War: ముదురుతున్న యుద్ధ జ్వాలలు- దుబాయ్‌లో చిక్కుకున్న బోల్డ్ హీరోయిన్ మలైకా తల్లి- క్షిపణుల విధ్వంసం చూశానంటూ మేసెజ్!
Malaika Arora Mother Joyce Polycarp Stranded In Dubai: యుద్ధం కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ మలైకా అరోరా తల్లి జాయిస్ పాలికార్ప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశంలో క్షిపణులు పేలుతుంటే భయమేసిందని, అయితే అక్కడి సైన్యంపై తనకు నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు సామాన్యులనే కాకుండా సెలబ్రిటీల కుటుంబాలను కూడా ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ మలైకా అరోరా, అమృతా అరోరా తల్లి జాయిస్ పాలికార్ప్ ప్రస్తుతం దుబాయ్‌లో చిక్కుకుపోయారు. ఆకాశంలో క్షిపణులను అడ్డుకుంటున్న (Missile Interception) భయానక దృశ్యాలను తాను కళ్లారా చూశానని ఆమె పేర్కొన్నారు.

బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఇంతలో యుద్ధం
తన పుట్టినరోజు వేడుకల కోసం దుబాయ్‌లో మలైకా సోదరి అమృతా అరోరా దగ్గరికి జాయిస్ పాలికార్ప్ వెళ్లారు. అక్కడే తన పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. "నేను మార్చి 3న ముంబై తిరిగి రావాల్సి ఉంది. కానీ యుద్ధం కారణంగా విమానాలన్నీ రద్దయ్యాయని మెసేజ్ వచ్చింది" అని ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ జాయిస్ పాలికార్ప్ వెల్లడించారు.
సైన్యంపై నమ్మకం.. కుమార్తెలతో నిత్యం టచ్‌లో..
అక్కడి పరిస్థితుల గురించి వివరిస్తూ.. "ఆకాశంలో క్షిపణులు ఒకదాన్నొకటి ఢీకొని పేలిపోతుంటే చూడటానికి చాలా భయంగా అనిపించింది. కానీ, ఇక్కడి సైన్యం చేస్తున్న పని అద్భుతం. నేను సురక్షితంగా ఉన్నానని నా కుమార్తెలకు తెలుసు. వారు రోజుకు మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగుతున్నారు. ఇప్పుడు కొన్ని విమానాలు మళ్లీ మొదలయ్యాయని తెలిసింది, త్వరలోనే ముంబై చేరుకుంటానని ఆశిస్తున్నాను" అని జాయిస్ పాలికార్ప్ ధీమా వ్యక్తం చేశారు.
అమ్మే మా వెన్నెముక: మలైకా
జాయిస్ పాలికార్ప్ పుట్టినరోజు సందర్భంగా మలైకా అరోరా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "అమ్మే మా వెన్నెముక, మా సర్వస్వం" అంటూ తన సోదరి అమృతతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు మలైకా అరోరా.
2024లో మరణం
ఇకపోతే మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా 2024లో మరణించిన సంగతి తెలిసిందే. భావోద్వేగపు సన్నివేశాల్లో కూడా తన తల్లిని ఒక ధైర్యవంతురాలైన మహిళగా ఎప్పుడూ అభివర్ణిస్తుంటారు.
యుద్ధం కారణంగా
యుద్ధం కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. విమాన రాకపోకలు పాక్షికంగా పునరుద్ధరణ కావడంతో జాయిస్ వంటి ఎందరో భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు.
చిక్కుకున్న సెలబ్రిటీలు
ఇదిలా ఉంటే, దుబాయిలో చాలా మంది సెలబ్రిటీలు ఇదివరకే చిక్కుకున్నారని తెలిసిందే. వారిలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు, హీరోయిన్ సోనాల్ చౌహన్, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, బాలీవుడ్ బ్యూటీలు ఈషా గుప్తా, నర్గీస్ ఫక్రీ, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ఉన్నారు.
ఇండియాకు ఈషా గుప్తా
ఇటీవలే ఈషా గుప్తా ఇండియాకు చేరుకున్నట్లు కూడా తెలిపింది. త్వరలో ఇతర సెలబ్రిటీలు కూడా సొంతింటికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


