OTT Weekend: ఇవాళ సండే- ఓటీటీలో మిస్ అవ్వకూడని టాప్ 6 తెలుగు సినిమాలు- ఓక్కోటి ఒక్కోరకం- ఒకేరోజు రిలీజ్-ఎందుకు చూడాలంటే?
OTT Telugu Movies To Watch This Weekend: ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు చూసేందుకు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అందులోనూ ఆ సినిమాలన్నీ తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ ఇతర ఓటీటీల్లో ఈ వీకెండ్‌కు మిస్ అవ్వకూడని టాప్ 6 తెలుగు సినిమాలపై లుక్కేద్దాం.
Top 6 OTT Telugu Movies To Watch This Weekend: ఇవాళ (సెప్టెంబర్ 6) సండే. హాలీడే లేదా వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీల్లో చూసేందుకు మంచి సినిమాలు ఏం ఉన్నాయా అని ఆరాలు తీస్తుంటారు సినీ ప్రియులు. అలాంటి వారికోసమే ఒక్కరోజే (సెప్టెంబర్ 4) ఏకంగా టాప్ 6 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

అది కూడా ఈ సినిమాలన్నీ తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక్కోటి ఒక్కో రకంగా ఉన్న ఈ టాప్ 6 మూవీస్ వీకెండ్‌కు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మరి వీకెండ్‌కు మిస్ అవ్వకూడని ఆ టాప్ 6 తెలుగు సినిమాలు ఏంటీ?, వాటిని ఎందుకు చూడాలో? ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్‌లో బిగ్ రిలీజెస్.. కామెడీ అండ్ బయోపిక్స్!
డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈసారి ముచ్చటగా రెండు విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెస్తోంది.
జీడీ నాయుడు (GD Naidu): ‘భారత ఎడిసన్’గా పేరుగాంచిన ప్రముఖ పరిశోధకుడు, పారిశ్రామికవేత్త జి.డి. నాయుడు జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ బయోపిక్ డ్రామాలో ఆర్. మాధవన్ ప్రధాన పాత్ర పోషించారు. కృష్ణకుమార్ రామకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియమణి, సత్యరాజ్, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించారు.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.8/10
ఎందుకు చూడాలి: ఒక సాధారణ మెకానిక్ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి ఆవిష్కర్తగా ఎదిగిన క్రమంలో జీడీ నాయుడు ఎదుర్కొన్న సవాళ్లను అద్భుతమైన భావోద్వేగాలతో ఆవిష్కరించారు. జీవిత చరిత్రలు, ప్రేరణాత్మక అంశాలను ఇష్టపడేవారు తప్పక చూడాల్సిన సినిమా ఇది.
కొరియన్ కనకరాజు (Korean Kanakaraju): మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన ఈ ఇండో-కొరియన్ హారర్ కామెడీ సినిమా ఇది. దీనికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. కమెడియన్ సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.8/10
ఎందుకు చూడాలి: రాయలసీమ యువకుడి దేహంలోకి ఒక కొరియన్ ఆత్మ ప్రవేశించడం, ఆ తర్వాత జరిగే పరిణామాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాయి. కమెడియన్ సత్య కామెడీ టైమింగ్ హైలెట్‌గా నిలిచింది. అలాగే, హారర్ సన్నివేశాల్లో తమన్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది. వరుణ్ తేజ్‌ను కూడా ఓ డిఫరెంట్ గెటప్‌లో చూడొచ్చు.
ప్రైమ్, హాట్‌స్టార్‌లలో మ్యూజిక్.. కోర్టు రూమ్ డ్రామా!
భావోద్వేగాలు, లీగల్ పోరాటాలు ఇష్టపడే వారి కోసం అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ ప్రత్యేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయి.
జగమే సంగీతం (Prime Video): 'బండిష్ బండిట్స్' స్ఫూర్తితో తెరకెక్కించిన ఈ తెలుగు క్లాసికల్ మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా ఓటీటీ సిరీస్ జగమే సంగీతం. ఈ ఓటీటీ సిరీస్‌తు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించగా.. సుస్మిత కొణిదెల నిర్మించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లాగుసాని కీలక పాత్రల్లో నటించారు.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.2/10
ఎందుకు చూడాలి: కర్ణాటక సంగీత వారసత్వానికి, ఆధునిక పాప్ రంగానికి మధ్య నలిగే ఒక యువకుడి కథతో రూపొందిన ఈ సిరీస్ ఇది. విశాల్ చంద్రశేఖర్ అందించిన స్వరాలు ప్రధాన బలంగా నిలిచాయి. అలాగే, శాస్త్రీయ సంగీతానికి ఉన్న ఇంపార్టెన్స్ చెబుతూనే పాప్ కల్చర్‌ను బాగా ఆవిష్కరించారు.
ది కోర్ట్ (JioHotstar): తమిళంలో విజయవంతమై తెలుగులోకి డబ్బింగ్ అయిన ఈ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. నత్తి సమస్య ఉన్న ఒక యంగ్ అడ్వకేట్, తన తండ్రి వారసత్వం కోసం పడే ఆరాటం నేపథ్యంలో ఈ ఓటీటీ సిరీస్ సాగుతుంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.3/10
ఎందుకు చూడాలి: సాధారణంగా వాదించే లాయర్స్‌కు మాట్లాడే వాక్చాతుర్యం బాగుండాలి. కానీ, ఒక నత్తి యువతికి లాయర్ అయి కేసులు ఎలా వాదించిందనేదే ఈ సిరీస్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్. అలాగే, నత్తి సమస్య ఉన్న తన సొంత కూతురు తన వారసత్వాన్ని కొనసాగించలేదని పక్కన పెట్టడం, తానేంటో నిరూపించుకోవాలనుకుని న్యాయస్థానంలో తండ్రినే ఎదుర్కొనే ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సోనీ లివ్, సన్ నెక్ట్స్!
సస్పెన్స్, క్రైమ్ కథలను కోరుకునే వారి కోసం మరో రెండు డబ్బింగ్ చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి.
ఉన్మాదం (SonyLIV): మలయాళంలో ప్రశంసలు పొందిన ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌లో కుంచాకో బోబన్ మాజీ పోలీస్ ఆఫీసర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా కనిపించారు. ఈ సినిమాకు కిరణ్ దాస్ దర్శకత్వం వహించారు.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 5.9/10
ఎందుకు చూడాలి: ఒక పాత అన్‌సాల్వ్‌డ్ కేస్ పరిశోధనలో మాజీ పోలీస్ ఎదుర్కొనే మానసిక ఘర్షణలు, భ్రమలు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. సహజంగా అయితే ఒక కేసు ఫైల్ చూసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ, ఇక్కడ ఆ ఫైలుకే శాపం ఉంటే. దానివల్ల అది టేకప్ చేసిన పోలీసులకు అతీంద్రియ శక్తులు కనిపిస్తే.. ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాను చూసేలా చేస్తాయి.
డీసీ (Sun NXT): తమిళ రివేంజ్ క్రైమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ చిత్రం డీసీ పక్కా మాస్ యాక్షన్ ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.1/10
ఎందుకు చూడాలి: పాపులర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. సినిమాలో వచ్చే వయోలెంట్ యాక్షన్ సీన్స్, లవ్ మాస్ ఆడియెన్స్‌కు మంచి ఫీస్ట్ అందిస్తాయి. అంతకుమించి అనిరుధ్ రవిచందర్ బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


