Ninnu Kori September 4 Episode: నిన్ను కోరి- విరాట్, మాయ పెళ్లి జరగలేదన్న చంద్రకళ- 90 శాతం మ్యాచ్ అయిన బిడ్డ శాంపిల్స్

Ninnu Kori Serial September 4th Episode: నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 4వ ఎపిసోడ్‌‌లో సంచలన మలుపులు చోటుచేసుకున్నాయి. మాయ ఆడుతున్న పెళ్లి నాటకాన్ని చంద్రకళ బట్టబయలు చేస్తుంది. శాలినికి చెబుతుంది. మరోవైపు ఆసుపత్రి ల్యాబ్ రిపోర్టులో మాయ బిడ్డ శాంపిల్స్ 90 శాతం మ్యాచ్ అవ్వడంతో విరాట్ సంతోషంగా ఉంటాడు.

Published on: Sep 4, 2026, 06:28:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జగదీశ్వరి చికిత్స కోసం మాయ బిడ్డ శాంపిల్స్ ల్యాబ్ పరీక్షల్లో మ్యాచ్ కాకపోతే విరాట్ నిన్ను ఇల్లు దాటించేస్తాడని శాలిని హెచ్చరిస్తుంది, భయపెడుతుంది. అయినా మాయ ఏమాత్రం బెదరదు.

నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 4 ఎపిసోడ్
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 4 ఎపిసోడ్

శాలినికి అనుమానం

"నా మెడలో విరాట్ కట్టిన తాళి ఉంది, నన్ను ఈ ఇంటి నుంచి ఎవరూ వెళ్లగొట్టలేరు" అని మాయ చాలా నమ్మకంగా బల్లగుద్ది చెబుతుంది. మాయ చూపిస్తున్న ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి శాలినికి ఎందుకో బాగా అనుమానం కలుగుతుంది.

విరాట్‌తో చంద్ర రొమాంటిక్ గేమ్‌.. మందర అలెర్ట్!

మరోవైపు చంద్రకళ కావాలనే విరాట్ గదికి వెళ్లి అతడికి దగ్గరగా ఉంటూ రొమాంటిక్‌గా ప్రవర్తిస్తుంటుంది. ఇదంతా చూసిన మాయకు మండిపోతుంది. మాయ చూస్తుందని మరింత రెచ్చిపోతుంది చంద్రకళ. అదంతా గమనించిన మందర.. చంద్రకళ ప్రవర్తనలో ఏదో పెద్ద తేడా ఉందని అనుమానించి అదే విషయం మాయకు చెప్పి హెచ్చరిస్తుంది.

చంద్రకళకు నిజం తెలిస్తే

కానీ, అదేది మాయ పెద్దగా పట్టించుకోదు. చంద్రకళ రహస్యంగా గుడికి వెళ్లి విరాట్‌తో నీ పెళ్లి జరిగిందా లేదా అనే వివరాలు తెలుసుకుందని మాయకు మందర చెబుతుంది. అది విన్న మాయ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు చంద్రకళకు నిజం తెలిస్తే పరిస్థితి ఏంటని తెగ భయపడిపోతుంది మాయ.

గుడిలో చంద్రకళ నిజాలు రాబట్టిందని చెప్పిన మందర

మరోవైపు ఇక జగదీశ్వరి, రఘురామ్, విరాట్, మాయలు కలిసి ఆసుపత్రికి చేరుకుంటారు. వైద్యులు అవసరమైన శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిస్తారు. మందర ఫోన్ చేసి చంద్రకళ గుడిలో నిజాలు రాబట్టిందని, మీ పెళ్లి జరగలేదని తెలుసుకుందని చెబుతుంది. దాంతో ఆసుపత్రిలోనే మాయ తెగ వణికిపోతుంటుంది.

90 శాతం మ్యాచ్ అయిన ల్యాబ్ రిపోర్ట్స్

ఇంతలోనే డాక్టర్ వచ్చి, "ల్యాబ్ రిపోర్ట్‌లో శాంపిల్ 90 శాతం మ్యాచ్ అయ్యింది" అని విరాట్, రఘురామ్‌లకు చెబుతారు. ఈ మాట వినగానే విరాట్ ఎంతో సంతోషపడతాడు. మరోవైపు చంద్రకళ మనసులో అసలు ఏముంది, తన ప్లాన్ ఏంటో తెలుసుకోమ్మని, తన నుంచి నిజం రాబట్టమని శాలినిని హెల్ప్ అడుగుతుంది మాయ.

ఊహించని బాంబు పేల్చిన చంద్రకళ!

మాయ చెప్పడంతో చంద్రకళ దగ్గరికి వెళ్లిన శాలిని మాటలు కలుపుతుంది. అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే చంద్రకళ ఊహించని నిజం బయటపెడుతుంది. "విరాట్‌ను మాయ భయపెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తోంది. అసలు విరాట్, మాయలకు పెళ్లే జరగలేదు" అని చంద్రకళ బాంబ్ పేలుస్తుంది.

షాక్ అయిన శాలిని

చంద్రకళ నోటి నుంచి ఈ నిజం విన్న శాలిని ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. భయంతో శాలినికి చెమటలు పడతాయ్. అలాగే ఖంగుతిని సైలెంట్‌గా ఉంటుంది శాలిని. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More