Trisha Krishnan: వివాదాల ‘క్వీన్’ త్రిష.. జారా బ్రాండ్ రచ్చ నుంచి విజయ్ బర్త్‌డే పోస్ట్ వరకు.. టాప్ కాంట్రవర్సీలు ఇవే!

Trisha Krishnan Controversies: సౌత్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జారా బ్రాండ్ దుస్తులపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడమే కారణం. ఈ నేపథ్యంలో త్రిష చుట్టూ రేగిన టాప్ కాంట్రవర్సీలపై ఓ లుక్కేయండి.

Published on: Jul 5, 2026, 15:11:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trisha Krishnan Controversies: ​సినిమా ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉంటే.. అన్ని వివాదాలు చుట్టుముట్టడం సహజం. హీరోయిన్ త్రిష విషయానికి వస్తే ఆమె కెరీర్ గ్రాఫ్ ఎంత వేగంగా దూసుకుపోతుందో, ఆమె పేరుతో వచ్చే కాంట్రవర్సీలు కూడా అంతే స్థాయిలో వైరల్ అవుతున్నాయి.

వివాదాల ‘క్వీన్’ త్రిష.. జారా బ్రాండ్ రచ్చ నుంచి విజయ్ బర్త్‌డే పోస్ట్ వరకు.. ట్రెండింగ్! (instagram)
వివాదాల ‘క్వీన్’ త్రిష.. జారా బ్రాండ్ రచ్చ నుంచి విజయ్ బర్త్‌డే పోస్ట్ వరకు.. ట్రెండింగ్! (instagram)

ట్రెండింగ్ లో త్రిష

గత కొంతకాలంగా త్రిష కృష్ణన్ పేరు తరచుగా వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఆమె పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ చెన్నై శశి, వివాదాలను సైతం అంతే ధీటుగా ఎదుర్కొంటూ వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రిష పేరు మారుమోగిపోవడానికి గల ప్రధాన కారణాలు, ఆమె కెరీర్‌లోని కొన్ని సంచలన వివాదాలు ఇక్కడున్నాయి.

‘జారా’ బ్రాండ్ వివాదం

​ప్రస్తుతం ఇంటర్నెట్‌లో త్రిష పేరు ట్రెండ్ అవ్వడానికి తాజా కారణం ప్రముఖ అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ ‘జారా’ (Zara) తో ముడిపడి ఉంది. ఈ బ్రాండ్ నుంచి దుస్తులను త్రిష ఆర్డర్ చేసింది. డెలివరీ అయిన ఆ దుస్తులను ఓపెన్ చేస్తే ఒకటే చెమట కంపు. దీంతో ఈ బ్రాండ్ పై త్రిష ఫైర్ అయింది. ఇలా మూడో సారి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

దళపతి విజయ్ - సంగీత విడాకుల రూమర్స్

​త్రిష కెరీర్‌లోనే అత్యంత ఎక్కువ కాలం వేధించిన, ఇప్పటికీ వేధిస్తున్న వివాదం కోలీవుడ్ స్టార్, ప్రస్తుత తమిళనాడు సీఎం దళపతి విజయ్ (Vijay) తో ఆమెకున్న అనుబంధం. విజయ్, త్రిషల కాంబినేషన్‌లో గిల్లి, తిరుపాచి, కురువి మరియు ఇటీవల వచ్చిన 'లియో' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి.

​విజయ్, త్రిష మధ్య స్క్రీన్ కెమిస్ట్రీని దాటి ఏదో ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రచ్చ మొదలైంది. తన భర్తకు ఓ హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని సంగీత ఆరోపించింది. ఆ హీరోయిన్ త్రిషనే అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.

విజయ్ బర్త్‌డే పోస్ట్

గత నెల (జూన్ 22) విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష పెట్టిన ఒక పోస్ట్ మంటల్లో నెయ్యి పోసినట్లయింది. విజయ్‌తో కేక్ కట్ చేయిిస్తూ కలిసి దిగిన ఓ ఫొటోను త్రిష సోషల్ మీడియాలో సేర్ చేసింది. ​ఈ ఒక్క పోస్ట్‌తో కోలీవుడ్ మీడియా మొత్తం షాక్‌కు గురైంది. రూమర్స్‌ను లైట్ తీసుకోవడం పక్కన పెడితే, త్రిష ఏకంగా ఆ రూమర్స్‌ను మరింత పెంచేలా ఈ పిక్ పోస్ట్ చేసిందంటూ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది.

​గతంలోనూ ఇలాగే

​త్రిష కెరీర్‌లో ఇవే మొదటి వివాదాలు కావు. గతంలో కూడా ఆమె పలుమార్లు వార్తల్లో నిలిచింది.

  • ​PETA - జల్లికట్టు వివాదం: తమిళనాడు సాంప్రదాయ ఆట జల్లికట్టును నిషేధించాలని కోరిన PETA సంస్థకు మద్దతు ఇచ్చినందుకు తమిళ ప్రజలు త్రిషను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె ఇంటి ముట్టడికి కూడా ప్రయత్నించడంతో ఆమె ఆ సంస్థ నుంచి తప్పుకుంది.
  • ​మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్: ఇటీవల నటుడు మన్సూర్ అలీ ఖాన్.. త్రిషపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వివాదంలో పరిశ్రమ మొత్తం త్రిషకు మద్దతుగా నిలిచింది.
  • ​లీక్డ్ ఫోటోల వివాదం: కెరీర్ ప్రారంభంలో, ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ పార్టీలకు సంబంధించిన ఫోటోలు లీక్ అయినప్పుడు కూడా త్రిష తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.

వరుస సినిమాలతో

​వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా కెరీర్ పరంగా మాత్రం త్రిష ఎక్కడా తగ్గడం లేదు. ఒకవైపు చిరంజీవి సరసన ‘విశ్వంభర’.. మరోవైపు అజిత్, కమల్ హాసన్ వంటి టాప్ స్టార్ల సినిమాలతో బిజీగా ఉంటూ.. కాంట్రవర్సీలకు తన సక్సెస్‌తోనే సమాధానం చెబుతోంది ఈ లేడీ సూపర్ స్టార్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More