Vishwambhara: దసరాకు కూడా లేనట్లే-విశ్వంభర మేకర్స్ పై మెగా ఫ్యాన్స్ కోపం-చిరంజీవి బర్త్ డేకు పోస్టర్ మాత్రమే రిలీజ్!

Vishwambhara: చిరంజీవి పుట్టిన రోజునాడు మెగా ఫ్యాన్స్ ను విశ్వంభర మూవీ టీమ్ తీవ్రంగా డిసప్పాయింట్ చేసింది. ఎంతో ఆశగా ఎదురు చూసినా కూడా మూవీ రిలీజ్ డేట్ చెప్పకుండా కేవలం ఓ మోషన్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా? అని అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Published on: Aug 22, 2026, 18:10:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే (ఆగస్టు 22) సందర్బంగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే బాబీ కొల్లి- చిరంజీవి మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయి. కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విశ్వంభర రిలీజ్ డేట్ విషయంలో మాత్రం మేకర్స్ తీవ్రంగా నిరాశపరిచారు.

దసరాకు కూడా లేనట్లే-విశ్వంభర మేకర్స్ పై మెగా ఫ్యాన్స్ కోపం-చిరంజీవి బర్త్ డేకు పోస్టర్ మాత్రమే రిలీజ్! (x/UV_Creations)
దసరాకు కూడా లేనట్లే-విశ్వంభర మేకర్స్ పై మెగా ఫ్యాన్స్ కోపం-చిరంజీవి బర్త్ డేకు పోస్టర్ మాత్రమే రిలీజ్! (x/UV_Creations)

విశ్వంభర అప్డేట్

చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విశ్వంభర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ సింపుల్ గా ఓ మోషన్ పోస్టర్ ను పోస్టు చేసి మేకర్స్ తీవ్రంగా డిసప్పాయింట్ చేశారు. మూవీ టీమ్ కేవలం ప్రత్యేక పోస్టర్, ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST) విడుదల చేయడానికి మాత్రమే పరిమితమైంది.

త్వరలో అంటూ

"అనంత విశ్వాన్ని దాటే మెగా మాస్ అనుభూతిని విశ్వంభరతో త్వరలోనే వీక్షకులు తిలకించనున్నారు. మన అందరి ప్రియతమ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజున స్పెషల్ పోస్టర్, ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను ఆవిష్కరిస్తున్నాం" అని విశ్వంభర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంది.

ఇంకా ఎప్పుడు?

విశ్వంభర షూటింగ్ అప్పుడెప్పుడో 2023 అక్టోబర్ లో స్టార్ట్ అయింది. దాదాపు మూడేళ్లు అవుతోంది. కానీ మూవీ రిలీజ్ కాలేదు. రిలీజ్ డేట్ పై అప్డేట్ కూడా లేదు. ఫస్ట్ 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామన్నారు. కానీ 2026 సంక్రాంతి వెళ్లిపోయినా కూడా విశ్వంభర మాత్రం థియేటర్లలోకి రాలేదు.

ఆ సినిమాలు

విశ్వంభర సినిమా తర్వాత మొదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ 2026 సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న మూవీకి ‘కాకా’ అని పేరు పెట్టారు. ఈ చిత్రం 2027 జనవరి 13న రిలీజ్ కానుంది. కానీ విశ్వంభర రిలీజ్ డేట్ కోసం ఎదురు చూపులు మాత్రం కొనసాగుతున్నాయి.

దసరాకు కూడా లేదు

విశ్వంభర మూవీ ఈ ఏడాది దసరాకు రిలీజ్ అవుతుందేమోనని అంతా భావించారు. అక్టోబర్ 16న పక్కాగా రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ తుస్ మనిపించారు. రిలీజ్ డేట్ చెప్పకుండా త్వరలో అంటూ పాత పాటే పాడారు. దీంతో దసరాకు విశ్వంభర రావడం కష్టమనే చెప్పాలి.

విశ్వంభర చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, మౌనీ రాయ్, పునీత్ ఇస్సార్, సౌరవ్ లోకేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చోటా కే నాయుడు ఛాయాగ్రహణం అందిస్తుండగా, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More