Zeenat Aman: నా బాడీని చూపించడానికే వాళ్లు ఎక్కువ ఆసక్తి చూపారు.. సెక్స్ సింబల్‌గా మార్చేశారు: అలనాటి నటి జీనత్ అమన్

Zeenat Aman: బాలీవుడ్ అలనాటి నటి జీనత్ అమన్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో డైరెక్టర్లు తన శరీరాన్ని చూపించడానికే ఎక్కువ ఇష్టపడ్డారని, తనను ఓ సెక్స్ సింబల్ గా మార్చేశారని ఆమె అనడం గమనార్హం.

Published on: Jun 30, 2026, 18:01:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Zeenat Aman: బాలీవుడ్ లెజెండరీ యాక్ట్రెస్ జీనత్ అమన్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత దారుణమైన పరిస్థితులపై ఓపెన్ గా మాట్లాడింది. ఒకప్పుడు వెండితెరను తన గ్లామర్‌తో ఊపేసిన ఈ సీనియర్ బ్యూటీ.. రీసెంట్‌గా సుభ్ర అయ్యప్ప యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ మేకర్స్ తనను ఎలా వాడుకున్నారో ఓపెన్‌గా చెప్పేసింది. స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయిన తన గ్లామర్ ఇమేజ్‌కు, రియల్ లైఫ్‌లో తనకున్న పర్సనాలిటీకి అస్సలు సంబంధమే లేదంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది.

Zeenat Aman: నా బాడీని చూపించడానికే వాళ్లు ఎక్కువ ఆసక్తి చూపారు.. సెక్స్ సింబల్‌గా మార్చేశారు: అలనాటి నటి జీనత్ అమన్ (Instagram)
Zeenat Aman: నా బాడీని చూపించడానికే వాళ్లు ఎక్కువ ఆసక్తి చూపారు.. సెక్స్ సింబల్‌గా మార్చేశారు: అలనాటి నటి జీనత్ అమన్ (Instagram)

కేవలం పాటలు, డ్యాన్సులు, వర్షంలో తడవడానికే చూశారు

"నా రియల్ క్యారెక్టర్‌కు, స్క్రీన్ మీద నన్ను చూపించిన దానికి మధ్య చాలా తేడా ఉండేది. నాపై 'సెక్స్ సింబల్' అనే ట్యాగ్ చాలా కాలం పాటు ఉండిపోయింది. బయట నన్ను పర్సనల్‌గా కలిసిన వాళ్లు.. నేను సినిమాలో కనిపించే పాత్రల్లాంటి దాన్ని కాదని తెలుసుకుని ఆశ్చర్యపోయేవాళ్లు" అని జీనత్ అమన్ చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో తనకున్న టాలెంట్ లేదా తెలివితేటలను గుర్తించడానికి ఎవరూ ఇష్టపడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, రెండు డైలాగులు చెప్పి వర్షంలో తడిసిపోవడానికే తనను పరిమితం చేశారని ఎమోషనల్ అయింది.

క్లీవేజ్ షో కోసం ప్రొడక్షన్ హౌస్ ఒత్తిడి

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి తన వంతుగా ఎంతో కొంత చేయాలని అనుకుంటే.. మేకర్స్ మాత్రం తన నుంచి ఎప్పుడూ గ్లామర్ యాంగిల్‌నే ఆశించారని జీనత్ అమన్ చెప్పింది. చాలా సినిమాల్లో మరింత క్లీవేజ్ షో చేయాలని, బ్యాక్ ఓపెన్ గా కనిపించేలా బట్టలు వేసుకోవాలని ప్రొడక్షన్ టీమ్స్ నుంచి ఒత్తిడి వచ్చేదని సంచలన నిజం బయటపెట్టింది.

1970లో 'మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్' కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత ఈమె బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. డాన్, యాదోం కీ బారాత్, హరే రామ హరే కృష్ణ, ఖుర్బానీ, దోస్తానా, ధరమ్ వీర్ లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ జీనత్ ఖాతాలో ఉన్నాయి.

'సత్యం శివం సుందరం' కాంట్రవర్సీ వెనుక అసలు నిజం

రాజ్ కపూర్ డైరెక్షన్‌లో వచ్చిన క్లాసిక్ మూవీ ‘సత్యం శివం సుందరం’లో తను చేసిన రూపా క్యారెక్టర్ సృష్టించిన వివాదంపై కూడా జీనత్ అమన్ ఇన్‌స్టాగ్రామ్ లో క్లారిటీ ఇచ్చింది. ఆ పాత్రలో తను కనిపించిన గ్లామర్ లుక్‌పై అప్పట్లో అశ్లీలత అనే ఆరోపణలు రావడంపై ఆమె నవ్వుకుంది.

మానవ శరీరాన్ని అందంగా చూపించడంలో అశ్లీలత ఏముంటుందని ఆమె ప్రశ్నించింది. తాను ఎప్పుడూ డైరెక్టర్స్ నటిని అని, ఆ లుక్ అంతా కేవలం క్యారెక్టర్ డిమాండ్ మాత్రమేనని స్పష్టం చేసింది. షూటింగ్ సెట్ అనేది ఎప్పుడూ శృంగారభరితంగా ఉండదని, డజన్ల కొద్దీ క్రూ మెంబర్స్ ముందు ప్రతి మూమెంట్‌ను కొరియోగ్రఫీ చేసి, రిహార్సల్స్ చేశాకే పర్ఫార్మ్ చేస్తామని అసలు విషయం బయటపెట్టింది.

ఓటీటీలో సెకండ్ ఇన్నింగ్స్.. బిజీగా మారిన లెజెండ్

ప్రస్తుతం 74 ఏళ్ల వయసులోనూ జీనత్ అమన్ సరికొత్త వెబ్ సిరీస్ ప్రాజెక్టులతో సెకండ్ ఇన్నింగ్స్ అదరగొడుతోంది. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన లగ్జరీ డ్రామా సిరీస్ 'ది రాయల్స్' లో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రియాంక ఘోష్, నుపుర్ ఆస్థానా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో భూమి పెడ్నేకర్, ఇషాన్ ఖట్టర్, సాక్షి తన్వర్ లాంటి స్టార్స్ నటించారు.

ఈ వెబ్ సిరీస్‌కు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినా.. ముఖ్యంగా భూమి పెడ్నేకర్ యాక్టింగ్ పై నెగెటివ్ కామెంట్స్ వినిపించినా, ఓవరాల్ వ్యూవర్‌షిప్ బాగుండటంతో మేకర్స్ ఇప్పుడు 'ది రాయల్స్ సీజన్ 2' కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు షబానా అజ్మీతో కలిసి ఫరాజ్ ఆరిఫ్ అన్సారీ డైరెక్షన్‌లో వస్తున్న 'బన్ టిక్కీ' సినిమాలోనూ జీనత్ అమన్ లీడ్ రోల్ చేస్తూ బిజీగా గడుపుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More