Bigg Boss Telugu: 10 నెలల పాపను వదిలేసి బిగ్ బాస్ 10లోకి వచ్చిన దేవర నటి- సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ ఎవరో తెలుసా?
Bigg Boss 10 Telugu Grand Launch: తెలుగు అదిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ 10 ప్రారంభమైంది. బిగ్ బాస్ తెలుగు 10లోకి మొత్తంగా 16 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టనున్నారు. వీరిలో సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ ఒకరు. 10 నెలల బిడ్డను వదిలేసి బిగ్ బాస్‌కి వచ్చిన చైత్ర రాయ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Bigg Boss 10 Telugu Grand Launch Chaitra Rai: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ నడుస్తోంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ద్వారా మంచి హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ ఇవాళ (సెప్టెంబర్ 6) బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్ చేశారు.

బిగ్ బాస్ 10 తెలుగులోకి 16 మంది కంటెస్టెంట్స్
నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ 10 తెలుగు జియో హాట్‌స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు బిగ్ బాస్ 10లోకి మొత్తంగా 16 మంది కంటెస్టెంట్స్ ఫైనలైజ్ అయ్యారు. వారు ఒక్కొక్కరుగా హౌజ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 10లోకి ఆరో కంటెస్టెంట్‌గా సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది.
చైత్ర రాయ్ సీరియల్స్
అష్టా చెమ్మా సీరియల్‌తో హీరోయిన్‌గా పరిచయం అయిన చైత్ర రాయ్ తెలుగు బుల్లితెరపై రాధా కళ్యాణం, ఒక్క క్షణం, తథాస్తు, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు వంటి సీరియల్స్‌తో అట్రాక్ట్ చేసింది. అంతేకాకుండా అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు సీరియల్‌లో డ్యూయల్ రోల్ చేసి కూడా మెప్పించింది ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ చైత్ర.
జూనియర్ ఎన్టీఆర్ దేవరలో చైత్ర రాయ్
సీరియల్స్ మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా దేవరలో ఓ పాత్రలో కూడా నటించి మెప్పించింది చైత్ర రాయ్. ఇకపోతే కూర్గ్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్న చైత్ర రాయ్ ట్రైనింగ్ కారణంగా బెంగళూరు వెళ్లాల్సివచ్చింది.
తెలియకుండా ఫొటోలు తీసిన నిర్మాత
అక్కడ ఓ ప్రొడ్యూసర్ తనకు తెలియకుండా ఫొటోలు తీసి ఒక డైరెక్టర్‌కు పంపించారట. అలా తనకు సీరియల్స్‌లో అవకాశం వచ్చిందని బిగ్ బాస్ జర్నీలో తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది చైత్ర రాయ్. ఇత చైత్ర రాయ్‌కు భర్త ప్రసన్న శెట్టి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
ఒక్క కామెంట్‌తో 22 కేజీల బరువు తగ్గి
రెండో ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత చైత్ర రాయ్ చాలా బరువు పెరగడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేశారని, ఈ క్రమంలో వచ్చిన ఒక్క కామెంట్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఆమె తెలిపింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేవలం 3 నెలల్లో 82 కిలోల నుంచి 60 కేజీల వరకు తగ్గినట్లు చెప్పుకొచ్చింది చైత్ర రాయ్.
10 నెలల బిడ్డను వదిలేసి వచ్చావా?
ఇక స్టేజీ మీదకు చైత్ర రాయ్‌కు స్వాగతం పలికాడు హోస్ట్ నాగార్జున. "ఏంటీ బిగ్ బాస్ కోసం 10 నెలల బిడ్డను వదిలేసి వచ్చావా?" అని నాగార్జున అడుగుతాడు. దానికి అవును అని, బిగ్ బాస్ తనకు సెకండ్ ఇన్నింగ్స్ అని, తన తల్లిని చూసి పిల్లలు గర్వంగా ఫీల్ అయ్యేలా చేయాలని ఇక్కడికి వచ్చినట్లు చైత్ర రాయ్ తెలిపింది.
చాలా ఎమోషనల్
ఇంకా బిగ్ బాస్ స్టేజీ మీద చైత్ర రాయ్ మాట్లాడుతూ.. "నా పర్సనాలిటీ డిఫైన్ చేయాలంటే నేను చాలా ఎమోషనల్. కానీ, అందరితో బాగా కనెక్ట్ అవుతాను. అయితే, నా ఎమోషన్‌ను వీక్‌నెస్‌గా ఉంచుకోను. నాకు మొదట్లో తెలుగు అస్సలు రాదు. కానీ, ఇక్కడి ప్రేక్షకుల అభిమానం చూసి తెలుగు నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


