Trisha CM Vijay: నేను తమిళనాడుకు సీఎం అవుతా.. త్రిష కామెంట్స్.. దళపతి విజయ్‌తో ఎఫైర్ నేపథ్యంలో వీడియో వైరల్!
Trisha Krishnan Wants To Become CM: దళపతి విజయ్‌తో ఎఫైర్ అంటూ రూమర్స్ వస్తున్న వేళ హీరోయిన్ త్రిష తాను సీఎం అవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నట్లు త్రిష చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారాయి.
తమిళనాడు రాజకీయాల్లో సినిమా తారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఈ వేడి కారణంగానే దళపతి విజయ్‌ను టార్గెట్ చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్‌లో పర్సనల్ విషయాలు
తమిళ నాట ఓ వైపు రాజకీయాలతోపాటు మరోవైపు విజయ్ పర్సనల్ విషయాలు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. దళపతి విజయ్ భార్య సంగీత విడాకులు కావలంటూ చెన్నై కోర్టును ఆశ్రయించడం, హీరోకు ఓ హీరోయిన్‌తో అక్రమ సంబంధం ఉందంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు సౌత్ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపాయి.
పేరు చెప్పకుండా సంగీత చేసిన వ్యాఖ్యలు ఇన్‌డైరెక్ట్‌గా హీరోయిన్ త్రిషను చూపించాయి. విజయ్‌తో ఎఫైర్ పెట్టుకుంది హీరోయిన్ త్రిషనే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఏజీఎస్ ప్రొడక్షన్ అధినేత కల్పతి సురేష్ కుమారుడి వివాహ వేడుకకు విజయ్, త్రిష జంటగా హాజరు కావడం ఆ రూమర్స్‌కు బలాన్ని చేకూర్చాయి.
మ్యాచింగ్ డ్రెస్సులో
మ్యాచింగ్ డ్రెస్సింగ్‌తో పెళ్లిలో విజయ్, త్రిష కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దాంతో సంగీత చేసిన కామెంట్స్ నిజమే కావొచ్చంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో గతంలో త్రిష సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.
సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్‌కు సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అది 2004 నాటి మాట.. అప్పుడప్పుడే త్రిష స్టార్ హీరోయిన్‌గా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది. అప్పట్లో సన్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. "భవిష్యత్తులో తమిళనాడుకు ముఖ్యమంత్రి కావాలన్నదే నా కోరిక" అని సరదాగా వ్యాఖ్యానించారు.
"నేను సీఎం అవుతా.. వేచి చూడండి!"
మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ అందుకున్న త్రిషను, అప్పట్లో తన బకెట్ లిస్ట్ (చేయాలనుకున్న పనులు) గురించి అడిగారు యాంకర్.
అప్పుడు త్రిష నవ్వుతూ.. "నిజంగా చెబుతున్నాను, నాకు తమిళనాడు సీఎం కావాలని ఉంది. వచ్చే పదేళ్లలో నేను ఆ పదవిని సాధిస్తాను, కావాలంటే వేచి చూడండి" అని బదులిచ్చారు. ఒకవేళ మీరు సీఎం అయితే ఏం చేస్తారు? అని ప్రశ్నించగా.. "ముందు మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించండి, అప్పుడు చెబుతాను ఏం చేస్తానో!" అని చమత్కరించారు త్రిష.
రాజకీయాల్లో ఎంట్రీ కోసమే
ఆనాడు త్రిష కేవలం సరదాగా అన్న ఆ మాటలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త చర్చకు దారితీశాయి. త్రిష సరదాగా అనిందో, లేక కావాలనే చెప్పిందో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎంట్రీ కోసమే దళపతి విజయ్‌తో త్రిష క్లోజ్‌గా ఉంటోందని మరికొందరు అంటున్నారు.
విజయ్-త్రిష చుట్టూ రాజకీయాలు
ముఖ్యంగా దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టాకే త్రిష పేరు తరచుగా వినిపిస్తోంది. రీసెంట్‌గా తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్.. విజయ్ పేరును ప్రస్తావిస్తూ త్రిషను ఈ వివాదంలోకి లాగడం పెద్ద దుమారమే రేపింది.
అనంతరం విజయ్ భార్య సంగీత విడాకులు, ఓ హీరోయిన్ అని చెప్పడం, వివాహ వేడుకలో విజయ్, త్రిష జంటంగా కనిపించడం వంటి విషయాలను నెటిజన్స్ లింక్ చేసి చూస్తున్నారు.
త్రిష-విజయ్ సినిమాలు
ఇదిలా ఉంటే, విజయ్-త్రిష గతంలో 'గిల్లి', 'లియో' వంటి హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. ఇటీవల 'ది గోట్' సినిమాలోనూ త్రిష ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


