Bigg Boss Nominations: బిగ్ బాస్ 10 తెలుగులో 2 కీస్‌తో మొదలైన గొడవ- మొదటి వారం నామినేషన్లలో ఏడుగురు- ఎవరంటే?
Bigg Boss Telugu 10 First Week Nominations: బిగ్ బాస్ తెలుగు 10లో మొదటి రోజే గొడవలు మొదలైపోయాయి. రెండు కీస్‌తో మొదలైన గొడవ కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఇక బిగ్ బాస్ 10 తెలుగు మొదటి వారం నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
Bigg Boss Telugu 10 Nominations First Week: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 10 రియాలిటా షో మొదలైపోయింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ 10 తెలుగు షో సెప్టెంబర్ 6న రాత్రి 7 గంటలకు ఘనంగా ప్రారంభమైంది.

ఆరుగురు కామనర్స్, 10 మంది సెలబ్రిటీలు
ఈసారి బిగ్ బాస్ తెలుగు షోలోకి 16 మంది కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. వారిలో అగ్ని పరీక్ష 2 ద్వారా ఆరుగురు కామనర్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టగా.. మిగతా 10 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ అయిన తొలిరోజే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలైపోయాయి.
దీనికి సంబంధించిన నేటి బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 7 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అయితే, ఇప్పటికే 8 మంది కంటెస్టెంట్స్ గోల్డెన్ కీస్ గెలుచుకున్నారు. ఇంకా మిగిలిన రెండు కీస్‌ని ఎవరికి ఇవ్వాలో ఇప్పటికే పొందిన 8 మంది కంటెస్టెంట్స్ నిర్ణయించి చెప్పాలని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.
ఆ ఇద్దరికి ఇద్దాం
దాంతో ఆ 8 మంది చర్చలు మొదలుపెట్టారు. అమన్ ఆడలేడని హీరో త్రిగుణ్ అన్నాడు. తను ఆడాడు కానీ పూర్తిగా ఫినీష్ చేయలేదని కామనర్ కంటెస్టెంట్ శాలిని చెప్పింది. రీజన్ ఎందుకు ఆడలేదన్నది కాదు తను ఆడలేదు. కాబట్టి, టెంపర్ వంశీ, కృష్ణుడుకి కీస్ ఇద్దామని త్రిగుణ్ వాదించాడు.
మీరేం చేస్తున్నారు చెప్పనా.. మీరు ప్రతి ఒక్కరి పాయింట్స్ వినట్లేదని శాలిని అంది. నాకు అన్నీ తెలుసు అనే ఒకేదాంట్లోకి వెళ్లిపోయి కొంచెం తొందరపడ్డారని నాకూ అనిపించింది అని ముఖేష్ గౌడ చెప్పాడు. తర్వాత వాళ్లకు అసలు ఆడే ఛాన్స్ రాలేదు. ఆ అన్న లక్ బేసిస్ వల్ల ఆడలేదని సింగర్ ఝాన్స్ అంది.
లక్ అంటారేంటీ..
మరి నాకు కూడా లక్ ఫేవర్ చేయలేదు కదా అని రోహిత్ అన్నాడు. లక్ ఇక్కడ మేజర్ ప్లాట్ అయిందని త్రిగుణ్ అంటే.. మళ్లీ లక్ అంటారేంటీ అని రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. ఆయనకు అవకాశం రాలేదని త్రిగుణ్ అంటే.. కాదు మీరు అవకాశం ఇవ్వలేదని రోహిత్ అన్నాడు.
నువ్వు కేవలం ఆర్గుమెంట్ చేస్తున్నావ్. ఆయనకు ఆడే అవకాశం రాలేదు. అతనికి కీ ఇచ్చే అవకాశం మేము కల్పించాం అని త్రిగుణ్ చెప్పాడు. ఇది మా అభిప్రాయం, ఈ నిర్ణయం తీసుకున్నాం. ఫెయిర్‌గానే నిర్ణయం తీసుకున్నామని అనుకుంటున్నామని త్రిగుణ్ వాదించాడు.
ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో ఏడుగురు
తర్వాత మీరందరు కలిసి నిర్ణయం తీసుకున్నట్లు నాకు అనిపించలేదని యాంకర్ సుధీర్ రెడ్డి చెప్పాడు. చాలా అన్‌ఫెయిర్ డెసిషియన్ మీది అని జబర్దస్త్ రామ్ ప్రసాద్‍తో సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్ చెప్పింది. అలా ఇవాళ్టీ (సెప్టెంబర్ 7) బిగ్ బాస్ 10 తెలుగు ఎపిసోడ్ ప్రోమో ముగిసింది.
ఇకపోతే బిగ్ బాస్ 10 తెలుగు సీజన్‌లో మొదటి వారం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్లు సమాచారం. ఫస్ట్ వీక్ బిగ్ బాస్ నామినేషన్స్‌లో జబర్దస్త్ రామ్ ప్రసాద్, నటుడు కృష్ణుడు, సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్, కామనర్స్ అయిన రోహిత్ నాయుడు పట్నం, శాలిని పటేల్, సీరియల్ హీరో ముఖేష్ గౌడ, టాలీవుడ్ హీరో త్రిగుణ్ ఉన్నట్లు తెలిసింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


