Bigg Boss 10: ఆడపిల్లను పట్టుకుని ఆడంగి పనులు- రోహిత్ మొహంపై ఉమ్మేసిన హీరో త్రిగుణ్- ఎప్పటిలాగే నాగార్జున పొగుడుతారా?
Bigg Boss Telugu 10 September 28 Episode: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ రోజురోజు గొడవలు, వాగ్వాదాలతో నువ్వా నేనా అన్నట్లు సాగిపోతుంది. ఇక తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 28 ఎపిసోడ్‌లో అయితే, హీరో త్రిగుణ్ వర్సెస్ కామనర్ రోహిత్ ఫైట్ అయితే చాలా ఘోరంగా మారిపోయింది. ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.
Bigg Boss Telugu 10 Trigun Vs Rohit Nagarjuna Reaction: టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా మారిన బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ రోజు రోజు రచ్చ రచ్చగా మారిపోతుంది. కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు, గొడవలు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి.

టోటల్ డామినేషన్
ఇక తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 28 ఎపిసోడ్‌లో అయితే త్రిగుణ్ వర్సెస్ రోహిత్ ఫైట్ మరి ఘోరంగా మారిపోయింది. బిగ్ బాస్‌లో ఈ వారం టోటల్ డామినేనష్ అనే అవతారాన్ని ప్రవేశపెట్టాడు బిగ్ బాస్. దీనికి సంబంధించి కొన్ని టాస్కులు ఇస్తాడు. అందులో గెలిచిన టీమ్ వారమంతా ఫుల్ డామినేషన్ చేయాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగా మొత్తంగా 15 మంది హౌజ్ కంటెస్టెంట్స్‌ను రెండు టీమ్స్‌గా విభజించాడు బిగ్ బాస్. రెడ్ టీమ్ భైరవలో అపూర్వ, రోహిత్, అమన్, ఝాన్సీ, వర్షిణి, సుధీర్, రామ్ ప్రసాద్, వంశీ 8 మంది ఉంటే.. బ్లూ గ్రూమ్ సప్తశక్తిలో త్రిగుణ్, దెబ్జానీ, శాలిని, సృష్టి, చరణ్, జబర్దస్త్ నరేష్, ముఖేష్ గౌడ ఉన్నారు.
డ్యాగర్స్‌ను కాపాడుకోవాలి
వీరందరికి బిగ్ బాస్ డ్యాగర్స్ (కత్తులు) పంపించాడు. చెరొకటి ప్రతి ఒక్కరుదాచుకోవాలి. ఒక సమయం తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ డ్యాగర్స్ ఉంటే వాళ్లు గెలిచినట్లు. ఈ క్రమంలో బిగ్ బాస్ కొన్ని కీలక మార్పులు చేయడం లేదా మద్దతు ఇవ్వడం వంటివి చేస్తానన్నాడు. గేమ్ స్టార్ట్ అయింది.
జబర్దస్త్ నరేష్ దగ్గర సరదాగా అంటూ చెప్పి పక్కకు తీసుకెళ్లి డ్యాగర్‌ను లాక్కున్నారు రోహిత్ టీమ్. అది తెలిసి ఝాన్సీ ఒక్కదానిపై ఫిజికల్ అవుతూ త్రిగుణ్ తీసుకోడానికి ట్రై చేశాడు. బాత్రూమ్ దగ్గర శాలిని, సృష్టి కూడా ట్రై చేశారు. చాలా సేపు వాగ్వాదం తర్వాత నరేష్ డ్యాగర్ అతనికి ఇచ్చేశారు రోహిత్ టీమ్.
మెడికల్ రూమ్‌కి సృష్టి
దీని తర్వాత గార్డెన్ ఏరియాలో ఒక రథాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుందని, అందుకోసం కావాల్సిన బార్స్ (చిన్నసైజు ఇటుకల రూపంలో ఉండేవి) పంపిస్తారని ఎవరు ఎక్కువ బార్స్ కలెక్ట్ చేస్తే వారు రథాన్ని పూర్తి చేసే ఛాన్స్ దొరుకుతుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. బార్స్ గేమ్‌కి రోహిత్, శాలిని సంచాలకులుగా ఉంటారు.
బార్స్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అందరూ కలసి లాక్కోవడం, ఫౌల్ గేమ్స్ ఆడటం జరుగుతుంది. ఇదే క్రమంలో సృష్టిపై ఎక్కువ ఫిజికల్ ఫోర్స్ పడుతుంది. దాంతో తను మెడికల్ రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంది. గేమ్ పాజ్ చేస్తారు. మెడికల్‌కి వెళ్లేముందు తన డ్యాగర్‌ను శాలినికి ఇచ్చి వెళ్తుంది. ఇద్దరు గుసగుసలాడి శాలిని తీసుకొని వస్తుంది. శాలిని సైలెంట్‌గా రావడం చూసిన అపూర్వ రోహిత్‌కి చెబుతుంది.
నిజం చెప్పని శాలిని
శాలిని మనలో ఎవరిదో డ్యాగర్ తీసుకున్నట్లు పొరపాటు పడి అదే విషయం రోహిత్‌కు చెబుతుంది. దానికి శాలిని దగ్గరికి వెళ్లిన రోహిత్ డ్యాగర్ తీశావా అని మూడుసార్లు అడుగుతాడు. దానికి శాలిని ఏం చెప్పకుండా త్రిగుణ్ అంటూ అరుస్తుంది. దాంతో శాలిని నిజంగానే డ్యాగర్ కొట్టేసిందనుకుని లాక్కునేందుకు ట్రై చేస్తాడు రోహిత్ అండ్ తన టీమ్.
త్రిగుణ్ వచ్చి డిఫెన్స్ చేస్తాడు. పెద్ద రచ్చ జరుగుతుంది. చాలా సేపు గొడవ తర్వాత అది సృష్టిది అని శాలిని చెబుతుంది. అది సృష్టిది అని ముందే చెబితే మేము ఎందుకు ట్రై చేసేవాళ్లం అని రోహిత్, అపూర్వ వాదిస్తుంటారు. అపూర్వ కావాలనే ఇదంతా చేసిందని శాలిని ఏడుస్తుంటుంది.
ఆడంగోడూ.. విప్పి చూపించు..
ఇదే గ్యాపులో బార్స్ గేమ్ ఆడేటప్పుడు రోహిత్‌ను రెచ్చగొడతాడు త్రిగుణ్. ఆడంగోడిలా ఆడటం, ఆడపిల్లల మీదకు వెళ్లడం, ఆడంగోడూ.. విప్పి చూపించు.. మగాడివి కాదా అంటూ జెండర్‌ని ఇన్సల్ట్ చేస్తూ చప్పట్లు కొడతాడు. నీకు అదే కరెక్ట్ అని రోహిత్ కోపంగా కౌంటర్ ఇస్తాడు. ఏంటీ కొడతావా.. కొడతావా అని త్రిగుణ్ అంటే.. బయట అయితే కొట్టేవాడిని అని రోహిత్ అంటాడు.
ఆడంగి ఆటలు, ఆడపిల్లపై ప్రతాపం అని త్రిగుణ్ అంటుంటే రోహిత్ కోపాన్ని కంట్రోల్ చేసుకుని అలాగే ఉండిపోతాడు. త్రిగుణ్ అంతటితో ఆగకుండా ఆడపిల్లల మీదకు వెళ్లడం ఏంటీ అనుకుంటూ కాండ్రించి రోహిత్ పక్కకు ఉమ్మేస్తాడు. అది కొంచెం రోహిత్‌పై పడుతుంది. తనపై పడిన విషయం నామినేషన్స్‌లో మాత్రమే రోహిత్ చెప్పాడు.
నాగార్జున ఎలా స్పందిస్తాడు?
నిన్నటి ఎపిసోడ్‌లో అది తెలియలేదు. ఉమ్మేసిన తర్వాత కూడా శాలిని ఐ లవ్యూ శాలిని ఐ లవ్యూ అంటూ మరో కంటెస్టెంట్ శాలినితో రోహిత్ ఉండటాన్ని విచిత్రమైన చేష్టలతో చేసి చూపిస్తాడు త్రిగుణ్. రోహిత్ ఏమనకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. కాసేపటికి నేను శాలినిపైకి వెళ్తానా. ఇది ఒక్కటి ఆలోచిస్తే తెలిసిపోతుంది. రేపు వీడియోలో అంతా తెలుస్తుందని రోహిత్ వెళ్లిపోతాడు.
ఇలా త్రిగుణ్ నానా రచ్చ చేశాడు. దారుణంగా రోహిత్‌పై మాటలు జారడమే కాకుండా ఉమ్మేశాడు కూడా. ఇప్పుడు దీనిపై హోస్ట్ నాగార్జున ఎలా స్పందిస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రతి వీకెండ్‌లో కేవలం రోహిత్ తప్పులను మాత్రమే వీడియోలతో బయటపెడుతూ.. త్రిగుణ్, ముఖేష్, వర్షిణి, దేబ్జానీ ఎన్ని మాటలు జారిన ప్రస్తావించకుండా సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు నాగార్జున.
త్రిగుణ్‌నే పొగుడుతాడా?
ఇదే విషయంపై మొదటి నుంచి సోషల్ మీడియాలో తెగ విమర్శలు వస్తున్నాయి. అగ్ని పరీక్షను ఛీ ఛీ అని త్రిగుణ్ అన్నప్పుడే నాగార్జున వార్నింగ్ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఇలా బిహేవ్ చేసేవాడు కాదని, త్రిగుణ్ ప్రవర్తనకు నాగార్జున, బీబీ టీమే కారణమని అంటున్నారు.
రోహిత్ విషయంలో ఇంత నీచంగా ప్రవర్తించిన త్రిగుణ్‌ని ఇప్పటికైనా హోస్ట్ నాగార్జున వారిస్తారా లేదా ఎప్పటిలాగే ఫ్రంట్ ఫూట్ వచ్చి చాలా గొప్పగా ఆడుతున్నాడని పొగుడుకుంటూ సపోర్ట్ చేస్తారా అనేది బీబీ ఆడియెన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


