Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10లో తొలిరోజే షాకింగ్ ఎలిమినేషన్- స్టేజ్ పైనుంచే కంటెస్టెంట్ అవుట్- ఎందుకంటే?

Bigg Boss 10 Tamil Elimination On First Day: బిగ్ బాస్ 10 తమిళ సీజన్‌లో తొలిరోజే షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ప్రముఖ యూట్యూబర్, రివ్యూవర్ ప్రశాంత్ రంగస్వామి స్టేజీ పైనుంచే ఎలిమినేట్ అయి వెనుదిరిగారు. ఇంతకుముందు టాక్సిక్ మూవీ రివ్యూ కారణంగా ప్రశాంత్ వివాదంలో ఇరుక్కున్నారు.

Published on: Sep 6, 2026, 14:36:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10 Elimination On First Day: బుల్లితెరపై సంచలనం సృష్టించే రియాలిటీ షో బిగ్ బాస్. నాలుగు దక్షిణాది భాషల్లో ఒకేరోజున బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇవాళ (సెప్టెంబర్ 6) బిగ్ బాస్ రియాలిటీ షో ఆరంభం కానుంది.

బిగ్ బాస్ 10లో తొలిరోజే షాకింగ్ ఎలిమినేషన్- స్టేజ్ పైనుంచే కంటెస్టెంట్ అవుట్- ఎందుకంటే?
బిగ్ బాస్ 10లో తొలిరోజే షాకింగ్ ఎలిమినేషన్- స్టేజ్ పైనుంచే కంటెస్టెంట్ అవుట్- ఎందుకంటే?

నాగార్జున-విజయ్ సేతుపతి

తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేయనుండగా.. తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. హీరో విజయ్ సేతుపతి హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ 10 తమిళ సీజన్‌లో తొలి రోజే షాకింగ్ ఎలిమినేషన్ చోటుచేసుకుంది.

ఈ షో ఇవాళ సాంయంత్రం ప్రసారం కానుంది. ఈపాటికే మొదటి ఎలిమినేషన్ వివరాలు బయటకు వచ్చేశాయి. ఈసారి సరికొత్త ఫార్మాట్‌తో ముందుకొచ్చిన నిర్వాహకులు, కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి అడుగుపెట్టక ముందే స్టేజ్‌పైనే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టినట్లు వార్తలు లీకయ్యాయి.

స్టేజ్‌పైనే ఎలిమినేషన్.. సీన్ రివర్స్!

ప్రముఖ తమిళ యూట్యూబర్, మూవీ రివ్యూయర్ ప్రశాంత్ రంగస్వామి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టక ముందే ఆడియెన్స్ ఓటింగ్‌లో ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. షో ప్రారంభానికి రెండు రోజుల ముందు సెప్టెంబర్ 4న "మంచి జరుగుతుంది.. ఓం!" అని పోస్ట్ చేసిన ప్రశాంత్, ఆ తర్వాత సెప్టెంబర్ 5న "ధన్యవాదాలు మురుగా.. ఓం!" అని పెట్టిన పోస్ట్ పెట్టాడు.

దీంతో నిజంగానే ప్రశాంత్ రంగస్వామి ఎలిమినేట్ అయినట్లు కన్ఫర్మ్ అయింది. అయితే, బిగ్ బాస్ 10 తమిళ స్టేజిపై ప్రశాంత్ రంగస్వామితో పాటు మరో ఇద్దరు కంటెస్టెంట్స్ జవిత్, పృథ్వీనాథ్లను నిలబెట్టారు. వీరికి ఒక అంశం ఇచ్చి.. ఒక్కొక్కరిని రెండు నిమిషాలపాటు మాట్లాడమని చెప్పారు.

తొలి ఎపిసోడ్‌లోనే ట్విస్ట్

అనంతరం ఎవరి మాటలు నచ్చాయో వారికి ఓటు వేయాలని ఆడియన్స్‌కు తీర్పును కట్టబెట్టారు హోస్ట్. ఈ టాస్క్‌లో అనూహ్యంగా ప్రశాంత్ రంగస్వామి వెనుకబడిపోయారు. ప్రేక్షకుల ఓట్లలో విజయం సాధించలేకపోవడంతో ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశాన్ని చేజార్చుకున్నారు.

దీంతో క్రిటిక్ ప్రశాంత్ రంగస్వామి బిగ్ బాస్ స్టేజీ పైనుంచే ఎలిమినేట్ అయి వెనక్కి రావాల్సి వచ్చింది. బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్‌లోనే ఇలాంటి ట్విస్ట్ రావడంతో ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. కంటెస్టెంట్‌గా ఇంట్లోకి వెళ్లి గేమ్ ఆడకముందే ప్రశాంత్ రంగస్వామి ఎలిమినేట్ కావడం ఇప్పుడు బిగ్ బాస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ద్వేషించిన వారికి ధన్యావాదాలు

ఎలిమినేట్ అయిన తర్వాత "ప్రేమ చూపించిన వారికి, ద్వేషించిన వారికి ధన్యవాదాలు. మళ్లీ నా పనిలోకి వెళ్తున్నా. ఎలాంటి బాధ, నిరాశ లేవు. ఏది ఎలా జరగాలో అలాగే జరిగింది" అని ప్రశాంత్ రంగస్వామి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు.

ఆయన ఎలిమినేషన్ వార్త వినగానే గత సీజన్ కంటెస్టెంట్, నటి సనమ్ శెట్టి కూడా స్పందిస్తూ.. ప్రశాంత్ మంచి కంటెస్టెంట్ అయ్యేవాడని, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ వస్తారని ఆశిస్తున్నట్లు మద్దతుగా నిలిచారు.

'టాక్సిక్' సినిమా వివాదంతో వార్తల్లో..

ఇదిలా ఉంటే, ఇటీవలే హీరో యశ్- దర్శకురాలు గీతు మోహన్‌దాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'టాక్సిక్' సినిమా రివ్యూ విషయంలో ప్రశాంత్ వివాదంలో నిలిచారు. ఆ సినిమా టీమ్ తన రివ్యూపై లీగల్ నోటీసులు పంపిందని ఆరోపిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

వివాదం చల్లారకముందే

ఆ వివాదం చల్లారకముందే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జరగడం, అంతలోనే స్టేజ్‌పైనే ఎలిమినేట్ అవ్వడం చర్చనీయాంశమైంది. ఇకపోతే మరి బిగ్ బాస్ తెలుగు 10లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More