Ninnu Kori September 5 Episode: నిన్ను కోరి- మాయ సరోగసీ కుట్ర విరాట్‌కు చెప్పిన డాక్టర్- శాలిని, మందరతో మాస్టర్ ప్లాన్

Ninnu Kori Serial September 5th Episode: నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 4వ ఎపిసోడ్‌‌లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. మాయ కడుపులోని బిడ్డ శాంపిల్స్‌పై అనుమానం వచ్చిన విరాట్ వెళ్లి డాక్టర్‌ను నిలదీస్తాడు. దాంతో మాయ కడుపులోని బిడ్డ విరాట్, చంద్రకళ బిడ్డ అని డాక్టర్ నిజం చెబుతుంది. విరాట్ షాక్ అవుతాడు.

Published on: Sep 5, 2026, 09:20:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మాయ ఆడుతున్న నాటకాన్ని రట్టు చేస్తూ విరాట్ అసలు నిజాన్ని రాబట్టడంతో కథ తీవ్ర ఉత్కంఠభరితంగా మారింది. జగదీశ్వరి చికిత్సకు మాయ కడుపులోని బిడ్డ శాంపిల్స్ 90 శాతం వరకు పర్ఫెక్ట్‌గా సరిపోలిందని రఘురామ్ ప్రకటించడంతో ఇంట్లో అందరూ తెగ సంతోషపడతారు.

నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 5 ఎపిసోడ్
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 5 ఎపిసోడ్

విరాట్‌లో మొదలైన అనుమానం

అయితే, గతంలో డాక్టర్ చెప్పిన విషయాలను గుర్తుతెచ్చుకున్న విరాట్‌కు ఈ రిపోర్టుపై బలమైన అనుమానం వ్యక్తమవుతుంది. నిజం తేల్చుకోవడానికి ఎవరికీ చెప్పకుండా ఐవీఎఫ్ సెంటర్‌కు బయలుదేరతాడు విరాట్.

సరోగసీ బిడ్డ గురించి నిలదీసిన విరాట్

హాస్పిటల్‌కు చేరుకున్న విరాట్, సరోగసీ డాక్టర్‌ను బిడ్డ శాంపిల్స్ గురించి అడుగుతాడు. కానీ, డాక్టర్ విషయం చెప్పకుండా నీళ్లు నములుతాడు. విరాట్ ఎంత అడిగిన ఒక పట్టాన ఒప్పుకోడు డాక్టర్. దాంతో ఓపిక నశించిన విరాట్ డాక్టర్‌ను భయపెట్టి తీవ్రంగా నిలదీస్తాడు.

ఐవీఎఫ్ సెంటర్‌లో హైడ్రామా.. అసలు నిజం బహిర్గతం

నిజం చెప్పకపోతే హాస్పిటల్ వ్యవహారాన్ని ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తానని విరాట్ బెదిరిస్తాడు. దానికి భయపడిన డాక్టర్ అసలు నిజాన్ని ఒప్పుకుంటుంది. మాయ కడుపులో పెరుగుతున్న బిడ్డ మాయది కాదని, అది చంద్ర-విరాట్‌ల కడుపున పుట్టాల్సిన బిడ్డేనని తేల్చిచెబుతుంది. అది విని విరాట్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

మాయ భయం.. శాలిని కుట్ర

ఈ నిజం విరాట్‌ను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తుంది. విరాట్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. విరాట్‌కు నిజం తెలిసిపోయిందని డాక్టర్ మాయకు ఫోన్ చేసి చెబుతుంది. దాంతో మాయ తెగ టెన్షన్ పడుతుంటుంది. విరాట్ తప్పించుకోడానికి బిడ్డను అడ్డుపెట్టుకుంటానని, కావాల్సి వస్తే బిడ్డను చంపేస్తానని మాయ ఆవేశపడుతుంది.

తప్పించుకునేందుకు కొత్త ప్లాన్

"ఈ బిడ్డే నీకు రక్షణ కవచం, అది నీ దగ్గర ఉన్నంత వరకే నీకు బలం" అని శాలిని మాయకు సలహా ఇచ్చి శాంతపరుస్తుంది. విరాట్ ఇంటికి చేరేలోపే తప్పించుకునేందుకు శాలిని, మందరతో కలిసి కొత్త ప్లాన్ వేస్తుంది.

ఇంటికి పరుగు తీసిన విరాట్

చంద్రకళకు తల్లి అయ్యే భాగ్యం ఉందనే నిజం తెలుసుకున్న విరాట్, మాయ మోసాన్ని అందరి ముందూ పెట్టేందుకు ఆవేశంగా ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు ఊరు వెళ్తున్నామనే అబద్ధపు నెపంతో ఇల్లు వదిలి వెళ్లేందుకు మాయ, మందర సిద్ధమవుతారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More