Trisha: త్రిష సరికొత్త రికార్డు.. విజయ్, అజిత్, సూర్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో ‘కామన్ ఫ్యాక్టర్’ చెన్నై చందురే!

Trisha: సీనియర్ హీరోయిన్ త్రిష జోరు మామూలుగా లేదు. కోలీవుడ్ లో ఆమె హవా కొనసాగుతోంది. దళపతి విజయ్, అజిత్ కుమార్, సూర్య కెరీర్ లోనే హైయ్యస్ట్ గ్రాసర్ మూవీస్ లో హీరోయిన్ త్రిషనే కావడం విశేషం. 

Published on: May 24, 2026, 14:48:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trisha: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సరసన నటించి దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది అందాల నటి త్రిష కృష్ణన్. ఈ భామ సరికొత్త రికార్డులతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ మే నెల త్రిషకు అన్ని విధాలా అద్భుతంగా కలిసి వచ్చింది. ఈ నెలలోనే ఆమె తన 43వ పుట్టినరోజును జరుపుకోగా, తాజాగా ఆమె నటించిన ‘కరుప్పు’ చిత్రం అదరగొడుతోంది.

ముగ్గురు టాప్ హీరోల మూవీస్ లో త్రిష
ముగ్గురు టాప్ హీరోల మూవీస్ లో త్రిష

కామన్ ఫ్యాక్టర్

కోలీవుడ్ టాప్ స్టార్స్ దళపతి విజయ్, అజిత్ కుమార్, సూర్యల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో తానే ‘కామన్ ఫ్యాక్టర్’ (common factor) అని త్రిష ఆనందం వ్యక్తం చేసింది. ఈ భామ ఇప్పుడు అరుదైన రికార్డు దక్కించుకుంది.

మూడు ఇండస్ట్రీ హిట్లు

తమిళ సినిమా రంగంలో విజయ్, అజిత్, సూర్యలను టాప్ పిల్లర్స్‌ అంటారు. వీరి ముగ్గురి కెరీర్ బెస్ట్ చిత్రాల్లో భాగస్వామి కావడంపై త్రిష సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించింది. 2023లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ సరసన త్రిష నటించిన ‘లియో’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 605.90 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించి విజయ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

అజిత్ తో

2025లో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలోనూ త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 248.25 కోట్ల రూపాయలు రాబట్టి అజిత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు తాజాగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కరుప్పు’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

త్రిష్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ (instagram)
త్రిష్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ (instagram)

వైరల్‌గా మారిన పోస్ట్

త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక అభిమాని చేసిన పోస్ట్‌ను రీ-షేర్ చేశారు. అందులో ‘లియో’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘కరుప్పు’ చిత్రాల నుంచి విజయ్, అజిత్, సూర్యలతో త్రిష ఉన్న ఫోటోలను జతచేస్తూ.. "విజయ్ హయ్యెస్ట్ గ్రాసర్ (లియో), అజిత్ హయ్యెస్ట్ గ్రాసర్ (జిబియు), సూర్య హయ్యెస్ట్ గ్రాసర్ (కరుప్పు).. వీటన్నింటికీ కామన్ ఫ్యాక్టర్ త్రిష!" అని రాశారు.

ఈ పోస్ట్‌ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అదితి రవీంద్రనాథ్ సైతం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంటూ, "వన్ అండ్ ఓన్లీ త్రిష" అంటూ కిరీటం, హార్ట్ ఎమోజీలను జతచేశారు. దీనిపై స్పందించిన త్రిష ఆ పోస్ట్‌ను లవ్ ఎమోజీతో లూప్‌లోకి తీసుకుంది.

ఇదే నెలలో ‘కరుప్పు’ షూటింగ్ లోకేషన్ల నుంచి కొన్ని అరుదైన ఫోటోలను త్రిష పంచుకుంది. "నా మ్యాజికల్ మే నెల విజయాల ఖాతాలో మరో విజయాన్ని చేర్చింది. అంతా దేవుడి దయ" అని ఆమె భావోద్వేగానికి లోనైంది. అంతేకాకుండా, ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దళపతి విజయ్ రాజకీయ వేడుకకు కూడా త్రిష హాజరైంది. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ, "ప్రేమ ఎప్పుడూ బిగ్గరగానే వినిపిస్తుంది" అని పేర్కొంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. త్రిష నటించిన ‘కరుప్పు’ సినిమా కథ ఏమిటి?

అవినీతిమయమైన న్యాయవ్యవస్థను సరిదిద్దేందుకు అడ్వకేట్ శరవణన్ రూపంలో వచ్చే ‘కరుప్పుస్వామి’ అనే గ్రామ రక్షక దేవత నేపథ్యంతో సాగే ఫాంటసీ యాక్షన్ డ్రామా ఇది.

2. సూర్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఏది?

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య, త్రిష జంటగా నటించిన ‘కరుప్పు’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

3. విజయ్, అజిత్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో త్రిష పాత్ర ఏమిటి?

విజయ్ కెరీర్ బెస్ట్ హిట్ ‘లియో’ (605.90 కోట్లు), అజిత్ కెరీర్ బెస్ట్ హిట్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (248.25 కోట్లు) చిత్రాలలో త్రిషనే ప్రధాన కథానాయికగా నటించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More