Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు- ఎలిమినేషన్ ట్విస్ట్- మా ఎంగిలి ఎవరు కడగమన్నారన్న రోహిత్!

Bigg Boss Telugu 10 Commoners Vs Celebrities: ప్రారంభం నుంచే బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ రచ్చ రంబోల అన్నట్లుగా సాగుతోంది. బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 7 ఎపిసోడ్‌లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్లుగా మారిపోయింది. మహాపరీక్షకు ఎదుర్కొనే సమయంలోనే మొదలైన గొడవ రెండు గ్రూపులుగా విడిపోయేలా చేసింది.

Published on: Sep 7, 2026, 20:31:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Telugu 10 Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ దశావతారం అన్నట్లుగా ప్రారంభం నుంచే జోరుగా సాగుతోంది. ఆది నుంచే కంటెస్టెంట్స్ అంతా తమలోని అవతారాలను బయపెట్టేస్తున్నారు. బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 7వ తేది ఎపిసోడ్‌లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలుగా వివాదం రాజుకుంది.

బిగ్ బాస్‌లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు- ఎలిమినేషన్ ట్విస్ట్- మా ఎంగిలి ఎవరు కడగమన్నారన్న రోహిత్!
బిగ్ బాస్‌లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు- ఎలిమినేషన్ ట్విస్ట్- మా ఎంగిలి ఎవరు కడగమన్నారన్న రోహిత్!

మహాపరీక్షను ఎదుర్కోవాలి

"మహాపరీక్ష ఇప్పటికే మొదలైందని మీకు తెలుసు. మీరు హౌజ్‌మేట్స్‌గా మారాలంటే.. ఈ మహాపరీక్షను ఎదుర్కొవాలి. మీరంతా రెండు జట్లుగా విడిపోవాల్సి ఉంటుంది. ఎవరు మీ నాయకులుగా ఉంటే మీరు హై రిస్క్ నుంచి లో రిస్క్‌లోకి రాగలరని భావిస్తున్నారో.. అలాంటి ఇద్దరు సభ్యులను మీరు నాయకులుగా ఎంచుకోండి" అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.

దీంతోపాటు ఎలిమినేషన్ ట్విస్ట్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. "ఈ మహాపరీక్ష మీ ఊహలకు అందకుండా ఉంటుంది. ఎలిమినేషన్ మాత్రం కచ్చితం" అని షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా ఎవరిద్దరిని ఎన్నుకోవాలో ఓటింగ్ పెట్టుకున్నారు.

రోహిత్‌కు నాలుగు ఓట్లు

కామనర్ అయిన రోహిత్ నాయుడు పట్నం లేచిన రామ్ ప్రసాద్‌కు ఎవరు ఓట్ చేస్తారో చేయి లేపమన్నాడు. మూడు పేర్లు ఉన్నాయని త్రిగుణ్ చెప్పాడు. త్రిగుణ్ అనుకున్నవాళ్లు చేయెత్తండని రోహిత్ అన్నాడు. తర్వాత రోహిత్ పేరు చెప్పినాళ్ల గురించి అమన్ మసూద్ అన్నాడు. రోహిత్‌కు నాలుగు ఓట్లు వచ్చాయి.

"ఇద్దరిలో ట్రై బ్రేక్ డార్లింగ్ నువ్వే" అని రోహిత్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు త్రిగుణ్. తర్వాత కామనర్ అయిన రోహిత్‌కు అగ్నిపరీక్ష వాళ్లందరూ ఓట్లు వేశారని, ఇదంతా ఒక గ్రూప్‌లా అనిపిస్తుందని త్రిగుణ్ చెప్పాడు. "అదంతా తప్పు అండి. ఒకసారి వినండి" అంటూ శాలిని పటేల్ చెప్పుకొచ్చింది.

మీరు చెప్పేది వినట్లేదు

"అవును మీకు మీరే సపోర్ట్ చేసుకున్నారు" అని త్రిగుణ్ అరిచాడు. "మీ సమస్య ఏంటో చెప్పనా.. మీరు ఎదుటివాళ్లు చెప్పేది వినట్లేదు" అని శాలిని అంది. "నేను అగ్నిపరీక్ష నుంచి వచ్చిన అమ్మాయికి ఓట్ వేశాను. అందులోనుంచి వచ్చిన ఒకామే నాకు ఓటేసింది" అని త్రిగుణ్ చెబుతున్నాడు.

"మీకు అలా అనిపించింది మాకు ఇలా అనిపించింది" చరణ్ మహదేవ్ అన్నాడు. ఈ మాటల వాగ్వాదం కాస్తా గొడవకు దారి తీసింది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్లుగా మారిపోయింది. "మీకు ఎలా తెలుసు రోహిత్ బాగా ఆడతాడని, అగ్ని పరీక్ష ద్వారానేగా" అని త్రిగుణ్ తన మాటలకు వివరణ ఇచ్చుకున్నాడు.

మిమ్మల్ని ఎవరు కడగమన్నారు

"రూల్స్ పెట్టడమేనా పాటించరా" అని రోహిత్ వాయిస్ రేయిజ్ చేశాడు. "మీరు చేశారా, మిమ్మల్ని కడగమంటే మీరు కడిగారా" అని త్రిగుణ్ అన్నాడు. "కడగం. మీరు ఎంగిలి చేస్తే కడగాలా" అని రోహిత్ వాదించాడు. "ఎంగిలి చేస్తే కడగాలా అనడం కరెక్ట్ కాదు" అని టెంపర్ వంశీ మధ్యలోకి వచ్చాడు.

"మీరు ఎంగిలి కడగరు మేము కడగాలి 15, 16 కప్పులు" అని త్రిగుణ్ అన్నాడు. "కడగడం ఎందుకు, ఎవరు కడగమన్నారు" అని రోహిత్ అన్నాడు. దాంతో త్రిగుణ్ షాక్ అయి చూశాడు. అలా నేటి బిగ్ బాస్ తెలుగు 10 ఎపిసోడ్ ప్రోమో ముగిసింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More