Thalapathy Vijay: భార్య విడాకుల పిటిషన్.. త్రిషతో అక్రమ సంబంధం రూమర్లు.. దళపతి విజయ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే

Thalapathy Vijay: దళపతి విజయ్ ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు. అతని నుంచి విడాకులు కోరుతూ భార్య సంగీత పిటిషన్ వేయడం, త్రిషతో అక్రమ సంబంధం రూమర్లు.. ఇలా విజయ్ వార్తల్లోనే ఉంటున్నాడు. ఈ పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ పై విజయ్ ఫస్ట్ టైమ్ రియాక్టయ్యాడు.

Published on: Mar 7, 2026, 20:54:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దళపతి విజయ్.. ఇప్పుడు వార్తల్లో, సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఈ హీరో పేరే. పొలిటికల్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో తమిళనాడు ఎన్నికల్లో పోటీచేయబోతున్నాడు. మరోవైపు విడాకుల కోసం విజయ్ భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కింది. త్రిషతో విజయ్ కు అక్రమ సంబంధం ఉందనే రూమర్లు వస్తున్నాయి. వీటన్నింటిపై తాజాగా దళపతి విజయ్ రియాక్టయ్యాడు.

దళపతి విజయ్
దళపతి విజయ్

విజయ్ రియాక్షన్

తాజాగా తన పర్సనల్ లైఫ్ లో నెలకొన్న ప్రాబ్లమ్స్ పై దళపతి విజయ్ తొలిసారిగా రియాక్టయ్యాడు. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత అయిన విజయ్ శనివారం (మార్చి 7) తన పార్టీ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాడు. అక్కడ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం మహిళలకు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించాడు.

పర్సనల్ లైఫ్

తన ప్రసంగంలో పర్సనల్ లైఫ్ గురించి కూడా విజయ్ మాట్లాడాడు. "ఇటీవల కొన్ని సమస్యలు చుట్టుముట్టాయి. వాటి కోసం పోరాడుతున్న క్రమంలో మీరు బాధపడటం నేను చూస్తున్నా. మీ బాధ చూసి నేను బాధపడుతున్నా. నేను సమస్యలను చూసుకుంటా. మీరు బాధపడకండి. చింతించాల్సిన అవసరం లేదు" అని విజయ్ అన్నాడు.

పార్టీ పథకాలు

ANI ప్రకారం.. తన పార్టీ రాబోయే తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయంగా రూ.2,500, యువతులకు వివాహ కానుకగా పట్టు చీరతో పాటు ఒక సవరం బంగారం, అన్ని కుటుంబాలకు ఆరు ఉచిత ఎల్పీజీ సిలిండర్లతో సహా అనేక హామీలను విజయ్ ప్రకటించాడు.

సంగీత విడాకుల పిటిషన్

విజయ్ నుంచి విడాకులు ఇప్పించాలని చెంగల్పట్టు జిల్లా కోర్టులో అతని భార్య సంగీత పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నివాస హక్కులు కోరుతూ సంగీత మధ్యంతర పిటిషన్ కూడా దాఖలు చేసింది. విడాకుల కేసులో తీర్పు వచ్చేంతవరకు చెన్నైలోని విజయ్ ఇంట్లో నివసించేందుకు అనుమతించాలని కోర్టును సంగీత కోరింది. ఆమె బ్రిటిష్ పౌరురాలని, ప్రస్తుతం భారతదేశంలో వేరే ఇంట్లో ఉండే అవకాశం లేదని పిటిషనల్ లో సంగీత పేర్కొంది.

త్రిషతో

విజయ్ కు ఓ హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని సంగీత సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మార్చి 5న ఓ నిర్మాత కుమారుని రిసెప్షన్ లో విజయ్, త్రిష కనిపించడం తెగ వైరల్ గా మారింది. వీళ్లు కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీంతో వీళ్ల మధ్య బంధంపై పుకార్లు మరింత ముదిరాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More