Telugu Web Series: ప్రకాష్ రాజ్ వర్సెస్ శ్రీకాంత్.. ఓటీటీలో సరికొత్త తెలుగు మ్యూజికల్ వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా?
Jagamae Sangeetham Trailer: ప్రైమ్ వీడియోలోకి సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ జగమే సంగీతం రాబోతోంది. ఈ సిరీస్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధూలాంటి సీనియర్ నటీనటులు నటిస్తున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Jagamae Sangeetham Trailer: ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో మరో మైండ్ బ్లాకింగ్ అనౌన్స్‌మెంట్‌తో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇంటెన్స్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్ 'జగమే సంగీతం' ట్రైలర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. ఈ క్రేజీ సిరీస్ సెప్టెంబర్ 4 నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.

జగమే సంగీతం ట్రైలర్ ఎలా ఉందంటే?
ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ నటిస్తున్న జగమే సంగీతం వెబ్ సిరీస్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రైమ్ వీడియోలోనే రెండు సీజన్ల పాటు వచ్చి ప్రేక్షకులను అలరించిన హిందీ వెబ్ సిరీస్ బందిష్ బ్యాండిట్స్ కు ఇది రీమేక్. శాస్త్రీయ సంగీతమే అసలైన సంగీతమని, పాశ్చాత్య సంగీతం దండగ అని నమ్మే ఓ సాంప్రదాయ కళాకారుడి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు.
తన వంశం తన ఘనమైన సంగీత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆశ పడుతుంటాడు. కానీ అతని మనవడు మాత్రం ఓ పాప్ మ్యూజిక్ ను ఇష్టపడే అమ్మాయిని ప్రేమించి ఆమెతో కాన్సర్ట్ లు చేస్తుంటాడు. ఈ క్రమంలో వాళ్ల మధ్య వచ్చే ఘర్షణలు ఎలాంటివి అన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. ఇందులో ప్రకాష్ రాజ్ ప్రత్యర్థిగా శ్రీకాంత్ నటించడం విశేషం.
సుస్మిత కొణిదెల ప్రొడక్షన్.. వర్సటైల్ కాంబో ప్రయోగాలు
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన సొంత బ్యానర్ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్' (Gold Box Entertainments)పై ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గతంలో 'షూట్-ఔట్ అట్ అలేర్', 'సేనాపతి' వంటి డిఫరెంట్ కంటెంట్ ఆధారిత ప్రాజెక్ట్‌లతో ప్రొడ్యూసర్‌గా తన మార్క్ చూపించిన సుస్మిత.. ఇప్పుడు డైరెక్టర్ సూర్య ప్రతాప్ పల్నాటితో కలిసి ఒక వినూత్నమైన ఆడియో-విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆడియన్స్‌కు అందించబోతున్నారు.
నటనలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తొలిసారి ఒక మ్యూజికల్ సిరీస్ కోసం స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ ప్రాజెక్ట్ పై హైప్‌ను రెట్టింపు చేసింది. వీరితో పాటు యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ అనిరుధ్ లగుసాని కూడా ఒక ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనున్నారు.
"రెండు స్వరాలు.. ఒక నిషిద్ధ రాగం".. అసలు కథేంటి?
ఈ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ప్రైమ్ వీడియో రిలీజ్ చేసిన కాప్షన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "రెండు స్వరాలు, ఒక నిషిద్ధ రాగం.. ప్రమాదంలో ఉన్న వారసత్వం" అనే క్యాప్షన్ ఈ వెబ్ సిరీస్ కోర్ పాయింట్‌ను రివీల్ చేస్తోంది.
శాస్త్రీయ, ఆధునిక సంగీత ప్రపంచంలో ఉండే పంతాలు, ఈగో వార్స్, వారసత్వ పోరు వెనుక దాగి ఉన్న ఎమోషనల్ డ్రామా ఆధారంగా ఈ కథ సాగుతుందని స్పష్టమవుతోంది. ప్రకాష్ రాజ్ ఇంటెన్స్ యాక్టింగ్, శ్రీకాంత్ క్యారెక్టర్ డెప్త్ ఈ సిరీస్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టాప్ టెక్నికల్ టీమ్.. 'సీతా రామం' మ్యూజిక్ డైరెక్టర్ మ్యాజిక్
మ్యూజికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ప్రాజెక్ట్ కావడం వల్ల ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ టీమ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు మేకర్స్. 'సీతా రామం' సినిమాతో క్లాసిక్ చార్ట్‌బస్టర్స్ అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ సిరీస్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ మ్యూజిక్ రైట్స్‌ను దిగ్గజ ఆడియో కంపెనీ T-Series సొంతం చేసుకుంది.
ఇక విజువల్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోటా విజువల్ గ్రాండియర్‌ను అందించారు. సెప్టెంబర్ 4 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ కానన్న ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా తెలుగు ఓటీటీ స్పేస్‌లో ఒక కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తుందని ప్రొడక్షన్ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


