Bigg Boss Elimination Today: బిగ్ బాస్ నుంచి ఇవాళ శాలిని ఎలిమినేట్- ఏ కారణం లేకుండానే బయటకు తీసుకెళ్లిన యమ కింకరులు

Bigg Boss Telugu 10 Elimination Today: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా వారి రీ ఎంట్రీ ఉండనుందని తెలిసింది. అయితే, తాజాగా ఇవాళ బిగ్ బాస్ 10 తెలుగు నుంచి ఇవాళ కామనర్ కంటెస్టెంట్ శాలినిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది.

Published on: Sep 17, 2026, 13:30:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10 Telugu Elimination This Week: తెలుగు బుల్లితెర షో బిగ్ బాస్ సరికొత్త గేమ్స్‌తో రోజు రోజు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో కెప్టెన్సీ కోసం ఇచ్చే టాస్కులు, అవి కూడా ఆడియెన్స్ సెలెక్ట్ చేయడం, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను తిరిగి తీసుకురావడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.

బిగ్ బాస్ నుంచి ఇవాళ శాలిని ఎలిమినేట్- ఏ కారణం లేకుండానే బయటకు తీసుకెళ్లిన యమ కింకరులు
బిగ్ బాస్ నుంచి ఇవాళ శాలిని ఎలిమినేట్- ఏ కారణం లేకుండానే బయటకు తీసుకెళ్లిన యమ కింకరులు

ఆడియెన్స్ ఓటింగ్‌తో

ఇప్పటికే బిగ్ బాస్ 10 తెలుగు నుంచి మొదటి వారం పూర్తికాకముందే ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. వారిలో కామనర్స్ నుంచి వచ్చిన చరణ్ మహాదేవ్, సెలబ్రిటీ ట్యాగ్ నుంచి సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ ఉన్నారు. అయితే, వీరిని తిరిగి బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకొచ్చేందుకు ఆడియెన్స్ ఓటింగ్ కూడా పెట్టారు నిర్వాహకులు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌజ్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లు నడుస్తోన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 17) బిగ్ బాస్ తెలుగు 10 నుంచి శాలిని పటేల్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 17 తేది ఎపిసోడ్‌ ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్.

ఇదివరకు తీసుకెళ్లినట్లుగా

ఇదివరకు చరణ్, చైత్ర రాయ్‌ను నలుపు బట్టల్లో, మాస్కులు వేసుకుని ముగ్గురు యమ కింకరులుగా నలుగురు వచ్చి తీసుకెళ్లినట్లుగానే శాలినిని కూడా తీసుకువెళ్లారు. దీంతో ఇంటిసభ్యులంతా షాక్‌కు గురయ్యారు. బిగ్ బాస్ తెలుగు 10 ఈరోజు ఎపిసోడ్ నాటి ప్రోమో వీడియోలో బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్‌తో కంటెస్టెంట్స్ అంతా వచ్చి గార్డెన్ ఏరియాలో నిల్చుని ఉన్నారు.

గార్డెన్ ఏరియా అంతా శ్మశానవాటికలా ప్రిపేర్ చేసి ఉంది. నాలుగైదు సమాధి బాక్సులు ఉంచారు. హౌజ్ గేట్స్ ఓపెన్ కాగానే యమ కింకరులు ఎంట్రీ ఇచ్చారు. ఒక సమాధిపై ఒక లెటర్ పెట్టారు. దాన్ని చూడమని వాళ్లు సైగ చేశారు. దాంతో శాలిని ముందుకు వచ్చి ఆ లెటర్‌ను తీసుకుంటుంది.

శాలిని పట్టుకుని తీసుకెళ్లిన యమ కీంకరులు

ఓపెన్ చేయమని రోహిత్ అన్నాడు. తర్వాత దీన్ని ఓపెన్ చేయాలేమో అని సృష్టి చెప్పింది. సృష్టి, శాలిని కలిసి సమాధిని ఓపెన్ చేశారు. అందులో ఏముండదు. లెటర్ పట్టుకున్న శాలిని మాత్రమే ఓపెన్ చేయాలన్నట్లుగా యమకీంకరులు సైలెంట్‌గా చూస్తూ ఉన్నారు. అది ఓపెన్ చేయాలా అని రామ్ ప్రసాద్ అన్నాడు.

ఇంకో సమాధి బాక్సును సృష్టి వ్యాకరణం ఓపెన్ చేసి చూసింది. యమ కీంకరులు ముందుకు రావడంతో సృష్టి వెనక్కి వెళ్లింది. ఆ సమాధి బాక్సును శాలిని పట్టుకుని ఉంది. దాంతో శాలినిని పట్టుకుని యమ కింకరులు తీసుకెళ్లిపోయారు. అదంతా చూసిన శాలిని అవాక్కయింది. హౌజ్‌మేట్స్ షాక్‌లో ఉండిపోయారు.

కెప్టెన్సీ బరిలో శాలిని

ఫస్ట్ ఎవరు ముట్టుకున్నారో వాళ్లను తీసుకెళ్తున్నట్లు ఉన్నారని రామ్ ప్రసాద్ అన్నాడు. అంతా నోరెళ్లబెట్టి చూశారు. వచ్చిన యమ కీంకరులు శాలిని బిగ్ బాస్ గేట్ బయటకు తీసుకెళ్లిపోయారు. అక్కడితో బిగ్ బాస్ నేటి ఎపిసోడ్ ప్రోమో ముగిసింది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం హౌజ్‌లో జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్స్ బరిలో త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, ముఖేష్, ఝాన్సీతోపాటు శాలిని కూడా ఉంది. కెప్టెన్సీకి పోటీ చేస్తున్న సమయంలో ఎలాంటి సరైన కారణం లేకుండా శాలిని పటేల్‌ను ఎలిమినేట్ చేసి తీసుకెళ్లడం ఏంటనేది ఉత్కంఠంగా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More