోలేక తిరుపతి ఆయాసపడతాడు. నొప్పులు అంటూ మంచంపై కూర్చుంటాడు. తిరుపతి కోసం సుక్కు లవ్ ఇడ్లీలు తయారు చేస్తుంది. ఒకరికొకరు తినిపించుకుంటారు.

అప్పుడు భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఇంటికి వస్తారు. తిరుపతి బైక్ చూసి షాక్ అవుతారు. లోపలికి వెళ్లి ఏం చేస్తున్నారని తిరుపతిని భాగ్యం కడిగేస్తుంది. మీ వాళ్లను ఒప్పిస్తే సరే సరి. లేదంటే సుక్కును ఇంటికి పంపిస్తానని భాగ్యం చెప్తుంది. ఆషాడం అవగానే పెళ్లి. మీ మేనకోడలిని మా ఇంటి కోడలిగా పంపించేందుకు రెడీగా ఉండమని చెప్పి తిరుపతి వెళ్లిపోతాడు.

విశ్వ ప్లాన్

అమూల్య కోసం విశ్వ మళ్లీ కాలేజీకి వెళ్తాడు. నీకు బుద్ధి రావడం లేదు. నమ్మించడానికి డ్రామాలు ఆడుతున్నావని అమూల్య ఫైర్ అవుతుంది. మా అమ్మ మీద ఒట్టు. మీ అన్నయ్య, ప్రేమను కలపడానికే చూస్తున్నా. నిన్ను ఇబ్బంది పెట్టను. మనం ట్రై చేస్తే వాళ్లను కలపొచ్చు. నా దగ్గర ప్లాన్ ఉందని విశ్వ అంటాడు. కానీ అమూల్య మాత్రం నమ్మదు.

నేను మారాను. మీ సాగర్ అన్నయ్య నన్ను కొట్టినా నేను సైలెంట్ గా ఉన్నా. మా నాన్నను ధీరజ్ కొట్టినా నేను గొడవ సర్దుమణిగేలా చూశా కానీ మీ అన్నయ్యను ఒక్క మాట కూడా అనలేదు. నేను పాత విశ్వనే అయితే మొన్న మీ ఇంట్లో రక్తపాతం జరిగేదని విశ్వ చెప్పడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More